Daily Current Affairs in Telugu -08-11-2019

Daily Current Affairs in Telugu -08-11-2019:

తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన  మాతృమరణాలు:

తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య తగ్గాయి. 2015నుంచి 2017 వరకు నిర్వహించిన  సర్వేలో  ప్రతి లక్ష ప్రసవాలకు మాతృ మరణాలు 81 నుంచి 76 తగ్గాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆరోగ్య లక్ష్మి, కేసిఆర్ కిట్ ప్రభావంతో మెరుగుదల నమోదైంది .వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి .జాతీయ స్థాయిలో 2015-2017 వరకు నమోదైన మాతృ మరణాలపై కేంద్ర ప్రభుత్వం నివేదిక వెలువరించింది. జాతీయ స్థాయిలో 15-49ఎల్ల మద్య  వయసున్న 67.75 లక్షల మంది బాలికలు  యువతులు  మహిళలపై సర్వే నిర్వహించబడింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన మాతృమరణాలు

ఎపుడు: నవంబర్ 08 2019

ఎవరు : .వైద్యారోగ్య శాఖ

ఎక్కడ:తెలంగాణ

కర్తార్ పూర్  నడవా  ప్రారంభం :

సిక్కులు సుధీర్గ కాలంగా ఎదురు చూస్తున్న కర్తార్ పూర్ నడవా  08-11-2019  నుంచి అందుబాటులోకి  రానుంది దీనికి సంభందించి గురుదాస్ పూర్ లోని డేరాభాబా నానక్ వద్ద ఏకీకృత చెక్ పోస్ట్( ఐసిపీ ) ను ప్రధాని శనివారం  ప్రారంభించారు. సుల్తాన్పూర్ లోని బేర్ సాహిబ్ గురుద్వారా ను సందర్శించి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాని మోడీ  జెండా ఊపి 550మంది తో కూదినతొలి యాత్రికుల బృందాన్నిపాకిస్తాన్ కు పంపుతారు . పాకిస్తాన్లో ను  నడవాను ఆ దేశ ప్రదాని ఇమ్రాన్ ప్రారంభిస్తారు.

మనదేశంలో పంజాబ్ ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారా  నుంచి పాకిస్తాన్  పంజాబ్  ప్రావిన్సు లోని నరోవాల్ జిల్లా కర్తర్పూర్  దర్భార్ సాహిబ్  గురు ద్వారా  వరకు నడవా  పొడవు 4.5కీ.మీ.

క్విక్ రివ్యు :

ఏమిటి : కర్తార్ పూర్  నడవా ప్రారంభం

ఎపుడు: నవంబర్ 08 2019

ఎవరు : . ప్రధాని మోది

ఎక్కడ:  సుల్తాన్పూర్  లో ని బేర్ సాహిబ్ గురుద్వారా

రాజ్యసభ బెటీలకు గుర్తు గా రూ250 వెండి నాణెం :

రాజ్యసభ 250వ సమావేశాలకు ప్రారంభానికి  గుర్తింపుగా కేంద్ర  ఆర్ధిక శాక రూ250 వెండి నాణెం  విడుదల  చేయనుంది 99.9%వెండితో దీన్నిరూపొందించారు దీని బరువు 40గ్రాములు ఉంటుంది. ఈ నెల 18నుంచి  రాజ్యసభ 250వ సమావేశాలు  ప్రారంభమయ్యాయి. లోక్ సభ ప్రతి ఐదేళ్లకొకసారి ముగుస్తుంది.  కాబట్టి  వాటికీ నిరంతర సంఖ్య ఉండదు. రాజ్యసభకు అలాంటిది లేదు కాబట్టి స్వతంత్ర భారత దేశంలో తొలి సమావేశం దగ్గరి నుంచి  ఆ సమావేశాలకు  వరుస  సంఖ్య ఇస్తూ  వస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : రాజ్యసభ బెటీలకు గుర్తు గా రూ250 వెండి నాణెం

ఎపుడు: నవంబర్ 08, 2019

ఎవరు : . రాజ్యసభ

ఎక్కడ:  భారత దేశంలో 

సందీప్ కు స్వర్ణం  ప్రపంచ  పారా అథ్లెటిక్స్ లో :

ప్రపపంచ  పారా  అథ్లెటిక్ చాంపియన్ షిప్ లోఅథ్లెట్ సందీప్ చౌదరి అదరగొట్టాడు. జావేలినే త్రో (ఎఫ44) విభాగంలో  అతను జావేలినే ను 66.18 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్నన్న ప్రపంచ రికార్డు (65.80మీ) ని అధిగమించాడు. జావేలిన్  ఎఫ్64విభాగంలో  మరో  భారత అథ్లెట్ సుమిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ రజతం సాధించాడు. జవేలిన్ ను 62.88 మీటర్ల దూరం విసిరిన సుమిత్ తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (60.45మీ)ను బద్దలుకొట్టాడు.ఈ ప్రపంచ చాంపియన్ షిప్ లో ఎఫ్44 ఎఫ్64 ఈవెంట్లను ఒకే ఈవెంట్ గా నిర్వహిస్తున్నారు.  కాని ప్రపంచ రికార్డు లను కేటగిరీ  ప్రకారం లెక్కిస్తారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : సందీప్ కు స్వర్ణం  ప్రపంచ  పారా అథ్లెటిక్స్

ఎపుడు: నవంబర్ 08 2019

ఎవరు : . సందీప్

ఎక్కడ: దుబాయి 

భారత్ లో 2023 హాకీ ప్రపంచ కప్ :

పురుషుల హాకీ ప్రపంచ కప్ కు వరుసగా రెండోసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. 2023 జనవరి 13నుంచి 29 వరకు భారత్ లో ప్రపంచ కప్ జరుగుతుందని. అంతర్జాతీయ హాకీ సమాక్య (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. నవంబర్ 07 న జరిగిన ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యుటివ్ బోర్డు బేటీలో 2022 మహిళల ప్రపంచ కప్ నిర్వహణ బాద్యతను  స్పెయిన్ ,నెదర్లండ్స్  లకు  ఉమ్మడిగా అప్పగించింది. గతంలో  భారత్ (1982 ముంబై ,2010డిల్లి, 2018 భువనేశ్వర్), నెదర్లండ్స్ మూడేసి సార్లు పురుషుల ప్రపంచ కప్ కు ఆతిధ్యమిచ్చాయి. 2023 టోర్నీ తర్వాత ప్రపంచ కప్  అత్యధికంగా  నాలుగు సార్లు  నిర్వహించిన  దేశంగా  భారత్  రికార్డు  సృష్టిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్ లో 2023 హాకీ ప్రపంచ కప్

ఎపుడు: నవంబర్ 08 2019

ఎవరు : అంతర్జాతీయ హాకీ సమాక్య

ఎక్కడభారత్

నారాయణ  విద్య సంస్థల  డైరెక్టర్లకు పురస్కారం :

ది ఎకనామిస్ట్  టైమ్స్ అధించే  ప్రతిస్టాత్మక మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆఫ్ ఆసియా అవార్డు ను నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ లు  డా. సింధూర నారాయణ, కే. పునిత్  గెలుచుకున్నారు .2019-20 సంవత్సరానికి  గాను  ఈ అవార్డ్ ను  07 నవంబర్ న సింగపూర్లోని  మెరీనా బెశాండ్స్ లో జరిగిన కార్యక్రమలో అందుకున్నట్లు నారాయణన గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారం  కోసం  పలు దేశాల నుంచి ప్రతినిధులుపోటిపడినట్లు తెలిపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : నారాయణ  విద్య సంస్థల  డైరెక్టర్లకు పురస్కారం

ఎపుడు: నవంబర్ 08 2019

ఎవరు : డా . సింధూర నారాయణ , కే . పునిత్

ఎక్కడ  ది ఎకనామిస్ట్  టైమ్స్

ఆంద్రప్రదేశ్ న్యాయమూర్తిగా జస్టిస్ రాకేశ్ కుమార్  ప్రమాణం :

ఆంద్రప్రదేశ హైకోర్ట్  న్యాయమూర్తిగా  జస్టిస్ రాకేష్ కుమార్  ప్రమాణం చేశారు. హైకోర్ట్ లోని మొదటి హల్లో  నవంబర్ 07 ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సిజే) జస్టిస్  జేకే.మహేశ్వరి .జస్టిస్  రాకేశ్ కుమార్  చేత  ప్రమాణ స్వీకారం చేయించారు. అంతక ముందు పాట్న హైకోర్ట్  నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ ను ఏపీ  హైకోర్ట్ కు  బదిలి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉతర్వులను  హైకోర్ట్  రిజిస్టార్ జనరల్ రాజశేఖర్  చదివి వినిపించారు.  ప్రమాణ స్వీకారం తర్వాత జస్టిస్ రాకేష్ కుమార్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పిచారు. .అయన సిజేతో ధర్మాసనం పంచుకొని మొదటి రోజు కేసుల విచారణ  జరిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆంద్రప్రదేశ్ న్యాయముర్హిగా జస్టిస్  రాకేశ్  కుమార్  ప్రమాణం

ఎపుడు: నవంబర్ 08 2019

ఎవరు : జస్టిస్  రాకేశ్  కుమార్ 

ఎక్కడ ఆంద్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *