
Daily Current Affairs in Telugu 28-09-2020
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అద్యక్షుడిగా ఎన్నికైన ఎల్.ఆదిమూలం:

దేశంలోనే న్యూస్ పేపర్లు మ్యగాజిన్లు పిరియడికల్స్ కు సంబంధించిన అపెక్స్ బాడి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) 2020-21) అధ్యక్షునిగా ఎల్.ఆదిమూలంగారు ఎన్నికయ్యారు. 81వ వార్షిక సాదారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.ఎల్.ఆదిమూలం గారు హెల్త్ అండ్ ది యాం టి సెప్టిక్ జర్నల్ ప్రతినిధిగా ఉన్నారు. ఐఎన్ఎ నూతన కార్యవర్గంలో డిప్యుటీ ప్రెసిడెంట్ గా ఆనందబజార్ పత్రిక నుంచి డి.డి పుర్కయస్తూ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎకనామిక్ టైమ్స్ నుంచి మోహిత్ జైన్ గారిని గౌరవ కోశాధికారి రాకేశ్ (ఆజ్ సమాజ్ ) సెక్రటరీ జనరల్ గా మేరీ పాల్ గారు ఎన్నిక అయ్యారు.ఇందులో మరో పదకొండు మంది సబ్యులుగా కూడా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అద్యక్షుడిగా ఎన్నికైన ఎల్.ఆదిమూలం
ఎవరు: ఎల్.ఆదిమూలం
ఎప్పుడు: సెప్టెంబర్ 28
పుట్ బాలార్ ఆఫ్ ది ఇయర్ 2020-21 గా నిలిచిన ప్లేయర్ గురుప్రీత్ :

అఖిల భారత పుట్ బాల్ సమాఖ్య (ఏ ఐఎఫ్ఎఫ్) సంబంధించిన అవార్డులలో 2019-20 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో గోల్ కీపర్ అయిన గురుప్రీత్ కు మహిళల విభాగంలో మిడ్ ఫీల్డర్ సంజు “పుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్-2020-21” అవార్డులను దక్కించుకున్నారు. మరియు రతన్ బాలాదేవి కి ఎమర్జింగ్ మహిళా “పుట్ బాల్ ప్లేయర్ ఆవార్డు” ను దక్కించుకుంది. తొలిసారిగా ఈ అవార్డుకు ఎంపిక అయిన 28 సంవత్సరాల గురుప్రీత్ 2009 లో సుబ్రతా పాల్ తరువాత ఈ అవార్డు ను గెలుచుకున్న ప్లేయర్ గా నిలిచాడు. ఇంతక ముందు పుట్ బాల్ టీం కెప్టెన్ సునీల్ చత్రి ఈ అవార్డును చాలా సార్లు గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ 2020-21 గా నిలిచిన పుట్బాల్ ప్లేయర్ గురుప్రీత్
ఎవరు: పుట్బాల్ ప్లేయర్ గురుప్రీత్
ఎప్పుడు: సెప్టెంబర్ 28
ట్రాయ్ సంస్థ నూతన చైర్మన్ గా నియమితులయిన పి.డి వఘేలా :

టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సంస్థ నూతన చైర్మన్ గా సీనియర్ బ్యూరో క్రాట్ పి.డి వఘేలా గారు నియమితులయ్యారు. ఆయన పదవి కాలం మూడేళ్ళ పాటు లేదా ఆయనకు 65 ఏళ్ళు వచ్చే దాకా ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ గా ఆర్.ఎస్ శర్మ పదవి కాలం సెప్టెంబర్ 30 తో పూర్తి కానుంది.గుజరాత్ కేడర్ ఐఎస్ఎస్ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు సేవల విదానం (జి.ఎస్.టి) అమల్లోకి తేవడం లో కీలక పాత్ర పోషించిన అధికారులలో వఘేలా కూడా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ట్రాయ్ సంస్థ నూతన చైర్మన్ గా నియమితులయిన పి.డి వఘేలా
ఎవరు: పి.డి వఘేలా
ఎక్కడ: న్యు డిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 28
ద్వైవార్షిక నావికాదళ విన్యాసం జిమెక్స్-20 ప్రారంభించిన భారతదేశం-జపాన్ :

జపాన్-ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక విన్యాసం (జిమెక్స్) యొక్క నాల్గవ ఎడిషన్ను ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమైంది. కోవిడ్ -19 పరిమితుల దృష్ట్యా దీనిని ‘నాన్-కాంటాక్ట్ ఎట్-సీ-ఓన్లీ ఫార్మాట్’లో నిర్వహిస్తున్నారు. భారతదేశం నుండి, చెన్నై, టెగ్, తార్కాష్ మరియు ఫ్లీట్ ట్యాంకర్ దీపక్ యుద్ధనౌకలు భారత నావికాదళానికి ప్రాతినిధ్యం వహిస్తాయి, జపాన్ యుద్ధనౌకలు రాగా ఇందులో ఇకాజుచి జపాన్ కు కసరత్తులో ప్రాతినిధ్యం వహిస్తాయి. JIMEX-20 అనే అధునాతన వ్యాయామాలను నియమ నిబందనల తో అధిక-స్థాయి ఆపరేషన్ మరియు ఉమ్మడి కార్యాచరణ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది మరియు రెండు నావికాదళాల మధ్య సహకారం మరియు పరస్పర విశ్వాసాన్ని మరింత పెంచుతుంది అనేది ఈ కార్యక్రమ ఉద్దేశం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ద్వైవార్షిక నావికాదళ వ్యాయామం జిమెక్స్-20 ప్రారంభించిన భారతదేశం-జపాన్
ఎవరు: భారతదేశం-జపాన్
ఎప్పుడు:సెప్టెంబర్ 28
ప్రపంచ రేబిస్ వ్యాధి నివారణ దినోత్సవం గా సెప్టెంబర్ 28:

రాబిస్ నివారణ గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి మరియు ఈ భయంకరమైన వ్యాధిని ఓడించడంలో పురోగతిని సాధించడానికి దీనిని ఏటా సెప్టెంబర్ 28న గా జరుపుకుంటారు. మొదటి రాబిస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు మైక్రోబయాలజిస్ట్ లూయిస్ పాశ్చర్ మరణించిన వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 28 కూడా సూచిస్తుంది. సెప్టెంబర్ 28 ప్రపంచ రాబిస్ దినోత్సవంను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం 2007 లో ప్రారంభమైంది. అమెరికాతో సహా పలు దేశాల్లో ప్రపంచ రాబిస్ దినోత్సవం జరుపుకుంటారు. రాబిస్ 100% నివారించగల వ్యాధి అయితే, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 59,000 మందికి పైగా ఈ వ్యాధితో మరణిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ రేబిస్ వ్యాధి నివారణ దినోత్సవం గా సెప్టెంబర్ 28
ఎవరు:WHO
ఎప్పుడు: సెప్టెంబర్ 28
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |