Daily Current Affairs in Telugu 08-06-2020
గూగుల్ క్లౌడ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ గా అనిల్ వల్లూరి నియామకం :
గూగుల్ అనుబంధ సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ గా తెలుగువాడైన అనిల్ వల్లూరి నియమితులయ్యారు. ఇటీవల వరకు అయన నెట్యాప్ అనే సంస్థ లో ఇండియా సార్క్ దేశాల విభాగానికి అద్యక్షుడిగా పని చేశారు. అంతకు ముందు ఆర్తిమన్ వెంచర్స్ లో పని చేశారు. సన్ మైక్రో సిస్టమ్స్ ఇండియా ఎండి గా వ్యవహరించారు. ఐటి పరిశ్రమలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలో క్లౌడ్ అతిపెద్ద మార్పు అని ఈ విభాగంలో గూగుల్ విప్లవాత్మకమైన రీతిలో పని చేస్తుందని ఈ సందర్భంగా అనిల్ వల్లూరి పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గూగుల్ క్లౌడ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ గా అనిల్ వల్లూరి నియామకం :
ఎవరు: అనిల్ వల్లూరి
ఎప్పుడు: జూన్ 08
ఉత్తరాఖండ్ రెండో రాజదానిగా గిర్ సేన్ గా ప్రకటింపు :
ఉత్తరాఖండ్ రాష్ట్ర రెండో రాజదాని గా చమేలి జిల్లా లోని గిర్ సేన్ ఉంటుందని ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్ రావత్ లాంచనంగా ప్రకటించారు. పాలనకు ఆదర్శవంతమైన ప్రాంతంగా వేసవి రాజదాని గా దీనిని తీర్చి దిద్దుతామని చెప్పారు. ఎన్నికల ప్రణాళిక కు అనుగుణంగా డెహ్రాడూన్ కు అదనంగా గిర్ సేన్ ను రాజదాని గా చేస్తామని మూడు నెలల క్రితం బడ్జెట్ సమావేశాల్లో సి.ఎం ప్రకటించారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు జూన్08న ఈ అధికారిక ప్రకటన చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ రెండో రాజదానిగా గిర్ సేన్ గా ప్రకటింపు
ఎవరు: త్రివేండ్ర సింగ్ రావత్
ఎక్కడ: ఉత్తరాఖండ్
ఎప్పుడు: జూన్ 08
భారత అథ్లెట్ అయిన గోమతి పై నాలుగేళ్ల నిషేదం :
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ స్వర్ణ పతక విజేత గోమతి మురిపెట్టు డోపిగా తేలింది. దీంతో ఆమె పై నాలుగేళ్ళ నిషేదాన్ని విధించినట్లు జూన్ ౦8న వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది. తమిళనాడు కు చెందిన గోమతి నుంచి సేకరించిన నాలుగేళ్ల నమూనాల్లో నిశేదిత ఉత్ప్రేరకం 19 నార్ అన్డ్రో స్తేరోన్ స్తేరాయిడ్ ఆనవాళ్ళు ఉండడంతో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటి యూనిట్ నాలుగేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. 2019 మే17 నుంచి 2023 మే 16 వరకు ఆమె పై ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఎ.ఐ.యు పేర్కొంది. 2019 దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 800 మీటర్ల పరుగును తన అత్యుత్తమ టైమింగ్ తో (2ని.2.70 సెకన్లు ) పూర్తి చేసి గోమతి విజేత గా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత అథ్లెట్ అయిన గోమతి పై నాలుగేళ్ల నిషేదం
ఎవరు: గోమతి
ఎప్పుడు: జూన్ 08
స్విట్జర్ లాండ్ లో భారతదేశ తదుపరి రాయబారిగా నియమితులయిన మోనికా మెహ్తా:
మోనికా కపిల్ మెహ్తా స్విట్జర్ లాండ్ లో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె స్వీడన్ కు భారత రాయబారిగా పని చేస్తుంది. ఆమె 1985 బ్యాచ్ కు చెందిన ఐ.ఎఫ్ .ఎస్ అధికారి అయిన సి.బి జార్జ్ గారి స్థానంలో స్విట్జర్ లాండ్ కు భారత రాయబారిగా ఆమె నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్విట్జర్ లాండ్ లో భారతదేశ తదుపరి రాయబారిగా నియమితులయిన మోనికా మెహ్తా
ఎవరు: మోనికా మెహ్తా
ఎక్కడ: స్విట్జర్ లాండ్
ఎప్పుడు: జూన్ 08
కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత :
కన్నడ ఫిలిం ఇండస్ట్రీ లో అత్యంత ప్రతిభావంతుడు మరియు ప్రజాదరణ పొందిన నటుడు చిరంజీవి సర్జా జూన్ 07న బెంగళూర్ లోని ఒక ఆసుపత్రిలో 39సంవత్సరాల వయసులోనే మరించించారు. పిటిఐ నివేదించిన ప్రకారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా అయన మరణించారు. సర్జా 2009 లో వాయుపుత్ర చిత్రం తో నటన రంగ ప్రవేశం చేశారు. 11సంవత్సరంలో కెరీర్ ల 20కి పైగా చిత్రాలలో నటించారు. కన్నడ నటి మేఘన రాజ్ ను 2018 లో వివాహం చేసుకున్నారు. అయన చిరు,చంద్రలేఖ,అతగర,అమ్మ ఐ లవ్ యు ,సింఘా వంటి పలు హిట్ చిత్రాలలో అయన నటించారు. అయన నటించిన చివరి చిత్రం శివార్జున .
క్విక్ రివ్యు :
ఏమిటి: కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత
ఎవరు: చిరంజీవి సర్జా
ఎక్కడ: బెంగళూర్
ఎప్పుడు:జూన్ 08
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |