Daily Current Affairs in Telugu 13-06-2020
అమెరికా మిలిటరీ అకాడమి నుంచి తొలి సిక్కు గ్రాడ్యుయేట్ గా నిలిచిన అన్మోల్ :
ప్రవాస భారతీయ సిక్కుకుటుంబాని కి చెందిన అన్మోల్ నారంగ్ (23) అమెరికా లో సరికొత్త చరిత్ర సృష్టించారు.218 ఏళ్ల సుదీర్గ చరిత్ర ఉన్న ప్రతిస్తాత్మక యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా ను సాధించిన తొలి సిక్కు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. జూన్ 12 జరిగిన స్నాతకోత్సవంలో అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో అన్మోల్ పట్టా అందుకున్నారు.ఇప్పటికే ఆమె సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తదుపరి ఆమె ఒక్లోహమాలోని లాటన్ లో ఉన్న ఫోర్ట్ సిల్ సైనిక కేంద్రం లో బేసిక్ ఆఫీసర్ గా లీడర్ షిప్ కోర్సులో ఆమె శిక్షణ తీసుకోనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా మిలిటరీ అకాడమి నుంచి తొలి సిక్కు గ్రాడ్యుయేట్ గా నిలిచిన అన్మోల్
ఎవరు: అన్మోల్ నారంగ్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జూన్ 13
కొత్తగా రూపొందించిన నేపాల్ దేశ పతాకం కు ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం :
భారత భూబాగాలను తమవిగా పేర్కొంటూ కొత్తగా నేపాల్ ప్రభుత్వం రూపొందించిన వివాదాస్పద రాజకియ చిత్రపటానికి పార్లమెంట్ ఆమోదం లబించింది. దీన్ని అధికారికంగా ప్రకటించేందుకు వీలుగా జాతీయ చిహ్నానికి సంబంధించిన రాజ్యాంగంలోని షెడ్యుల్-3 సవరణ బిల్లుకు జూన్ 12 మద్దతు తెలిపాయి. భారత సరిహద్దుల్లోని లింపు లెఖ్ ,కాలపాని, లిమ్పియాదురాలు తమవే అంటూ నేపాల్ సర్కార్ ఇటివల వివాదాస్పద రాజకీయ చిత్రపటం ను రూపొందించిన సంగతి తెలిసిందే. రాజ్యంగా సవరణ బిల్లుపై దిగువ సభలో ఓటింగ్ నిర్వహించగా హాజరైన 258 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో నేపాల్ జాతీయ చిహ్నం ఓ కొత్త రాజకీయ చిత్రపటాన్ని పొందుపరచెందుకు మార్గం సుగమం అయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కొత్తగా రూపొందించిన నేపాల్ దేశ పతాకం కు ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం
ఎవరు: నేపాల్
ఎక్కడ:నేపాల్
ఎప్పుడు: జూన్ 13
61 ఉపగ్రహాలను భూకక్ష్య లోకి ప్రయోగించిన స్పేస్ ఎక్స్ సంస్థ :
అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్ జూన్ 13 న విజయవంతగా 58 ఉపగ్రహాలను రోదసి లోకి పంపింది.వీటి తో పాటు మూడు స్కై శత ఉపగ్రహాను దిగువ భూకక్ష్య లోకి ప్రయోగించింది.ఫాల్కన్ -9 రాకెట్ ద్వారా అమెరకా లో ని కేప్ కేనవేరా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.ప్రయోగానంతరం ఈ రాకెట్ తిరిగి క్షేమం గా భూమికి తిరిగొచ్చింది.తాజాగా ప్రయోగించిన వాటి లో 58 ఉపగ్రహాలు స్టార్ లింక్ ప్రాజెక్టు కు సంబంహించినవి భూమి పై విస్తృత స్థాయిలో బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సంధానత ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2018 ఫిబ్రవరిలో ఏఎ ప్రాజెక్టు ప్రారంబమైంది. దీని కింద మొత్తం 12వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.తాజాగా కక్శ్యలొకి ప్రవేశించిన స్కై షాట్ శాటిలైట్ లు భూమికి మీద నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలను అప్పటికప్పడు అందించగలవు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 61 ఉపగ్రహాలను భూకక్ష్య లోకి ప్రయోగించిన స్పేస్ ఎక్స్ సంస్థ
ఎవరు: స్పేస్ ఎక్స్ సంస్థ
ఎక్కడ: వాషింగ్ టన్ (అమెరికా)
ఎప్పుడు: జూన్ 13
ప్రపంచం లోనే అతి పెద్ద వయస్కుడైన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత రాయ్ జి కన్నుమూత:
ప్రపంచం లోనే అతి పెద్ద వయస్కుడైన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత రాయ్ జి ఇటివల కన్నుమూసారు.ఈ జవనరిలో అయన వందో పుట్టిన రోజు జరుపుకున్న ఆయన జూన్ 13 కన్నుమూసారు. సొంత గడ్డ పై టీమిండియా ఆడిన తొలి టెస్టు ప్రత్యక్షంగా చూసిన ఘనత అయన కు సొంతం .1920 జనవరి 26 న జన్మించిన ఈ కుడి చేతి వాటం బ్యాట్స్ మెన్ తన కెరీర్లో తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడి277 పరుగులు చేశాడు. దక్షిణ ముంబై లోని సొంత నివాసం లో రాత్రి 2.20 నిమిషాలకు వసంత నిద్రలోనే మృతి చెందారు.1933 లో టీమిండియా స్వదేశంలో తొలి టెస్టు ఆడినపుడు ఆయన వయసు 13. క్రికెట్ కేరీర్ గా ఎంచుకుని 1939 లో భారత క్రికెట్ క్లబ్ తరపున అరంగ్రేటం చేశారు.1941 లో అప్పటి బాంబే జట్టులో చోటు దక్కించు కున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచం లోనే అతి పెద్ద వయస్కుడైన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత రాయ్ జి కన్నుమూత:
ఎవరు: వసంత రాయ్ జి
ఎప్పుడు: జూన్ 13
Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |