Daily Current Affairs in Telugu 21-07-2020
బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ గా వైదొలగనున్న రాహుల్ బజాజ్ :
దాదాపు మూడు దశాబ్దాల పాటు బజాజ్ ఫైనాన్స్ కు సారద్యం వహించిన రాహుల్ బజాజ్ ఆ సంస్థ యొక్క నాన్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. నాన్ ఎగ్సిక్యుటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కొనసాగుతారు. ఆగస్టు 01 నుంచి అయన స్థానం లో సంజీవ్ బజాజ్ బాద్యతలు చేపడతారు.1987 లో ఏర్పాటు అయినప్పటి నుంచి సుమారు 3దశాబ్దాల పైగా బజాజ్ ఫైనాన్స్ కు 5 దశాబ్దాలుగా గ్రూపునకు రాహుల్ బజాజ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ గా వైదొలగనున్న రాహుల్ బజాజ్ :
ఎవరు: రాహుల్ బజాజ్
ఎప్పుడు: జూలై 21
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్ జి టాండన్ కన్నుమూత :
బిజెపి సీనియర్ నేత ,మధ్యప్రదేశ్ గావ్ గవర్నర్ లాల్జి టాండన్ (85) కన్ను మూసారు. గత కొంతకాలంగా ఆస్వస్తతో లక్నో లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాండన్ జూలై 21న ఉదయం కన్ను మూసారు. లాల్జీ గుండె పోటుతో చనిపోయినట్లు లక్నో లో ని మేదాంత ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లాల్జీ కుమారుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కేబినేట్ మంత్రిగా ఉన్నారు. బిజేప్ నేతలతో అటల్ బీహార్ వాజ్ పేయి,అద్వాని లకు సన్నిహితంగా పరిపాలన దక్షుడిగా ఆయనకు పేరుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్ జి టాండన్ కన్నుమూత
ఎవరు: లాల్ జి టాండన్
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: జూలై 21
ప్రపంచంలోనే టెస్టు ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ గా అగ్రస్థానానికి చేరుకున్న బెన్ స్తోక్స్ :
అద్బుత ప్రదర్శనతో వెస్టిండీస్ పై రెండో టెస్టులో ఇంగ్లాండ్ ను గెలిపించిన బెన్ స్తోక్స్ ఐసిసి టెస్టు ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి వెళ్ళాడు. జూలై 20న ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లోఅతను నంబర్ వన్ గా (497 పాయింట్లతో) నిలిచాడు. పలితంగా ఆండ్రూ ఫ్లింటాఫ్ (2006) తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా నిలిచాడు. గత 18 నెలలుగా అగ్రస్థానం లో ఉన్న విండీస్ కెప్టెన్ హోల్డర్ (459) తో స్తోక్స్ వెనక్కి నెట్టి ర్యాంకింగ్స్ లో ముందు వరుసలో కి వచ్చాడు. రెండో టెస్టులో 176,78 పరుగులు చేయడంతో పాటు 3వికెట్లు తీసిన ప్రదర్శన అతడిని నంబర్ వన్ ర్యాంకింగ్ లో చేరుకున్నాడు.మరో వైపు 40 పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్ ఐసిసి టెస్టు చాంపియన్ షిప్ లో మొత్తం 186 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే టెస్టు ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ గా అగ్రస్థానానికి చేరుకున్న బెన్ స్తోక్స్ :
ఎవరు: బెన్ స్తోక్స్
ఎప్పుడు: జూలై 21
నీటి పారుదల శాఖను జలవనరుల శాఖ గా పేరు మార్చిన తెలంగాణా ప్రభుత్వం :
తెలంగాణా రాష్ట్రంలో గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగు నీటి రంగానికి ప్రాదాన్యత ,బాద్యత పెరుగుతున్నది అని ముఖ్యమంత్రి కే.చంద్రశేకర్ రావు అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీతి పారుదల శాఖ వికేంద్రీకరణ పునర్వ్యాస్తీకరణ జరగాలని చెప్పారు.కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే వ్యవస్తను వాటి నిర్వహణ పకడ్బందిగా ఉండాలన్నారు.నీటి పారుదల శాఖ కు ఇక నుండి జల వనరుల శాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్) గా మారుస్తున్నట్లు ప్రకటించారు. జల వనరుల శాఖ పై జూలై 20 న విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించిన సిఎం కెసిఆర్ ఈ మేరకు వెల్లడించారు.ఎత్తిపోతల పథకాల అన్ని పంప్ హౌస్ ల నిర్వహణ ను విద్యుత్ శాఖ కు అప్పగించాలని కీలక సూచన చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నీటి పారుదల శాఖను జలవనరుల శాఖ గా పేరు మార్చిన తెలంగాణా ప్రభుత్వం
ఎవరు: తెలంగాణా ప్రభుత్వం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు:జూలై 21
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |