Daily Current Affairs in Telugu 18-06-2020
భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం గా ఎన్నికైన భారత్ :
ఐక్యరాజ్యసమితి లోని శక్తి వంతమైన విభాగమ బద్రతా మండలిలోని తాత్కాలిక సభ్య దేశం గా భారత్ ఎన్నికైంది. అధ్బుత మెజారిటీ తో ఈ విజయాన్ని దక్కించుకుంది. రెండేల్ల పాటు ఈ సబ్యత్వం కొనసాగుతుంది. కోవిద్ -19 మహమ్మారి నేపద్యంలో 192 దేశాలు ప్రతినిధులు మాస్కులను దరించి బౌతిక దూరం పాటిస్తూ ఈ పోలింగ్ లో పాల్గొన్నారు. మొత్తం ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం తాజా ఎన్నికలు జరిగాయి.ఆసియా ఫసిఫిక్ దేశాల నుంచి పోటీ పడ్డ భారత్ కు మొత్తం 192 ఆటకు గాను 184 ఓట్లు లబించాయి. మూడింట రెండొంతుల మెజార్టీ (128)ఓట్లు వస్తే విజయం దక్కుతుంది. మన దేశం తో పాటు ఐర్లాండ్ ,మెక్సికో ,నార్వేలు కూడా బద్రత మండలి లో ఎన్నికయ్యాయి. మరో సీటు కోసం జిబౌటి ,కేన్య దేశాలు పోటీ పడ్డాయి. అయితే అవసరమైన 128 ఓట్లను సాధించడంలో రెండు దేశాల విపలమయ్యాయి. దీంతో మరో విడత ఓటింగ్ జరగనుంది.సర్వ ప్ర్రతినిది సభ అద్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. టర్కి దౌత్య వేత్త పార్లమేంటేరియన్ ఒల్కాన్ బోజ్కిర్ ఇందులో విజయం సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం గా ఎన్నికైన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు:జూన్ 18
పోటీ తత్వ సూచికలో 43 వ స్థానం లో నిలిచిన భారత్ :
2020 వ సంవత్సరానికి గాను అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ (ఐఎండి) జూన్ 16 న విడుదల చేసిన ప్రపంచ పోత్య్తత్వ సూచిలో భారత్ కు 43వ ర్యాంకు లబించింది. మొత్తం 63 దేశాలకు ఐఎండి ర్యాంకింగ్ ఇవ్వగా ఈ జాబితాలో సింగపూర్ మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. సింగపూర్ తర్వాత డెన్మార్క్ రెండో స్థానంలో, స్విట్జర్ ల్యాండ్ మూడో స్థానంలో నెదర్లాండ్ దేశం 4స్థానంలో ,హాంకాంగ్ 5వ స్థానం లో నిలిచాయి. అమెరికా 3వ స్థానం నుంచి 10 స్థానంకి చైనా 14 నుంచి 20 స్థానానికి పడిపోయాయి
క్విక్ రివ్యు :
ఏమిటి: పోటీ తత్వ సూచికలో 43 వ స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: జూన్ 18
.
భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘర్షనలు :
ఇండో చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తూర్పు లడక్ ఆని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాలు సైనికుల మధ్య జూన్ 15 న రాత్రి జరగిన తీవ్ర స్థాయి హింసాత్మక ఘర్షణలో రెండు దేశాలకు బారీగా ప్రాణ నష్టం జరిగింది ఎదురెదురు పోరాటం లో రాళ్ళు ఇనుప రాడ్ లతో చైనా సైనికులు దాడి చేశాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి.ఈ ఘర్షణల కారణంగా 20 మంది భారతీయ ఆర్మీ ప్రకటించింది. ఘటన స్థలి నుంచి రెండు దేశ సైనికులు వెనక్కి తగ్గారని పేర్కొంది. ఇందులో భాగంగా తెలంగాణ లోని సూర్యపేట కు చెందిన కల్నల్ సంతోష్ గాల్వన్ లోయ ప్రాంతంలో ఈ ఘర్షణలో అమరుడయ్యాడు. ఈయన 16 వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘర్షనలు
ఎవరు: భారత్ చైనా మద్య
ఎక్కడ:లద్దాక్
ఎప్పుడు: జూన్ 16
గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అనే పథకం ప్రారంబించిన భారత ప్రభుత్వం :
గరీబ్ కళ్యాణ్ రోజ్ గార అభియాన్ అనే ఒక నూతన పతాకాన్ని బీహార్ లోని ఖాగారియా జిల్లా తెలిహార్ అనే గ్రామం నుండి ఈ పథకాన్ని భారత ప్రబుత్వం ప్రారమించనుంది. ఇది ఒక బారీ గ్రామీణ ప్రజా పనుల పథకం ఇది తిరిగి వచ్చిన వలస కార్మికులతో పాటు గ్రామిన పౌరులకు ,పట్టణ పౌరులకు కూడా జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలోని గ్రామాలు కామన్ సర్వీస్ సెంటర్ మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా చేరనున్నాయి. ఉత్తర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్,రాజస్తాన్, ఓడిశా ,జార్ఖండ్ ,బీహార్ లోని జిల్లాలో ఈ పథకం అమలు చేయనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అనే పథకం ప్రారంబించిన భారత ప్రభుత్వం
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ: బీహార్ లో
ఎప్పుడు: జూన్ 18
2021 లో భారత ఆర్ధిక వ్యవస్థ 4% కు కుధించగలదని అంచనా వేసిన ఎడిబి :
2021 ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ 4 శాతానికి కుదించ బడుతుదని ఆసియా అబివృద్ది బ్యాంకు(ఎడిబి) అంచనా వేసింది. కోవిద్ -19 వ్యాప్తి తగ్గించడానికి దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల రెండు నెలలకు పైగా వ్యాపారాలు నిలిచిపోయాయి. 2022 ఆర్ధిక సంవత్సరంలో లో 5%వృద్ది రేటుతో భారత ఆర్హ్తిక వ్యవస్థ కోలుకుంటుందని ఆసియా అబివృద్ది బ్యాంకు ఆశిస్తోంది. ఎందుకంటే అప్పటి వరకు ఆర్ధిక కార్యకలాపాలు క్రమంగా సాదారణ స్థితికి చేరుకుంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2021 లో భారత ఆర్ధిక వ్యవస్థ 4% కు కుధించగలదని అంచనా వేసిన ఎడిబి
ఎవరు: ఎడిబి
ఎప్పుడు: జూన్ 18
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |