Daily Current Affairs in Telugu 14-09-2020
విశ్వేశ్వరయ్య పురస్కారానికి తెలంగాణా నుంచి ఇద్దరు డైరెక్టర్ ల ఎంపిక :
ఇంజనీర్ డేను పురస్కరించుకొని వివిధ రంగాలలో రాణించిన వారికి పుర స్కారాల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ శాఖ విజే తల పేర్లను వెల్లడించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పురస్కారాన్ని ఎన్.ఐ టి. వరంగల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.రమణారావు, డీఆర్డీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జైరీత్ జోషిలకు సంయుక్తంగా అందజేయనున్నారు. ఇంజినీర్స్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఓయూ ప్రొఫెసర్ ఎం.గోపాల్ నాయక్, డీడీవో ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎన్.కిషోర్ నాథ్, భెల్ సీనియర్ డీజీఎం (హైదరాబాద్) డాక్టర్ ఎం.మోహన్ రావు కి ఇవ్వనున్నారు. యంగ్ ఇంజినీర్స్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కోసం సీఎఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్త అల్కా కుమారి, బెల్ డిప్యూటీ మేనేజర్ డాక్టర్ పవన్ ఆలపాటి వెంకటేష్ ఎంపికైనట్లు సంస్థ గౌరవ సభ్యులు టి.అంజయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: విశ్వేశ్వరయ్య పురస్కారానికి తెలంగాణా నుంచి ఇద్దరు డైరెక్టర్ ల ఎంపిక
ఎవరు: డాక్టర్ ఎన్.వి.రమణారావు, జైరీత్ జోషి
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు: సెప్టెంబర్ 14న
జపాన్ దేశ నూతన అద్యక్షుడిగా యోషిహిడే సుగా ఎంపిక :
జపాన్ అధికార పార్టీ నూతన సారథిగా యోషిహిడే సుగా గారు ఎంపికయ్యారు. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 977 ఓట్లు సాధించిన౦దుకుగాను కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు. ప్రస్తుతం చీఫ్ కేబినెట్ సెక్రటరీగా అబేకి కుడిభుజంగా ఉన్నారు. ఆయన సారథిగా ఎంపిక కావడం లాంఛనమే. కరోనా కట్టడి, పతన మైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలు గా పేర్కొన్నారు. తాను సంస్కరణ వాదినన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయన కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జపాన్ దేశ నూతన అద్యక్షుడిగా యోషిహిడే సుగా ఎంపిక
ఎవరు: యోషిహిడే సుగా
ఎక్కడ:జపాన్
ఎప్పుడు: సెప్టెంబర్ 14న
రాజ్యసభ డిప్యుటీ చైర్మన్గా మరోసారి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక :
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సభా నాయకుడు థావర్ చంద్ గెహ్లాట్ ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో ఆయన ఎన్నిక య్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం ఆర్జేడి సభ్యుడు మనోజ్ కుమార్ ను తమ అభ్యర్థిగా ప్రతిపాదించారు కానీ, ఓటింగ్ కు పట్టుబట్టలేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా మరోసారి ఎన్నికైన జేడీయూ నేత హరి వంశ్ ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన అన్ని పక్షాలకు చెందిన వాడన్నారు. సభను నిష్పక్షపా తంతో నడుపుతారని,. అద్భుతమైన అంపైర్ అద్భుతమైన అంపైర్ అని ప్రశంసించారు. జర్నలిస్ట్ గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా అందరికీ అప్తుడిగా ఉన్నారన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాజ్యసభ డిప్యుటీ చైర్మన్గా మరోసారి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక
ఎవరు: హరివంశ్ నారాయణ్ సింగ్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 14న
యుఎస్ ఓపెన్ ను కైవసం చేసుకున్న థీం :
యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లాం ట్రోఫీ ని ముద్దదాలనే కలను నిజ చేసుకునే దిశగా పోరాటం కొనసాగిస్తూ మూడు సార్లు చివరి దాక వచ్చి ఆగిపోయాడు.. యుఎస్ ఓపెన్ విజయంతో ఎట్టకేలకు గ్రాండ్ స్లామ్ బైటిల్ ను ఖాతాలో వేను ఉన్నాడు ఆస్ట్రియన్ ఆటగాడు డొమినిక్ థీం . ప్రతిష్టాత్మక టోర్నీ పురుషులు సింగిల్ తుది పోరు ఒత్తిడి మద్యలో కూడా ఈ విజయాన్ని సాధించాడు.. అలాంటి కీలకమైన పోరులో రెండు సెట్లు చేజార్చుకుని ఇక విజయం సాద్యం కాదని స్థితిలో వరుసగా మూడు సెట్లు గెలిచి విజయం సాధించాడు.రెండో సీడ్లో థీమ్ అద్భుతమే చేశారు. తన ఉత్కం నను సాగిన ఫైనల్ అతను 2-6,4-6,6-4,6-3.,7-6 (8/6) తేడాతో అయిదో సీడ్ క్వారెస్ పై విజయం సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎస్ ఓపెన్ ను కైవసం చేసుకున్న థీం
ఎవరు: థీం
ఎప్పుడు: సెప్టెంబర్ 14న
ఛత్తీస్‌గడ్ రాష్ట్ర మాజీ మంత్రి చనేష్ రామ్ రతియా కన్నుమూత:
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఛత్తీస్‌గడ్ రాష్ట్ర చనేష్ర రాం తియా కోవిడ్ -19 కారణంగా కన్నుమూశారు. 1977 లో అప్పటి అవిభక్త మధ్యప్రదేశ్‌లోని ధరంజైగ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రతియా మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పశుసంవర్ధక మంత్రిగా పనిచేశారు. 2000 లో ఛత్తీస్‌గద్ ఏర్పడిన తరువాత రజియా అజిత్ జోగి ప్రభుత్వంలో (2000-2003) ఆహార, పౌర సరఫరా మంత్రిగా కూడా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఛత్తీస్‌గడ్ రాష్ట్ర మాజీ మంత్రి చనేష్ రామ్ రతియా కన్నుమూత
ఎవరు: చనేష్ రామ్ రతియా
ఎక్కడ: ఛత్తీస్‌గడ్
ఎప్పుడు: సెప్టెంబర్ 14న
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |