Daily Current Affairs in Telugu 10-11-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
యునెస్కో (UNESCO) డైరెక్టర్ జనరల్ గా నియమితులైన ఆడ్రీ అజౌలె :
ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో (UNESCO) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ఫ్రెంచ్ కు చెందిన ఆడ్రీ అజౌలే గారు మరోసారి ఎన్నికయ్యారు. ఫ్రాన్స్ దేశ సంస్కృతి శాఖ మాజీ మంత్రి ఆడ్రీ 2017లో మొదటిసారి యునెస్కో డీజీగా ఎన్నికయ్యారు. యునెస్కో యొక్క సాధారణ సమావేశంలో డీజీ ఎంపికకు నవంబర్ 10న జరిగిన ఎన్నికల్లో ఆడ్రీకి అనుకూలంగా 155 ఓట్లు పోలవగా, వ్యతిరేకంగా తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె వరుసగా రెండోసారి డీజీగా బాధ్యలు చేపట్టనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యునెస్కో (UNESCO) డైరెక్టర్ జనరల్ నియమితులైన ఆడ్రీ అజౌలె
ఎవరు : ఆడ్రీ అజౌలె
ఎక్కడ : ప్యారిస్
ఎప్పుడు : నవంబర్ 10
జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుకు ఎంపికైన సిద్ధిపేట పట్టణం :
జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుకు సిద్దిపేట పట్టణం ఎంపికైంది. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారి ఈ అవార్డును అందుకోనున్నారు. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ, వీటి ప్రక్రియ, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ‘ఉపయోగించడం వంటి కార్యక్రమాలను సంపూర్ణంగా అమలు చేయడంతో ఈ అవార్డు వరించింది. సూర్య కిరణాల కాంతి వెలుగులో సిద్దిపేట మెరవాలి. చంద్రుడు సైతం సిద్దిపేటను తొంగి చూడాల స్వచ్ఛ. స్వచ్ఛత సిద్దిపేట స్వచ్ఛత అనే పాట పట్టణ ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చింది. ఇది గొప్ప స్పూర్తిని ఇచ్చింది.ఇప్పటి వరకు సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చిన అవార్డులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుంది..
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుకు ఎంపికైన సిద్ధిపేట పట్టణం
ఎవరు : సిద్ధిపేట పట్టణం
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : నవంబర్ 10
జపాన్ ప్రధాన మంత్రిగా మళ్లీ ఎన్నికయిన పుమియో కిషిద :
జపాన్ దేశ ప్రధాన మంత్రిగా పుమియో కిషిద మళ్లీ ఎన్నికయ్యారు. నవంబర్ 10 న జరిగిన ఓటింగ్లో పార్లమెంటు సభ్యులు ఆయన ప్రధాని పదవి చేప ట్టెందుకు ఆమోదం తెలిపారు. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కిషిద నేతృత్వంలోని అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎల్బీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దిగువ సభలో మొత్తం 465 స్థానాలు’ ఉండగా, అధికార ఎల్డీపీ 261 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయం. అధికారం పై పుమియో కిశిధ యొక్క పట్టును మరింతగా పెంచింది. తాజా ఎన్నికల్లో వెలువడిన ప్రజాతీర్పును మహ మ్మారి కారణంగా దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు, వైరస్ పైన పోరు, ఇతర సవాళ్లపై కేవలం వారాల వ్యవధిలో కిషిద సర్కారు చేపట్టిన చర్యలకు లభించిన ప్రజా మద్దతుగా భావిస్తున్నారు. “ఇప్పుడు, నేను వివిధ : విధాన పరమైన చర్యలపై దృష్టి పెడతాను” అని ప్రధానిగా ఎన్నికైన అనంతరం పుమియో చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జపాన్ ప్రధాన మంత్రిగా మళ్లీ ఎన్నికయిన పుమియో కిషిద
ఎవరు : పుమియో కిషిద
ఎక్కడ : జపాన్
ఎప్పుడు : నవంబర్ 10
నేపాల్ సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రభురామ్ శర్మ కు దక్కిన గౌరవ హోద :
నేపాల్ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రభురామ్ శర్మను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారు ‘జనరల్ ఆఫ్ ఇండి ‘యన్ ఆర్మీ’ గౌరవ హోదాతో సత్కరించారు. రాష్ట్రపతి భవన్ లో నవంబర్ 10 న ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జనరల్ శర్మకు ప్రథమ పౌరుడు రాంనాథ్ కోవింద్ ఈ గౌరవ హోదాను ప్రదానం చేసినట్టు రాష్ట్రపతిభవన్ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబరులో భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె నేపాల్ లో పర్యటించినప్పుడు ఆ దేశం. ఆయనను ‘జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ’ హోదాతో సత్కరించింది. కాగా, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించే విషయమై జనరల్ శర్మ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తోనూ ఆయన సమావేశమ య్యారు. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసు కునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేపాల్ సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రభురామ్ శర్మ కు దక్కిన గౌరవ హోద :
ఎవరు : జనరల్ ప్రభురామ్ శర్మ
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు : నవంబర్ 10
పీపుల్స్ మేగజీన్ ‘సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ గా ఎంపికైన నటుడు పాల్ రడ్జ్ :
మార్వ ల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) ఫిలిమ్స్ నుంచి వచ్చిన అనేక చిత్రాలతో పాటు’క్లూలెస్’, ‘దిస్ ఈజ్ 40’ చిత్రాల్లో నటించిన పాల్ రడ్జ్ పీపుల్స్ మేగజీన్ ‘సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ (శృంగార పురుషుడు) 2021గా ఎంపికయ్యారు. నవంబర్ 10 న ‘ద లేట్ షో విత్ స్టీఫెన్ కాల్బెర్ట్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పీపుల్స్ మేగజీన్ ‘సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ గా ఎంపికైన నటుడు పాల్ రడ్జ్
ఎవరు : నటుడు పాల్ రడ్జ్
ఎప్పుడు : నవంబర్ 10
భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి లో చేరిన అమెరికా దేశం :
భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) లో అమెరికా నవంబర్ 10న చేరింది. ఈ కూటమిలో చేరిన 101వ సభ్యదేశంగా నిలిచింది. -రూ. ఈమేరకు వాతావరణానికి సంబంధించి అమెరికా ప్రత్యేక చిన్నరలో ప్రెసిడెన్షియల్ రాయబారి జాన్ కెర్రీ. గ్లాస్గోలో నిర్వహిస్తున్న కాప్26 వాతావరణ సదస్సులో ఐఎస్ఏ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు. కూటమిలో అమెరికా చేరిక భారీఎత్తున సౌర విద్యుదుత్పత్తి దిశగా వేసిన కీలక ముందడుగుగా కెర్రీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న ఐఎస్ఏలో చేరడం తమకు ఆనందదాయకమన్నారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఎంతో ముఖ్యమన్నారు. ఐఎస్ ఏలో అమెరికా చేరడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. దీంతో కూటమి మరింత బలోపేతం అవుతుందన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి లో చేరిన అమెరికా దేశం:
ఎవరు : అమెరికా దేశం
ఎప్పుడు : నవంబర్ 10
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |