Daily Current Affairs in Telugu 10-05-2021
సిడ్బి సంస్థ డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ గా సుదత్త మండలం బాద్యతలు :
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) ప్రమోషన్, ఫైనాన్సింగ్ మరియు అభివృద్ధిలో పని చేసే ప్రధాన ఆర్థిక సంస్థ ఐన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సుదత్త మండలం బాధ్యతలు స్వీకరించారు.వీరి యొక్క నియామకం 3 సంవత్సరాల కాలానికి ఉంటుంది. శ్రీ మండల్ ఎక్సిమ్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం మరియు పెట్టుబడి ఫైనాన్స్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, స్ట్రక్చర్డ్ లెండింగ్, క్లస్టర్ ఫైనాన్సింగ్, మరియు ట్రేడ్ ఫైనాన్స్ తో సహా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఇ) రుణాలలో 25 ఏళ్లకు పైగా వృత్తిపరమైన అనుభవం శ్రీ మండలకు ఉంది.
సిడ్బి సంస్థ స్థాపన :2 ఏప్రిల్ 1990
ప్రధాన కార్యాలయం : లక్నో
క్విక్ రివ్యు :
ఏమిటి: సిడ్బి సంస్థ డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ గా సుదత్త మండలం బాద్యతలు
ఎవరు: సుదత్త మండలం
ఎప్పుడు: మె 10
మాడ్రిడ్ ఓవెన్ టైటిల్ ను సొంతం చేసుకున్న అలెగ్జాండర్ జ్వేరేవ్ :
ఫ్రెంచ్ ఓపెన్ ముంగిట జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సత్తా చాటాడు. టాప్ ఫామ్ ను కొనసాగిస్తూ అతడు మాడ్రిడ్ ఓవెన్ ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జ్వెరెవ్ 6-7 (8-10), 6-4, 6-3తో మాట్ బెరిటిని (ఇటలీ)ని ఓడించాడు. తొలి సెట్లో తప్పించి ప్రత్యర్థి నుంచి జ్వెరెవ్ కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఈ మ్యాచ్లో నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన జ్వెరెవ్ అయిదు ఏస్ లు సంధించాడు. ఈ టోర్నీలో ఫేవరెట్ రాఫెల్ నాదల్ తో పాటు ఆస్ట్రియా కెరటం డొమినిక్ థీమన్ ను జ్వెరెవ్ ఓడించాడు. కెరీర్లో అతడికిది రెండో మాడ్రిడ్ టైటిల్. 2018లో తొలి సారి మాడ్రిడ్ ట్రోఫీ గెలిచాడు. మొత్తం మీద అతడికిది నాలుగో ఏటీపీ టైటిల్.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాడ్రిడ్ ఓవెన్ టైటిల్ ను సొంతం చేసుకున్న అలెగ్జాండర్ జ్వేరేవ్
ఎవరు: అలెగ్జాండర్ జ్వేరేవ్
ఎప్పుడు: మె 10
ఏప్రిల్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న బాబర్ ఆజం :
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అటు మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అయిన అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఏప్రిల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకుగాను ఈ ఇద్దరికీ అవార్డులు దక్కాయి. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించిన ఆజంకు అభిమానులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు.
జనవరి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ :రిశబ్ పంత్
ఫిబ్రవరి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ :రవిచంద్రన్ అశ్విన్
మార్చ్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ :భువనేశ్వర్ కుమార్ (మెన్) లిజేల్లె లీ (వుమెన్)
ఏప్రిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ :బాబర్ ఆజం
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏప్రిల్ నెలకు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న బాబర్ ఆజం
ఎవరు: పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం
ఎప్పుడు: మె 10
2021 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులలో టాప్ టైటిల్ గెలుచుకున్న నవోమి ఒసాకా :
నవోమి ఒసాకా 2021 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులలో టాప్ టైటిల్ గెలుచుకుంది. ప్రపంచ నంబర్ టూ టెన్నిస్ క్రీడాకారిణి జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా 2021 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల్లో “స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్” గా ఎంపికయ్యారు. ఇది ఒసాకా కు రెండవ లారస్ స్పోర్ట్స్ అవార్డు. 2019 లో ఆమె “బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకుంది. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్ టూ స్పెయిన్‌కు చెందిన క్రీడాకారుడు రాఫెల్ నాదల్ 2021 “లారస్ స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్” టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2011 లో ప్రతిష్టాత్మక అవార్డును పొందిన రాఫెల్ నాదల్‌కు ఇది రెండవ టైటిల్.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2021 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులలో టాప్ టైటిల్ గెలుచుకున్న నవోమి ఒసాకా
ఎవరు: నవోమి ఒసాకా
ఎప్పుడు: మె 10
ప్రముఖ శిల్పకలాకారుడు రఘునాథ్ మోహన్ పాత్ర కన్నుమూత :
:
కళల ప్రపంచానికి చేసిన కృషికి గాను జూలై 2018లో రాజ్యసభకు నామినేట్ అయిన రఘునాథ్ మోహపాత్ర కన్నుమూసారు. మహమ్మారి సమయంలో కరోనావైరస్ సంక్రమణతో 2021 మేలో భువనేశ్వర్ లో మరణించాడు రఘునాథ్ మోహపాత్ర వాస్తుశిల్పి, శిల్పి మరియు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడు ఈయనకు ఒడిశా ఆలయ శిల్పకళ యొక్క సాంప్రదాయిక శైలి శిల్పకళపై లోతైన జ్ఞానం ఉన్న రాతి శిల్పంలో ప్రావీణ్యం ఉంది. 1974 లో సన్ గాడ్ యొక్క ఆరు అడుగుల పొడవైన బూడిద ఇసుకరాయి విగ్రహాన్ని సృష్టించడం ద్వారా అతను ప్రాముఖ్యత పొందాడు, ఇది ఇప్పుడు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రదర్శించబడింది. ఓడిశా లోని పూరి జిల్లాలో మార్చి 24, 1943న జన్మించిన మోహపాత్రకు 1976 లో అప్పటి భారత రాష్ట్రపతి ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు ఆయనకు 2001 లో పద్మ భూషణ్ అవార్డు కూడా లభించింది. 64 వ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా సందర్భంగా ఆయనకు 2013 లో పద్మ విభూషణ్ అవార్డు లభించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ శిల్పకలాకారుడు మోహన్ పాత్ర కన్నుమూత
ఎవరు: మోహన్ పాత్ర
ఎక్కడ:ఒడిశ
ఎప్పుడు: మె 10
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |