Daily Current Affairs in Telugu 09-08-2021

Daily Current Affairs in Telugu 09-08-2021

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లోతొలి సారిగా  అద్యక్షత వహించిన ప్రదాని నరేంద్ర మోడి :

మహాసముద్రాలను యావత్ ప్రపంచ సంపదగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఇందుకోసం ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. సముద్ర భద్రత పెంపు – అంతర్జాతీయ సహకార ఆవశ్యకత’ అనే అంశంపై ఐరాస భద్రత మండలి (యూఎన్ ఎస్సీ)లో ఆగస్ట్ 09న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చకు  నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. యూఎన్ఎ వహించడం ఇదే తొలిసారి అని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ఉగ్రవాదం, దోపిడీల కోసం సముద్ర మార్గాలు దుర్వినియోగమవుతున్నాయని మోదీ అబిప్రాయం వ్యక్తం చేశారు. తీరరేఖను కలిగిఉన్న దేశాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వాటిని దీటుగా ఎదుర్కొనే సమగ్ర అంతర్జాతీయ ప్రణాళికను రూపొందించుకునేందుకు ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. యూఎన్ఎస్సీ ప్రత్యేకంగా సముద్ర భద్రతపై అత్యున్నత స్థాయిలో బహిరంగ చర్చను చేపట్టడం ఇదే తొలిసారి. మోదీ ప్రతిపాదించిన ఐదు సూత్రాలను తాజా చర్చలో పాల్గొన్నవారంతా స్వాగతించారు అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఈ విష యాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లోతొలి సారిగా  అద్యక్షత వహించిన ప్రదాని నరేంద్ర మోడి

ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి

ఎక్కడ: న్యూయార్క్

ఎప్పుడు: ఆగస్ట్ 09

1500 మీటర్ల పరుగులో స్వర్ణ పథకం గెలిచిన అతి పిన్న వయస్కుడు జాకబ్ ఇనేబ్రిన్ :

తొలిసారి ఒలింపిక్స్ లో  పాల్గొంటున్న నార్వే దేశ  అథ్లెట్ జాకబ్ ఇనెబ్రిన్ సంచలన ప్రదర్శనతో స్వర్ణాన్ని సాధించాడు. టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా ఆగస్టు 7న జరిగిన పురుషుల 1500 మీటర్ల పరుగులో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు 3 నిమిషాల 28.32 సెకన్లలో చేరి ఒలింపిక్ రికార్డుతో విజేతగా నిలిచాడు. తద్వారా 1500 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన రెండో అతిపిన్న వయస్కుడిగా 20 ఏళ్ల జాకబ్ నిలిచాడు.  కాగా మహిళల మారథాన్ లో  పెరీస్ జెప్చిర్చిర్ (కెన్యా) స్వర్ణ పథకం తో  మెరిసింది.  ఆగస్ట్  07 న  జరిగిన 49.125 కిలోమీటర్ల రేసును ఆమె 2 గంటలా 27 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: 1500 మీటర్ల పరుగులో స్వర్ణ పథకం గెలిచిన అతి పిన్న వయస్కుడు జాకబ్ ఇనేబ్రిన్

ఎవరు: జాకబ్ ఇనేబ్రిన్

ఎక్కడ: జపాన్ (టోక్యో )

ఎప్పుడు: ఆగస్ట్ 09

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన 3 వ వ్యక్తి గా నిలిచిన జేమ్స్ అండర్సన్  :

జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 3 వ వ్యక్తి జేమ్స్ ఆండర్సన్ నిలిచాడు. ఇప్పటి వరకు ఉన్న రికార్డు  అనిల్ కుంబ్లే 619 టెస్టు వికెట్లను అధిగమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో వ్యక్తిగా నిలిచాడు. కెఎల్ రాహుల్ ఒక  పడగొట్టిన తర్వాత అతను ఈ భారీ ఘనతను సాధించాడు. అతని ప్రస్తుత వికెట్ల సంఖ్య 163 టెస్టుల నుండి 621 వద్ద ఉంది. అండర్సన్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా  మరియు 600 క్లబ్‌లో ఉన్న ఏకైక పేసర్ గా నిలిచారు. భారత్‌తో జరిగిన నాటింగ్‌హామ్ టెస్టులో 3వ రోజున ఈ మైలురాయిని సాధించాడు

క్విక్ రివ్యు :

ఏమిటి: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన 3 వ వ్యక్తి గా నిలిచిన జేమ్స్ అండర్సన్

ఎవరు: జేమ్స్ అండర్సన్

ఎప్పుడు: ఆగస్ట్ 09

ఘనంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ -2020 ;:

కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటూ వాయిదా పడి, ఈసారి కూడా వైరస్ భయం వెంటాడుతుండగా, ఎన్నో సందేహాల మధ్య.జులై 23 న ప్రారంబం అయి తిరిగి ఆగస్ట్ 08 న ఘనంగా ముగిసాయి. కాగా ఈ ముగింపు ఉత్సవాలు వరల్డ్ “వి షేర్” థీమ్ తో సాగిన ఈ ఉత్సవాల్లో  పలు రకాల సాంస్కృతిక  కార్యక్రమాలు ప్రదర్శించారు.. జపాన్, ఐఓసీ 17 రోజుల పాటు నిరాటంకంగా ఒలింపిక్స్ ను  నిర్వ హించి శభాష్ అనిపించుకున్నాయి.  ఆగస్ట్ 08 న ముగింపు వేడుక వైభవంగా సాగింది. ఆమెరికా తన ఆధిపత్యాన్ని చాటుతూ 39 స్వర్ణాలతో మరోసారి అగ్రస్థానంతో విశ్వక్రీడల్ని ముగించింది. చైనా, జపాన్. రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా ఇందులో భారత్ 18 క్రీడంశాల్లో 128 మంది పాల్గొన్నారు.కాగా  48వ స్థానం లో నిలిచింది.  ఒలింపిక్ చరిత్రలో భారత్  కు టోక్యో క్రీడలే అత్యుత్తమం. నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం సహా ఏడు పతకాలతో చిరస్మరణీయం చేసుకుంది ఇండియా. కాగా టోక్యోకు టాటా చెప్పేస్తున్న క్రీడాభిమానులకు. 2024లో పారిస్ ఒలింపిక్స్ స్వాగతం పలకబోతున్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఘనంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ -2020

ఎవరు: జపాన్

ఎక్కడ: జపాన్ (టోక్యో)

ఎప్పుడు: ఆగస్ట్ 09

ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత ;

ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూశారు. ఈ నటుడు టీవీ షో మన్ కీ ఆవాజ్: ప్రతిజ్ఞ మరియు స్లమ్‌డాగ్ మిలియనీర్ మరియు బందిపోటు, క్వీన్ వంటి చిత్రాలలో నటించారు. తన దాదాపు మూడు దశాబ్దాల సినిమా జీవితం లో శ్యామ్ సత్య, దిల్ సే, లగాన్, హజారోన్ ఖ్వైషేన్ ఐసి వంటి చిత్రాలలో నటించారు మరియు మన్ కీ ఆవాజ్: ప్రతిజ్ఞలో 2009 లో ప్రసారమైన ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్రకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత

ఎవరు: అనుపమ్ శ్యామ్

ఎప్పుడు: ఆగస్ట్ 09

RRB Group D Practice test

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test

For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *