Daily Current Affairs in Telugu 06-09-2021
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా అరుణ్ కుమార్ సింగ్ నియామకం :
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. కేంద్ర పెట్రోలియం శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోద ముద్ర వేసినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ పేర్కొంది. ప్రస్తుతం బీపీ సీఎల్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించింది. బీపీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న కృష్ణగుప్తా ను డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వీరిద్దరూ 1122 అక్టోబరు 31 వరకు ఈ పదవుల్లో కొనసాగుతారు. బీపీసీఎల్ జనరల్ మేనేజ గా పనిచేస్తున్న ఎస్. రమేష్ ను భారత్ పెట్రో రిసోర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట గా నియమించారు. 2022 జులై 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన :1952
- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం :
- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎం.డి ఎస్.వరదరాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా అరుణ్ కుమార్ సింగ్ నియామకం
ఎవరు: అరుణ్ కుమార్ సింగ్
ఎప్పుడు: సెప్టెంబర్ 06
టోక్యో పారాలింపిక్స్ లో రజత పతకం నెగ్గిన ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ సుహాస్ యతి రాజ్ :
పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్ 4 విభాగంలో సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు.ఈయన ఒక ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ 2007లో ఐఏఎస్ సర్వీస్ కు ఎంపికయ్యాడు ఫైనల్లో అతను 21-15, 17-21, 15-21తో ప్రపంచ ఛాంపియన్ అయిన మజూర్ లుకాస్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. గ్రూప్ దశలో లుకాస్ చేతిలో ఓడిన సుహాస్ తుదిపోరులో మాత్రం విజయం కోసం గట్టి గానే పోరాడాడు. కానీ ప్రపంచ నంబర్ వన్ పైన ఈ సారి కూడా పైచేయి సాధించలేకపోయాడు. అద్వితీయమైన ఆటతీరుతో తొలి గేమ్ గెలిచిన సుహాస్. పసిడి అందుకునేలా కనిపించాడు. రెండో గేమ్లోనూ ఓ దశ కానీ ప్రత్యర్థి బలంగా పుంజుకోవడంతో భారత షట్లర్ వెనకబడిపోయాడు. వరుసగా రెండు గేమ్ లు కోల్పోయాడు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ లో కాంస్య పోరులో రెండో సీడ్ తరుణ్ 17-21, 11-21తో ఫ్రెడీ (ఇండోనేషియా) చేతిలో ఓడాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్ 3- ఎస్.యు5 కంచు పతక పోరులో ప్రమోద్ పలక్ జోడీ 21-23, 19-21తో పుజిహర సుగినో (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు మిక్స్డ్ 50మీ. రైఫిల్ ప్రోన్ ఎచ్1లో మన షూటర్లు ఫైనల్ చేరలేకపోయారు.
- టోక్యో పారాలింపిక్స్ జరుగిన ప్రదేశం :జపాన్
- టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తరపున తొలి పతక విజేత :భావీన పటేల్
- టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తరపున తొలి స్వర్ణ పథక విజేత : అవని లేఖార
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలింపిక్స్ లో రజత పతకం నెగ్గిన ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ సుహాస్ యతి రాజ్
ఎవరు: సుహాస్ యతి రాజ్
ఎక్కడ: టోక్యో (జపాన్ )
ఎప్పుడు: సెప్టెంబర్ 06
మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కేశవ్ దేశిరాజు కన్నుమూత :
మాజీ యూనియన్ హెల్త్ సెక్యూరిటీ కేశవ్ దేశిరాజు కన్ను మూసారు.ఆయన మాజీ ఉప ప్రదాని అయిన ఎస్ రాధాకృష్ణన్ గారి మనవడు .దేశీరాజు తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్ కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. అతను వినియోగదారు వ్యవహారాల శాఖలో యూనియన్ సెక్రటరీగా పదవీ విరమణ పొందాడు మరియు భారత ప్రభుత్వంలో అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక ఇతర పదవులను నిర్వహించారు. మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కేశవ్ దేశిరాజు చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కేశవ్ దేశిరాజు కన్నుమూత
ఎవరు: కేశవ్ దేశిరాజు
ఎప్పుడు: సెప్టెంబర్ 06
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మాజీ అధ్యక్షుడు జాక్వెస్ రోగ్ కన్నుమూత :
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మాజీ అధ్యక్షుడు, జాక్వెస్ రోగ్ కన్నుమూశారు. అతను ఐఓసి అధ్యక్షుడిగా 12 సంవత్సరాలు గడిపాడు, 2001 నుండి 2013 వరకు, మూడు సమ్మర్ గేమ్స్ మరియు మూడు వింటర్ గేమ్స్, అలాగే యూత్ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం లో ఆయన పాత్ర ఉంది.. అతని తరువాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కి థామస్ బాచ్ అద్యక్షుడయ్యారు.. అతను IOC కి 8 వ అధ్యక్షుడు గా పని చేసారు.
- అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రధాన కార్యాలయం : లుసానే (స్విట్జర్ ల్యాండ్ )
- అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC స్థాపన :1894 జూన్ 23 పారిస్ లో
- అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అద్యక్షుడు :థామస్ బాచ్
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మాజీ అధ్యక్షుడు జాక్వెస్ రోగ్ కన్నుమూత
ఎవరు: జాక్వెస్ రోగ్
ఎప్పుడు: సెప్టెంబర్ 06
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |