Daily Current Affairs in Telugu 13-09-2020
భారతీయ చిత్రానికి దక్కిన వెనిస్ పురస్కారం :
వెనిస్ చిత్రోత్స వంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రం సత్తా చాటింది మరాటి చిత్రం ‘ది డిసిపల్ చిత్రాన్ని తెరకెక్కించి స్క్రీన్ ప్లే అందించిన దర్శకుడు చైతన్య తమ్హానే కు ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ పురస్కారం దక్కింది. యూరోపియన్ చిత్రోత్స వంలో మీరా నాయర్ తర్వాత ఈ పురస్కారం గెలుచుకున్న తొలి దర్శకుడు చైతన్య కావడం విశేషం .2001లో మీరా నాయర్ చిత్రం “మాన్సూన్ వెడ్డింగ్-గోల్డెన్ “లయన్ అవార్డు గెలుచుకుంది కానీ ‘ది డిసిపల్’ ద్వితీయ పురస్కారంతో సరి పెట్టుకోవలసి వచ్చింది. ప్రథమ పురస్కారం ఆయన గోల్డెన్ లయన్ ‘నోమాడ్ ల్యాండ్ గెలుచుకుంది. సెప్టెంబర్ 11సాయంత్రం చిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని లైవ్ ప్రసారం చేశారు భారతీయ శాస్త్రీయ సంగీతంలో గొప్ప గాయకుడు కావడం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన శరద్ నెరుల్కర్ అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథతో ‘ది డిసిపల్”చిత్రం తెరకెక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి భారతీయ చిత్రానికి దక్కిన వెనిస్ పురస్కారం
ఎవరు: చైతన్య తమ్హానే
ఎప్పుడు: సెప్టెంబర్ 13
యుఎఈ దేశ క్రికెటర్ల పై తాత్కాలిక నిషేధం విధించిన ఐసీసీ :
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. యూఏఈకి చెందిన ఆమిర్ హయత్, అష్ఫాక్ అహ్మద్లు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం నిబంధనల ప్రకారం వీరిద్దరిపై ఐదు వేర్వేరు ఆరోపనలు నమోదయ్యాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు 14 రోజుల్లోగా తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అష్ఫాక్ పై గత ఏడాది అక్టోబర్ లో టి20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ సందర్భంగా తాత్కాలిక నిషేధం విధించింది. ఈదర్యాప్తు కొనసాగుతుండటంతో అతనిపై ఏమేం ఆరోపణలు ఉన్నాయో ఐసీసీ స్పష్టతనివ్వలేదు. అష్ఫాక్ 16 వన్డేలు, 12 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, హయత్ 8 వన్డేలు 4 టి20లు ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎఈ దేశ క్రికెటర్ల పై తాత్కాలిక నిషేధం విధించిన ఐసీసీ
ఎవరు:ఐసీసీ
ఎక్కడ:యుఎఈ
ఎప్పుడు: సెప్టెంబర్ 13
టస్కన్ గ్రాండ్ ఫ్రీ టైటిల్ ను సొంతం చేసుకున్నలూయిస్ హమిల్టన్ :
గత రేసులో ఎదురైన పరాజు యాన్ని పక్కన పెట్టి మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ విజయం సాధించాడు. సెప్టెంబర్ 13 న జరిగిన టస్కన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేసులో లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో తొమ్మిది రేసులు జరగ్గా అందులో హామిల్టన్ కి ఇది ఆరో విజయం కావడం విశేషం: ‘పోల్ పొజిషన్ తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 59. ల్యాప్ లను 2 గంటల 19 నిమిషాల 35.060 సెకన్లలో ముగించి తన కెరీర్లో 90వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని సంపాదించాడు.ఈ క్రీడా చరిత్రలో 1000వ రేసులో బరిలోకి దిగిన ఫెరారీ జట్టుకు ఆశించిన ఫలితం రాలేదు. ‘ఆ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెర్న్ 8వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు.సెబాస్టియన్ వెటెల్ 10వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్ తో సరిపెట్టుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి టాస్కన్ గ్రాండ్ ఫ్రీ టైటిల్ ను సొంతం చేసుకున్న లూయిస్ హమిల్టన్
ఎవరు: లూయిస్ హమిల్టన్
ఎక్కడ:ఇటలీ
ఎప్పుడు: సెప్టెంబర్ 13
యుఎస్ ఒపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన నయోమి ఒసాక :
ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదల కోల్పోకుండా ఆడిన జపాన్ యువతార నయోమి ఒసాక తన కెరీర్ లో మూడో గ్రాండ్ స్లాం బైటిట్ ను హస్తగతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లాం మహిళల గల విభాగంలో ప్రపంచ మాజీ ముఖ్య నాలుగో సీడ్ ఒసాకా చాంపియన్ గా నిలిచింది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12 అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఇది గంటా 50 నిమిషాలలో 1-6,6-3l,6-తో ప్రపంచ మాజీ నెంబర్ వన్ ప్రస్తుతం 27వ ర్యాంకర్ విక్టోరియా (బెలారస్) పై విజయం సాధించింది. ఒసాక తన కెరీర్ లో ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఆమె2018 లోను దాంపియన్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఒసాకా కు 30లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ అజరెంజకా కు 15లక్షల డాలర్లు రూ.11కోట్లు )ప్రైజ్ మనీ గా లబించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి యుఎస్ ఒపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన నయోమి ఒసాక
ఎవరు: నయోమి ఒసాక
ఎక్కడ:న్యూయార్క్
ఎప్పుడు: సెప్టెంబర్ 13
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ కన్నుమూత :
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ (74) కన్నుమూశారు ఢిల్లీ ఎయిమ్స్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు గత సెప్టెంబర్ 11న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచారు. జూన్ లో రఘురాం కు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో పాట్నా ఎయిమ్స్ లో చికిత్స పొందారు. ఈయన భీహర్ లోని వైశాలి నుంచి లోక్ సభ స్థానం నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు.యుపిఎ హయం లో కేంద్ర గ్రామీనబివ్రుద్ది శాఖ మంత్రిగా పని చేసారు.ఆర్జెడి చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కు విశ్వాస పాత్రుడిగా ఉంటూ రాష్ట్ర జాతీయ స్థాయి రాజకీయాలలో తనదైన ప్రాత్ర పోషించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి కేంద్ర మాజీ మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ కన్నుమూత
ఎవరు: రఘువంశ ప్రసాద్ సింగ్
ఎక్కడ:భీహర్
ఎప్పుడు: సెప్టెంబర్ 13
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |