Daily Current Affairs in Telugu 19&20-08-2021
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్ లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నమానిక బాత్రా సత్యన్ జోడి :
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్ లో మనిక బాత్రా సత్యన్ జోడీ సత్తా చాటింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఈ భారత జంట మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మనిక-సత్యన్ 11-9, 9-11, 12-10, 11-6 స్కోరు తో ప్రపంచ 94వ ర్యాంక్ జంట డోరా -నాన్డర్ (హంగేరి) పై విజయం సాధించింది. ఈ పోరులో మనిక-సత్యన్ కేవలం ఒక్క గేమ్ మాత్రమే ప్రత్యర్థులకు వదులుకున్నారు. ఆసియా క్రీడలలో శరత్ కమల్ తో కలిసి కాంస్యం గెలిచిన మనిక. సత్యన్ తో కలిసి ఎక్కువగా ఆడకపోయినా ఫైనల్లో మాత్రం ఇద్దరూ సమ స్వయంతో ఆడి విజయాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్ లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న మానిక బాత్రా సత్యన్ జోడి
ఎవరు: మానిక బాత్రా సత్యన్
ఎక్కడ:హంగేరి
ఎప్పుడు: ఆగస్ట్ 19
మలేషియా నూతన ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ నియామకం :
మలేషియా నూతన ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ (61) నియమితులయ్యారు. ఇప్పటివరకు మలేషియా ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన ఆగస్టు 21న మలేషియా తొమ్మిదో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటిదాకా ప్రధానిగా పనిచేసిన ముహియిద్దిన్ యాసిన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధికార కూటమిలో అసంత అసంతృప్త ఎంపీల తిరుగుబాటు వల్ల కేవలం యాసిన్ 18 నెలల్లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మలేషియా రాజుగా ఎల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఉన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: మలేషియా నూతన ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ నియామకం
ఎవరు: ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్
ఎక్కడ: మలేషియా
ఎప్పుడు:ఆగస్ట్ 19
అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో లాంగ్ జంప్ లో రజత పతకం గెలిచిన శైలి :
భారత లాంగ్ జంప శైలి సింగ్ త్రుటిలో చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో ఒక్క సెంటీమీటర్ తేడాతో స్వర్ణ పతకం చేజార్చుకున్న ఆమె రజతాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్ల శైలి అత్యుత్తమంగా 6.59 మీటర్లు దూకింది. స్వీడన్ కు చెందిన మజా అస్కాగ్ 6.60 మీటర్ లు దూకి పసిడి పతకం గెలుచుకుంది. భారత దిగ్గజ లాంగ్ జంపర్ అంజు బాబి జార్జ్ శిష్యురాలైన శైలి మూడో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో ఉంది. కానీ నాలుగో రౌండ్ లో ఆమెను అస్కాగ్ అధిగమించింది. శైలి తిరిగి అగ్రస్థానానికి రాలేకపోయింది. కాగా ఉక్రెయిన్ అమ్మాయి మరియా హోరీలోవా కాంస్యం (6.50మీ) సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో లాంగ్ జంప్ లో రజత పతకం గెలిచిన శైలి
ఎవరు: శైలి
ఎప్పుడు: ఆగస్ట్ 20
ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం గా ఆగస్ట్ 19 :
ఫోటోగ్రఫీని ఒక అబిరుచిగా ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను గుర్తించడానికి ని ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆగష్టు 19, 2010న మొదటి అధికారిక ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరిగింది ప్రపంచ ఫోటో దినోత్సవం యొక్క మూలం 1837 లో ఫ్రెంచ్ మ్యాన్ లూయిస్ డాగూరె మరియు జోసెఫ్ న్ఫైర్ నీప్పేచే అభివృద్ధి చేయబడిన డాగ్యురోటైప్(Daguerreotype) ఆవిష్కరణ నుండి వచ్చింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం గా ఆగస్ట్ 19
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: ఆగస్ట్ 19
భారత మాజీ పుట్ బాలర్ ఒలింపియన్ ఎస్ఎస్ హకీమ్ కన్నుమూత :
భారత మాజీ పుట్ బాలర్ ఒలింపియన్ ఎస్ఎస్ హకీమ్ కన్నుమూశారు. 82 ఏళ్ల హకీమ్ ఆగస్ట్ 22 న మల్బర్గలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సబ్యులు వెల్లడించారు. హైదారాబాద్ లో పుట్టిన హకీమ్ 1960 సంవత్సరం రోమ్ ఒలింపిక్స్ లో పోటీపడ్డ భారత ఫుట్బాల్ జట్టులో సభ్యుడుగా ఉన్నారు. ఆ జట్టుకు ఆయన తండ్రి సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్ కావడం విశేషం. భారత ఫుట్బాల్ జట్టు ఆడిన చివరి ఒలింపిక్ క్రీడలు అవే. హకీమ్ కు భారత ఫుట్బాల్ తో అయిదు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ధ్యాన్ చంద్ అవార్డునూ అందుకున్నాడు. కొంతకాలం భారత ఫుట్ బాల్ జట్టు కోచ్ గా కూడా ఉన్నారు. దేశవాళీలో పలు క్లబ్ ల కు కూడా హకీమ్ కోచ్ గా పనిచేశారు. ఆయన ఫిఫా రిఫరీ గా కూడా 1988 ఆసియాకప్ మ్యాచ్ లు సహా 33 అంతర్జాతీయ మ్యాచ్ లో ఆయన ఆడారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మాజీ పుట్ బాలర్ ఒలింపియన్ ఎస్ఎస్ హకీమ్ కన్నుమూత
ఎవరు: ఎస్ఎస్ హకీమ్
ఎప్పుడు: ఆగస్ట్ 22
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (IEG) సొసైటీ అధ్యక్షుడిగా NK సింగ్, నియామకం :
15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కే సింగ్ ఆగస్టు 16 న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (IEG) సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1992సంవత్సరం నుండి ఆ స్థానంలో ఉన్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి తరువాత ఆయన నియమితులయ్యారు.. డాక్టర్ సింగ్ అతని పేరును సిఫార్సు చేసారు IEG యొక్క సాధారణ అసెంబ్లీ పరిశీలనకు పేరు, ఒక అధికారిక ప్రకటన తెలిపింది డాక్టర్ సింగ్ ఆరోగ్య కారణాల వల్ల పదవి నుండి తప్పుకోవాలని తన కోరికను వ్యక్తం చేశారు. IEG అనేది ఒక స్వయంప్రతిపత్తమైన సంస్థ అధునాతన పరిశోధన మరియు శిక్షణ కోసం మల్టీడిసిప్లినరీ సెంటర్, దీనిని 1952 లో VKRV రావు స్థాపించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (IEG) సొసైటీ అధ్యక్షుడిగా NK సింగ్ నియామకం
ఎవరు: NK సింగ్
ఎప్పుడు: ఆగస్ట్ 19
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |