Daily Current Affairs in Telugu -27-11-2019
పి.ఎస్.ఎల్.వి సి-47 ప్రయోగం విజయవంతం
బారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. సరిహద్దుల్లో నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో , పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్బోశాట్ -3 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. శ్రీపోట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లోని సతీష్ దవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ లో నవంబర్ 26 న ఉదయం 7.28కి ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరంతరాయంగా 26 గంటలు కొనసాగుతుంది. నవంబర్ 27 న ఉదయం 9.28 కి రెండో ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి-47 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. మనదేశానికి చెందిన కార్బోసాట్-3 తో పాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి మోసుకేల్లింది.
క్విక్ రివ్యూ
ఏమిటి : పి.ఎస్.ఎల్.వి సి-47 ప్రయోగం విజయవంతం
ఎక్కడ: నెల్లూరు
ఎప్పుడు: నవంబర్ 27
న్యాక్ కు గోల్డెన్ ట్రోఫీ అవార్డ్
హైదరాబాద్ మాదాపూర్ నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్ (న్యాక్) కు గోల్డెన్ ట్రోఫీ ఇన్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్లేస్ మెంట్స్ 2019 అవార్డ్ లబించింది. డిల్లి లో నవంబర్ 27నిర్వహించిన అసోచాం స్కిల్ ఇండియా 2019 సమ్మిట్ లో కేంద్రమంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా న్యాక్ ప్లేసేమెంట్స్ ,ట్రైనింగ్ విభాగం డైరెక్టర్ శాంతిశ్రీ ఈ అవార్డ్ ను అందుకున్నారు. నిర్మాణ రంగం లో నిరుద్యోగులకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంలో న్యాక్ అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం వరించింది.
క్విక్ రివ్యూ
ఏమిటి : న్యాక్ కు గోల్డెన్ ట్రోఫీ అవార్డ్
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: నవంబర్ 27
భారత్ కు చేరనున్న పురాతన కళాఖండాలు
భారత దేశం నుంచి దొంగచాటుగా తరలిపోయి నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు చేరిన అపురూపమైన మూడు పురాతన భారతీయ కళాఖండాలు తిరిగి స్వదేశానికి చేరనున్నాయి. జనవరిలో ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మారిసన్ భారత్ పర్యటనలో ఉన్నపుడు వాటిని అందజేస్తారు. 6-8 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన భారీ నటరాజు, 15 వ శతాబ్దపు నాటి రెండు ద్వారపాలకుల విగ్రహాలు ఆస్ట్రేలియాకు తరలిపోయాయి.
క్విక్ రివ్యూ
ఏమిటి : భారత్ కు చేరనున్న పురాతన కళాఖండాలు
ఎవరు; ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మారిసన్
ఎప్పుడు: నవంబర్ 27
దౌత్య కార్యాలయాల్లో అమెరికాను మించిన చైనా
ప్రపంచ వ్యాప్తంగా దౌత్య కార్యాలయాల ఏర్పాటులో అమెరికాను చైనా మించిపోయింది. సిద్నికి చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ జరిపిన అద్యయనం ప్రకారం 2019 లో చైనాకు 276 దౌత్య కార్యాలయాలు ఉండగా, అమెరికాకు మూడు తక్కువగా 273 ఉన్నాయి. చైనాకు 169 రాయబార కార్యాలయాలు, 96 కాన్సులేట్ కార్యాలయాలు, ఎనిమిది శాశ్వత దౌత్య కార్యాలయాలు, మూడు ఇతర దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. 2016 లో అమెరికా, ఫ్రాన్స్ తరువాత చైనా మూడో స్థానంలో ఉండేది. ప్రస్తుతం భారత్ 12 వ స్థానం లో ఉంది. మనకు 123 రాయబార కార్యాలయాలు, 54 కాన్సులేట్ కార్యాలయాలు, అయిదు శాశ్వత దౌత్య కార్యాలయాలు, నాలుగు ఇతర కార్యాలయాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ
ఏమిటి : దౌత్య కార్యాలయాల్లో అమెరికాను మించిన చైనా
ఎవరు; చైనా
ఎప్పుడు: నవంబర్ 27
ఆసియా ఆర్చరీ చాంపియన్ షిప్ లో సురేఖ జోడికి స్వర్ణం
ఆసియా ఆర్చరి చాంపియన్ షిప్ లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండు పథకాలతో మెరిసింది. కాంపౌండ్ మిక్స్ ద్ జోడి విభాగంలో అభిషేక్ వర్మతో కలిసి ఆమె పసిడి నెగ్గింది. నవంబర్ 27 న ఫైనల్లో సురేఖ – అభిషేక్ జంట 158-151 తేడాతో యీ చెన్ ఛీ లూ చెన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించింది. కాంపౌండ్ మహిళల టీం విబాగంలో సురేఖ, ముస్కాన్ ప్రియా లతో కూడిన భారత జట్టు వెండి పథకం గెలిచింది. తుది పోరులో భారత్ 215-231 తేడాతో కొరియా చేతిలో పోరాడి ఓడింది. భారత ఆర్చరీ సమాఖ్య మీద నిషేధం కారణంగా స్వతంత్ర క్రీడాకారులుగా బరిలోకి దిగిన భారత ఆర్చర్ లు మొత్తం ఏడు పథకాలు ( ఓ స్వర్ణం ,రెండు రజతాలు , నాలుగు కాంస్యాలు ) తో చాంపియన్ షిప్ ను ముగించారు..
క్విక్ రివ్యూ
ఏమిటి : ఆసియా ఆర్చరీ చంపియన్ షిప్ లో సురేఖ జోడికి స్వర్ణం
ఎక్కడ: బ్యాంకాక్
ఎవరు; వెన్నం జ్యోతి సురేఖ
ఎప్పుడు: నవంబర్ 27
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
రెడ్ క్రాస్ చైర్మెన్ గా శ్రీదర్ రెడ్డి గారు ఎన్నిక
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మెన్ గా ప్రముఖ దంత వైద్యుడు, రాష్ట్రపతి అవార్డుల గ్రహీత డాక్టర్ ఆరుమల్ల శ్రీదర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. నవంబర్ 27 న ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ గారి సమక్షంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి అర్జున రావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ వైస్ చైర్మెన్ గా పి. జగన్మోహన్ రావు, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆశ్విన్ కుమార్ పరీదాను జనరల్ సెక్రటరీ గా, కోశాధికారిగా జి.వై.ఎం. బాబు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
క్విక్ రివ్యూ
ఏమిటి : రెడ్ క్రాస్ చైర్మెన్ గా శ్రీదర్ రెడ్డి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎవరు; శ్రీదర్ రెడ్డి
ఎప్పుడు: నవంబర్ 27
డిసెంబెర్ 1 న ఆంద్ర ప్రదేశ్ లో న్యాయాధికారుల సదస్సు
రాష్ట్ర విభజన అనతరం ఏపి రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు డిసెంబెర్ 1 న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో (ఏ.ఎన్.యూ) లోని డైక్ మెన్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలో 530 మంది న్యాయాదికారులు పాల్గొననున్నారు. హైకోర్ట్ ప్రదాన న్యాయమూర్తి (సి.జే) జస్టిస్ జే.కే మహేశ్వరి ఈ సదస్సు ను ప్రారంబిస్తారని హైకోర్ట్ జనరల్ రిజిస్టార్ జనరల్ (ఇంచార్జ్ ) రాజశేఖర్ నవంబర్ 27 న తెలిపారు.
క్విక్ రివ్యూ
ఏమిటి : డిసెంబెర్ 1 న ఆంద్ర ప్రదేశ్ లో న్యాయాధికారుల సదస్సు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబెర్ 1
ప్రకాశం జిల్లా లో ఓ పొలం లో బయట పడిన నన్నెచోడుడి శాసనం
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఉలిచి గ్రామానికి చెందిన రెడ్ద బోయిన కృష్ణ మూర్తి పొలంలో శిలా శాసనం వెలుగు చూసింది. దాన్ని స్థానికులు గ్రామ పంచాయితి కార్యాలయం దగ్గరకు తీసుకువచ్చి చెన్నై కి చెందిన పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నవంబర్ 27 వచ్చిన అధికారుల బృందం శాసనాన్ని పరిశీలించింది. శాలివాహన శకం 1097,క్రీ.శ..1170 లో కొనిదెన పాలకుడైన త్రిబువన మల్లదేవ మహారాజు కుమారుడైన నన్నెచోడుడు ఉలిచి గ్రామంలోని మల్లికార్జున స్వామికి నీత్య ధూప దీప నైవేద్యాల కోసం దానం చేసిన వివరాలు శాసనం లో ఉన్నట్లు బృందం సబ్యుడు బి. ఏసుదాసు తెలిపారు.
క్విక్ రివ్యూ
ఏమిటి : ప్రకాశం జిల్లా లో ఓ పొలం లో బయట పడిన నన్నెచోడుడి శాసనం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 27
పోల్ట్రీ ఇండియా ఎక్స్ పో ప్రారంబం
హైదరాబాద్ మాదాపూర్ లోని హైటెక్స్ లో ఏర్పాటు చేసిన 13 వ పౌల్ట్రీ ఇండియాఎక్స్ప్ పో ను నవంబర్ 27న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంబించారు. పోల్ట్రీ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేసే లక్ష్యం తో ఏర్పాటైన ఈ ఎక్స్ పో లో దాదాపు 350 కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. పోల్ట్రీ ఫాం నిర్వహనకు అవసరమైన ప్రతి వస్తువు అందుబాటులో ఉండేలా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచాయి.
క్విక్ రివ్యూ
ఏమిటి : పోల్ట్రీ ఇండియా ఎక్స్ పో ప్రారంబం
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు; తలసాని శ్రీనివాస్ యాదవ్
ఎప్పుడు: నవంబర్ 27
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |