Daily Current Affairs in Telugu 17-06-2020
తెలంగాణా విద్యుత్ ప్రాజెక్ట్ జి.ఎంగా ప్రసేన్ జిత్ పాల్ నియామకం :
ఎన్టీ పీసీ యాజమాన్యం రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణా విద్యుత్ ప్రాజెక్ట్ కు జి.ఎం గా ప్రసేన్ జిత్ పాల్ ను నియమిస్తూ యాజమాన్యం జూన్ 17న ఉత్తర్వులు జరీ చేసింది. మధ్యప్రదేశ్ లోని గడర్వరా ఎన్టీపీసీ ప్రాజెక్టులో జి.ఎంగా పని చేస్తున్న ప్రసేన్ జిత్ పాల్ ను రామగుండము కు బదిలీ చేసింది. కాగా తెలంగాణా ప్రాజెక్టు సిజిఎం గా పని చేసిన ప్రేం ప్రకాష్ ను సంస్థ ప్రాజెక్టు ,ప్లానింగ్ ఈడి గా ఇటివల బదిలీ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : తెలంగాణా విద్యుత్ ప్రాజెక్ట్ జి.ఎంగా ప్రసేన్ జిత్ పాల్ నియామకం
ఎవరు: ప్రసేన్ జిత్ పాల్
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్17
100మీ ప్రపంచ చాంపియన్ క్రిస్టియన్ కోల్ మన్ ఎఐయు సస్పెన్షన్ విధింపు :
100 మీ పరుగు ప్రపంచ చంపియన్ అయిన క్రిస్టియన్ కోల్ మన్ పై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటి యూనిట్ ఏఐయు సస్పెన్షన్ వేటు వేసింది. నిర్ణీత వ్యవధిలో డొప్ పరీక్షలకు హాజరు కాకపోడమే ఇందుకు కారనం .గత ఏడాది ప్రపంచ చాంపియన్ షిప్ ముంగిట అతను రెండు సార్లు డొప్ పరీక్షలకు అందుబాటులో లేకపోవడం పై దుమారం రేగింది. డిసెంబర్ 09 న మూడో సారి అతను డొప్ పరీక్షకు హాజరు కాలేదు. దీనిపై విచారించిన ఏఐయు ఇప్పుడు సస్పెన్షన్ వ వేటు వేసింది
క్విక్ రివ్యు :
ఏమిటి :100మీ ప్రపంచ చాంపియన్ క్రిస్టియన్ కోల్ మన్ ఎఐయు సస్పెన్షన్ విధింపు :
ఎవరు: క్రిస్టియన్ కోల్ మన్
ఎప్పుడు: జూన్ 17
కర్మభూమి అనే జాబ్ పోర్టల్ ను ప్రారంబించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం :
ప్రపంచ వ్యాప్తంగావివిధ దేశాలను వణికిస్తున్న కోరనా వైరస్ (కోవిద్ -19) వ్యాప్తి నేపద్యం లో వివిధ ప్రదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటి నిపుణుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జాబ్ పోర్టల్ “కర్మభూమి “అనే పేరుతో ప్రారంబించింది. ఐటి నిపుణుల ఈ పోర్టల్ ను ఉపయోగించి రాష్ట్రానికి చెందిన సంస్థలతో కనెక్ట్ అవవచ్చు. ఇది బెంగాల్ లోని నిపుణులు మరియు ఐటి కంపెనీల మధ్య ఇది ఒక మాధ్యమం గా పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కర్మభూమి అనే జాబ్ పోర్టల్ ను ప్రారంబించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ఎవరు: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ఎక్కడ: పశ్చిమబెంగాల్
ఎప్పుడు: జూన్ 17
షార్జా ఆన్ లైన్ అంతర్జాతీయ చెస్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న మేమేద్వారోవ్ :
వరల్డ్ స్టార్స్ షార్జా ఆన్ లైన్ ఇంటర్ నేషనల్ చెస్ చాంపియన్ షిప్ లో అజార్ బైజాన్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ అయిన షాక్రియార్ మమేద్వారోవ్ గెలుపొందారు. అతను 10రౌండ్ల నుంచి 7.5 పాయింట్లు సాధించిన తరువాత టైటిల్ మరియు 3000 డాలర్ల ప్రైజ్ మని ని గెలుచుకున్నాడు. చాంపియన్ షిప్ లో భారతీయ గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ 10 రౌండ్ల నుంచి 6.5 పాయింట్లు సాధించి రెండో స్థానం లో నిలిచాడు. షార్జా ఆన్ లైన్ ఇంటర్ నేషనల్ చెస్ చాంపియన్ షిప్ ను షార్జా కల్చరల్ &చెస్ క్లబ్ నిర్వహించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : షార్జా ఆన్ లైన్ అంతర్జాతీయ చెస్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న మేమేద్వారోవ్
ఎవరు: మేమేద్వారోవ్
ఎప్పుడు: జూన్ 17
Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |