Daily Current Affairs in Telugu 08-08-2020

Daily Current Affairs in Telugu 08-08-2020

70 వ వార్షికోత్సవ గ్రాండ్ ఫ్రీ రేసులో విజేతగా నిలిచిన వేర్ స్థాపెన్ :

ఈ సీజన్లో వరుసగా విజయాలతో జోరు మీదున్న డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కు రెడ్ బుల్ రేసర్ అయిన మాక్స్ వేర్ స్థాపెన్ షాక్ ఇచ్చాడు. ఆగస్టు 09 న జరిగిన 70 వ వార్షికోత్సవ గ్రాండ్ ఫ్రీ రేసులో వేర్ స్థాపెన్ విజేతగా నిలిచాడు.ఫెవరేట్ గా బరిలోకి దిగిన హామిల్టన్ రెండవ స్థానానికి పరిమితం అయ్యాడు.వాల్బె రీ బొటాస్(మెర్సిడెస్) మూడో స్థానంలో కి చేరుకున్నాడు. సిల్వర్ స్టోన్ లో విజయం సాధించడం రెడ్ బుల్ కు ఇదే మొదటి సారి. వేర్ స్థాపెన్ కు కూడా ఈ సీజన్ లో సాధించిన మొదటి టైటిల్ ఇదే. 

క్విక్ రివ్యు :

ఏమిటి: 70 వ వార్షికోత్సవ గ్రాండ్ ఫ్రీ రేసులో విజేతగా నిలిచిన వేర్ స్థాపెన్

ఎవరు: వేర్ స్థాపెన్

ఎప్పుడు: ఆగస్ట్ 08

సురేష్ రైనా, హర్మన్‌ప్రీత్ కౌర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించిన డబ్ల్యుటిఎఫ్ స్పోర్ట్స్:

స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్, డబ్ల్యుటిఎఫ్ స్పోర్ట్స్ క్రికెటర్లు అయిన  హర్మన్‌ప్రీత్ కౌర్, సురేష్ రైనాలను తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించింది. రైనాను  స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌గా కూడా ఈ బ్రాండ్‌లో చేర్చు కుంది అని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రకటన చేశారు. ఈ ప్లాట్‌ఫాం లో  ప్రస్తుతం మూడు ప్రధాన క్రీడలను, మల్టీ గేమింగ్ మోడ్ లో  మరియు ఉత్తేజకరమైన రీతిలో పోటీలను నిర్వహిస్తుంది, క్రీడా అభిమానులు వ్యూహాత్మకంగా మరియు వారి క్రీడా పరిజ్ఞానాన్ని  పరీక్షిస్తూ వాటి ప్రకారం ప్రవర్తించేలా ఉపయోగించడం ద్వారా మరింత నైపుణ్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: సురేష్ రైనా, హర్మన్‌ప్రీత్ కౌర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించిన డబ్ల్యుటిఎఫ్ స్పోర్ట్స్

ఎవరు: సురేష్ రైనా, హర్మన్‌ప్రీత్ కౌర్

ఎప్పుడు: ఆగస్ట్ 08

 రష్యాలో కవ్కాజ్ 2020 విన్యాసం లో పాల్గొంటున్న  భారత్ :

:రష్యాలోని ఆస్ట్రాఖాన్‌లో జరగనున్న బహుళపక్ష సైనిక “రష్యన్ కవ్కాజ్ 2020” వ్యూహాత్మక కమాండ్-పోస్ట్ విన్యాసం లో  భారత దేశం కూడా  పాల్గొంటుంది. భారత దళంలో 150 మంది ఆర్మీ సిబ్బంది మరియు నేవీ మరియు వైమానిక దళం నుండి తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నారు. కాకసస్ -2020 అని కూడా పిలువబడే ఈ కవ్కాజ్ 2020 విన్యాసం లో పాల్గొనడానికి చైనా, ఇరాన్, పాకిస్తాన్ మరియు టర్కీతో సహా కనీసం 18 దేశాలకు,ఎస్.సిఓ ఇతర రిపబ్లికన్ దేశాలకు లకు కూడా  ఆహ్వానo పలికింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: రష్యాలో కవ్కాజ్ 2020 విన్యాసం లో పాల్గొంటున్న  భారత్

ఎవరు: భారత్

ఎక్కడ: : రష్యాలో

ఎప్పుడు: ఆగస్ట్ 08

 తెలంగాణా మాజీ ఎంపీ నంది యెల్లయ్య కన్నుమూత :

కాంగ్రెస్ మాజీ నాయకుడు, తెలంగాణకు చెందిన వ్యక్తి ఎనిమిది సార్లు పార్లమెంటు కు ఎన్నికైన సభ్యుడు నంది యెల్లయ్య ఇటీవల  కన్నుమూశారు. యెలయ్య 1979 లో సిద్దిపేట నుండి లోక్‌సభకు మొదటిసారి ఎన్నికయ్యారు. 2002 నుండి 2014 వరకు రెండుసార్లు లోక్‌సభకు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. యెలయ్య హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు

క్విక్ రివ్యు :

ఏమిటి: మాజీ ఎంపీ నంది యెల్లయ్య కన్నుమూత

ఎవరు: నంది యెల్లయ్య

ఎక్కడ: తెలంగాణా

ఎప్పుడు: ఆగస్ట్ 08

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *