Daily Current Affairs in Telugu 27-09-2020

current affairs in telugu 2020

Daily Current Affairs in Telugu 27-09-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

తెలంగాణా ఆర్చరీ సంఘం అద్యక్షుడిగా అనిల్ కామినేని నియామకం :

తెలంగాంణా అర్చరి సంఘం (టిఏఎస్) అద్యక్షుడిగా అనిల్ కామినేని గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సెప్టెంబర్ 27న హైదాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఆవరణలోని ఒలింపిక్ భవన్ లో ఎన్నికలు నిర్వహించారు.ఆలిండియా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రమోద్ చందూడ్కర్ తెలంగాణా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.ఉపాధ్యక్షులుగా రాజు (మెదక్) ప్రధాన కార్యదర్శిగా సంజీవ రెడ్డి (నిజామాబాద్) కోశాధికారిగా,పుట్ట శంకరయ్య (ఖమ్మం) లు సంయుక్త కార్యదర్శిగా కే.శ్రీనివాస్ లతో పాటు మరో ఏడుగురు ఎగ్సిక్యుటివ్ సబ్యులుగా ఎన్నికయ్యారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: తెలంగాణా ఆర్చరీ సంఘం అద్యక్షుడిగా అనిల్ కామినేని నియామకం

ఎవరు : అనిల్ కామినేని

ఎక్కడ: తెలంగాణా ఆర్చరీ సంఘం

ఎప్పుడు: సెప్టెంబర్ 27

రష్యా గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచినా వల్టేరి బోల్టాస్ :

91వ విజయం తో ఎఫ్1దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న ప్రపంచ  రికార్డులనుసమం చేయాలనుకున్న లూయిస్ హమిల్టన్ (మెర్సిడెజ్)కు నిరాశ తప్ప లేదు.అతడి జట్టుకే చెందిన వాల్టే రీ  బొటాస్ రష్యన్ గ్రాండ్ ఫ్రీ ని ఎగరేసుకుపోయాడు.సెప్టెంబర్ 27న ఫేవరేట్ గా పోల్ పొజిషన్ నుంచి రేసును అరంబించిన హమిల్టన్ రేసును మూడో స్థానంలో ముగించారు. టైం పెనాల్టీ ల కారణంగా అతడు దెబ్బ తిన్నాడు .మ్యాక్స్ వేర్ స్టాఫెన్ (రెడ్ బుల్) రెండో స్థానంను  సాధించాడు.ఈ రేసులో గెలవకున్న చాంపియన్ షిప్ రేసులో హమిల్టన్ మంచి ఆధిక్యంతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.సీజన్ లో మరో ఏడు రేసులు మిగిలి ఉండగా రెండో స్థానంలో ఉన్న బోతాస్ కన్నా హమిల్టన్ 44 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: రష్యా గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచినా వాల్టేరి బోల్టాస్

ఎవరు : వాల్టేరి బోల్టాస్

ఎక్కడ:రష్యా

ఎప్పుడు: సెప్టెంబర్ 27

ప్రపంచ రిస్క్ రిపోర్ట్ 2020 89 వ స్థానంలో నిలిచిన భారత్ :

వరల్డ్ రిస్క్ ఇండెక్స్ (డబ్ల్యుఆర్ఐ) 2020 ప్రకారం, 181 దేశాలలో భారతదేశం 89 వ స్థానంలో ఉంది. WRI ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ పర్యావరణ మరియు మానవ భద్రత (UNUEHS)  సహకారం తోదీనిని అభివృద్ధి చేయబడింది మరియు అంతర్జాతీయ శాంతి మరియు సాయుధ సంఘర్షణ (IFHV) చేత దీనిని లెక్కించబడుతుంది. విపత్తులను ఎదుర్కోగల సామర్ధ్య౦, అనుకూల సామర్థ్యాలు లేకపోవడం మరియు విపరీత సంఘటనలను ఎదుర్కోవటానికి సంసిద్ధత విషయంలో భారతదేశం శ్రీలంక, భూటాన్ మరియు మాల్దీవుల వెనుక ఉంది. నివేదిక ప్రకారం, గ్లోబల్ హాట్‌స్పాట్‌లు ఓషియానియా, సౌత్ ఈస్ట్ ఆసియా, మధ్య అమెరికా, పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలో ఉన్నాయి.

క్విక్ రివ్యు:

ఏమిటి: ప్రపంచ రిస్క్ రిపోర్ట్ 2020 89 వ స్థానంలో నిలిచిన భారత్

ఎవరు : భారత్

ఎప్పుడు: సెప్టెంబర్ 27

UN ఇంటరజెన్సీ టాస్క్ ఫోర్స్ (UNIATF) -2020 అవార్డును గెలుచుకున్న కేరళ  :

నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల నివారణ మరియు నియంత్రణపై ఐక్యరాజ్యసమితి  ఇంటర్-ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ 2020 ను కేరళ రాష్ట్రము గెలుచుకుంది.కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజ మాట్లాడుతూ ఈ రంగంలో ఆరోగ్య రంగంలో కేరళ చేసిన కృషికి చేసిన గుర్తింపుగాను ఈ అవార్డు దక్కింది.”జీవనశైలి వ్యాధుల చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ప్రజారోగ్య కేంద్రాల నుండి అన్ని స్థాయిలలోని ఆసుపత్రులకు సౌకర్యాలు ఏర్పాటు చేసింది” అని శైలజ ఒక ప్రకటనలో తెలిపారు.  కోవిడ్ -19 కాలంలో మరనాల రేటును నియంత్రించగలిగింది. ఎందుకంటే ఎన్‌సిడిలపై దృష్టి పెట్టగలిగింది..సంక్రమించని వ్యాధుల నివారణ మరియు నియంత్రణపై ఈ సంవత్సరం UN ఇంటరజెన్సీ టాస్క్ ఫోర్స్ (UNIATF) అవార్డును ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రకటించారు.

.క్విక్ రివ్యు:

ఏమిటి: UN ఇంటరజెన్సీ టాస్క్ ఫోర్స్ (UNIATF) -2020 అవార్డును గెలుచుకున్న కేరళ  

ఎవరు : కేరళ  

ఎక్కడ: కేరళ  

ఎప్పుడు: సెప్టెంబర్ 27

మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్  కన్నుమూత :

కేంద్ర మాజీ మంత్రి బాజాపా వ్యవస్థాపకుడు సబ్యుడు మాజీ ప్రదాని అటల్ బిహారి వాచ్ పేయి కి అత్యంత ఆప్తుడు జస్వంత్ సింగ్ (82)  కన్నుమూసారు.దీర్గాకలికంగా అనారోగ్యంగా బాధపడుతున్న అయన సెప్టెంబర్ 27 న ఉదయం డిల్లిలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరేట్ ఆసుపత్రిలో కన్నుమూసారు.జస్వంత్ పలు పర్యాయాలు రాజ్యసభ లోక్ సభల్లో సబ్యుడిగా సేవలందించడం తో పాటు  కేంద్ర కేబినేట్ లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడిగా గాను బాద్యతలు నిర్వర్తించారు. వాజ్ పేయి  ప్రభుత్వంలో ఆయనకు సంక్షోబ పరిష్కర్త అనే పేరుంది.

క్విక్ రివ్యు:

ఏమిటి: మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్  కన్నుమూత

ఎవరు : జస్వంత్ సింగ్

ఎక్కడ:న్యుదిల్లి

ఎప్పుడు: సెప్టెంబర్ 27

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *