Daily Current Affairs in Telugu 1-08-2021
ప్రపంచ రికార్డుతో స్వర్ణ పథకం గెలుచుకున్న వెనిజుల అథ్లెట్ యులిమార్ రోజాస్ :
ఒలింపిక్స్ మహిళల ట్రిపుల్ జంప్ వెనె జులా అథ్లెట్ యులిమర్ రోజాస్ ప్రపంచ రికార్డుతో పసిడి పట్టేసింది. ఆగస్ట్ 01 జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో మూడో ప్రయత్నంలో 15.67 మీటర్ల దూరం దూకిన ఆమె.. 1995లో ఉక్రెయిన్ అథ్లెట్ ఇనెస్సా (15.50మీ) నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. మామోనా (పోర్చుగల్ 15.01మీ), పెలెటీరో (స్పెయిన్- 14.87మీ) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ రికార్డుతో స్వర్ణ పథకం గెలుచుకున్న వెనిజుల అథ్లెట్ యులిమార్ రోజాస్
ఎవరు: వెనిజుల అథ్లెట్ యులిమార్ రోజాస్
ఎక్కడ: టోక్యో
ఎప్పుడు :ఆగస్ట్ 01
ఒలింపిక్స్ లో తొలిసారి ప్రవేశ పెట్టిన ట్రయథాన్ మిక్స్డ్ రిలే లో స్వర్ణాన్ని గెలుచుకున్న బ్రిటన్ :
ఒలింపిక్స్ లో తొలిసారి ప్రవేశ పెట్టిన ట్రయథాన్ మిక్స్డ్ రిలే స్వర్ణాన్ని బ్రిటన్ సొంతం చేసుకుంది. గంట 23 నిమిషాల 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరు కున్న ఆ దేశం అగ్రస్థానంలో నిలి చింది. జెస్సికా జోనాథన్, జార్జియా, అలెక్స్ తో కూడిన బృందం. 300 మీ. స్విమ్మింగ్, 6.8 కిలోమీ టర్ల సైక్లింగ్. 2 కిలోమీటర్ల పరుగును మిగతా అథ్లెట్ల కంటే ముందుగానే పూర్తిచే సింది. అమెరికా (1. 5లలో అమెరికా (1: 23.553), ఫ్రాన్స్ (1, 24.04) వరుసగా రజత, కాంస్య పత గెలుచుకున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒలింపిక్స్ లో తొలిసారి ప్రవేశ పెట్టిన ట్రయథాన్ మిక్స్డ్ రిలే లో స్వర్ణాన్ని గెలుచుకున్న బ్రిటన్
ఎవరు: బ్రిటన్
ఎక్కడ: టోక్యో
ఎప్పుడు: ఆగస్ట్ 01
అమెరికాలో మరో భారతీయ అమెరికన్ కు దక్కిన కీలక పదవి:
అమెరికాలో మరో భారతీయ అమెరికన్ కు అధ్యక్షుడు జో బైడెన్ కీలక పదవి ఇచ్చారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ అమెరికా రాయబారిగా రషద్ హుస్సేన్ను నియమించారు. బైడెన్ అధ్యక్షుడయ్యాక నామినేట్ చేసిన తొలి ముస్లిం ఇతనే కావడం గమనార్హం. 41 ఏళ్ల రషద్ ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా మండలిలోని పార్ట్నర్షిప్స్ అండ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ విభాగం డైరె క్టర్గా ఉన్నారు. గతంలో ఒబామా హయాంలోనూ జాతీయ భద్రతా విభాగం కీలోని న్యాయశాఖలో సీనియర్ కౌన్సెల్ నిచేశారు. రషద్ నియామకం ద్వారా. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేష న్కు అమెరికా ప్రత్యేక రాయబారిగానూ అమెరికాలోని అందరి విశ్వాసాలను ప్రతిబించేలా పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తానన్న నిబద్దతను బైడెన్ చాటుకున్నారని శ్వేతసౌధం పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికాలో మరో భారతీయ అమెరికన్ కు దక్కిన కీలక పదవి
ఎవరు: రషద్ హుస్సేన్
ఎక్కడ: అమెరికాలో
ఎప్పుడు: ఆగస్ట్ 01
భారతదేశంలో అత్యంత పొడవైన హై-స్పీడ్ ట్రాక్‌ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ :
ఇటీవల, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భారతదేశంలోనే అతి పొడవైన హై-స్పీడ్ ట్రాక్‌ను ప్రారంభించారు. ఇండోర్‌లో పిఠంపూర్‌లోని హై-స్పీడ్ ట్రాక్ 1,000 ఎకరాలలో విస్తరించి ఉంది మరియు దీనిని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (నాట్రాక్స్) అభివృద్ధి చేసింది. ఈ హై-స్పీడ్ టెస్టింగ్ ట్రాక్ భారతీయ ఆటోమొబైల్ రంగానికి మెరుగైన సామర్థ్యంతో కూడిన ఆటోమొబైల్స్ రూపకల్పన మరియు అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది భారతీయ ఆటో మొబైల్ రంగానికి పెద్ద ప్రోత్సాహకరంగా ఉండవచ్చు, ఎందుకంటే ఇది దేశంలోనే విస్తృతమైన వాహన పరీక్షను నిర్వహించడానికి పరిశ్రమ వాటాదారులకు సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశంలో అత్యంత పొడవైన హై-స్పీడ్ ట్రాక్‌ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
ఎవరు: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: ఆగస్ట్ 01
ఎయిర్ ఫోర్స్ అకాడమి కమాండ్ గా సంజీవ్ కపూర్ నియామకం :
దుండిగల్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ గారు ఆగస్ట్ 01 నబాధ్యతలు ట్టారు. చేప 31న ఎయిర్ మార్షల్ ఐపీ విపిన్ పదవీ విర మణ చేయడంతో ఆయన స్థానంలో కొత్త కమాండెంట్ను నియమించారు. 1985లో భారత వైమానిక దళంలో చేరిన సంజీవ్ కపూర్ హోదాలో పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎయిర్ ఫోర్స్ అకాడమి కమాండ్ గా సంజీవ్ కపూర్ నియామ
ఎవరు: సంజీవ్ కపూర్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: ఆగస్ట్ 01
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |