Daily Current Affairs in Telugu 16-06-2020
తెలంగాణా లో ఏర్పాటు కాబోతున్న ఖెలో ఇండియా సెంటర్ :
తెలంగాణాలో ఖెలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (కే.ఐఎస్సిఈ)ఏర్పాటు కాబోతుంది.క్రీడా వసతులు పెంపొందించే ఉద్దేశం తో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణకు చోటు దక్కింది.కర్ణాటక ,ఓడిశా ,కేరళ ,అరుణాచల్ ప్రదేశ్ ,మణిపూర్ ,మిజోరాం ,నాగాలాండ్ ఇతర ఏడు రాష్ట్రాలు.ఈ పథకం కింద అక్టోబర్ లో రాష్ట్రంలో ని ఏదైనా స్టేడియాన్ని ఎంచుకుని ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను కల్పిస్తారు.వివిధ క్రీడల్లో వర్తమాన క్రీడాకారులని చాంపియన్ లని తీర్చి దిద్దేల ఉద్ద్దేశం తో నిధుల కేటాయింపు జరుగుతుంది.కేంద్ర రాష్ట్ర క్రీడా శాఖలు ఈ కేంద్రాల్లో నిర్వహణ సౌకర్యాలు ,క్రీడాకారులు వసతి బాధ్యతలు చూసుకుంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా లో ఏర్పాటు కాబోతున్న ఖెలో ఇండియా సెంటర్
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్ 16
తెలంగాణా రాష్ట్ర పంచాయతి రాజ్ కు దక్కిన ఏడు కేంద్ర పురస్కారాలు :
ఉత్తమ గ్రామ పంచాయతి లకు కేంద్ర పంచాయితి రాజ్ శాఖ ప్రతి ఏటా ప్రకటించే దీన్ దయాల్ ఉపాద్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాల్లో తెలంగాణ పంట పండింది.వివిధ కేటగిరిలో రాష్ట్రానికి విశేషం .జిల్లా మండలం ,గ్రామ పంచాయితి రాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ జోషి ఈ అవార్డులను ప్రకటించారు.జిల్లా విభాగం ల నిజామాబాద్ కు మండలం విభాగం ఓ పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన బాద్ ,ఇదే కేటగిరి లో నిజామాబాద్ జిల్లా నందిపేట ,పంచాయితి విభాగంలో పెద్దపల్లి జిల్లా శ్రీరాం పూర్ మండలం కిస్తాపేట ,సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గుర్రలగుంది,జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం గంగారం ,సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ ,మండలం పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామ పంచాయితీ లకు జనరల్ కేటగిరిలో జాతీయ అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర పంచాయతి రాజ్ కు దక్కిన ఏడు కేంద్ర పురస్కారాలు
ఎవరు: కేంద్ర పంచాయితి రాజ్ శాఖ
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్ 16
నాబార్డు సిజీఎం బాధ్యతలు స్వీకరించిన వై.కృష్ణారావు :
నాబార్డు రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) గా వై,కృష్ణా రావు గారు జూన్ 15 న హైదరాబాద్ లో బాధ్యతలు స్వీకరించారు.ఈ పోస్టులో కొనసాగింపు గా సెల్వ రాజ్ ఇటివల ముంబై లోని ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు.మేఘాలయలోని నాబార్డు కార్యాలయంలో జిఎంగా పని చేసిన కృష్ణా రావు పదిన్నతి పైన తెలంగాణా కు వచ్చారు.పశ్చిమ గోదావరి జిల్లా చాట పర్రుకు చెందిన అయన రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ కళాశాలలో డిగ్రీ,పిజీ చదివారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాబార్డు సిజీఎం బాధ్యతలు స్వీకరించిన వై.కృష్ణారావు
ఎవరు: వై.కృష్ణారావు
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్ 16
భారతీయ గ్యాస్ ఎక్స్చేంజి ని ప్రారంబిచిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ :
కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రదాన్ ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ (ఐజిఎక్స్) ను ప్రారంబించారు.ఐజిఎక్స్ దేశ వ్యాప్తంగా మొట్టమొదటి ఆన్ లైన్ డెలివరి ఆదారిత గ్యాస్ ట్రేడింగ్ ఫ్లాట్ ఫాం .ఈ ట్రేడింగ్ ఫ్లాట్ ఫాం మార్కెట్ లో పాల్గొనే వారికీ ప్రామాణిక గ్యాస్ కాంట్రాక్ట్ లో వ్యాపారం చేయటానికి వీలు కల్పిస్తుంది.వెబ్ ఆధారిత ఇంటర్ ఫేస్ తో ఐజిఎక్స్ పూర్తిగా అటోమేటెద్ మరియు ఇది నిరవధికంగా సేవలు అందించే వాణిజ్య అనుభవాన్ని అందిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతీయ గ్యాస్ ఎక్స్చేంజి ని ప్రారంబిచిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
ఎవరు: ధర్మేంద్ర ప్రదాన్
ఎప్పుడు: జూన్ 16
Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |