Daily Current Affairs in Telugu 15-05-2021
అంగారకుడి ఉపరితలంపైకి ఒక రోవర్ ను పంపిన రెండవ దేశంగా నిలిచిన చైనా :
అంగారకుడి ఉపరితలంపై చైనా తొలి సారిగా తన ముద్ర వేసింది. ఆ గ్రహంపై విజయ వంతంగా ఒక రోవర్ను దించింది. తద్వారా అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా గుర్తింపు పొందింది. అంగారక గ్రహంపై ఉన్న యుదోపియా శ్రేణులను టార్గెట్ చేస్తూ ఈ రోవర్ను లాంచ్ చేశారు.ఈ సంక్లిష్ట ప్రక్రియను దిగ్విజ యంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు చైనా అధ్యక్షుడు జిన్పెంగ్ అభినందనలు తెలిపారు. తమ ఖగోళ పరి శోధనల్లో ఇదో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొ న్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కూడా చైనా శాస్త్రవేత్తలను అభినందించింది. తియాన్వెన్-1 పేరిట ఒక వ్యోమనౌకను చైనా గత ఏడాది జులై 23న భూమి నుంచి ప్రయోగించింది. అందులో అండర్, రోవర్ ఉన్నాయి. తియాన్వెన్-1 ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి అక్కడే తిరుగుతూ పరిశోధనలు సాగించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంగారకుడి ఉపరితలంపైకి ఒక రోవర్ ను పంపిన రెండవ దేశంగా నిలిచిన చైనా
ఎవరు: చైనా
ఎక్కడ: చైనా
ఎప్పుడు: మే 15
వెల్నెస్ ప్రోగ్రాం ‘ఆయుష్ ఘర్ ద్వార్’ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ :
హిమాచల్ ప్రదేశ్లో, ఆయుష్ విభాగం స్లోన్ జిల్లాలో కోవిడ్-19 రోగుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ ప్రోగ్రాం ‘ఆయుష్ ఘర్ ద్వార్’ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై 1000 వర్చువల్ గ్రూపులు తయారు చేయబడతాయి, దీని ద్వారా ఆయుర్వేదంపై శిక్షణ పొందిన బోధకులు యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు, ధ్యానం, చికిత్సలు, మందులు మరియు అభ్యాసాలపై వర్చువల్ సెషన్లను నిర్వహిస్తారు. కోవిడ్ రికవరీ రేటు, మెరుగైన జీవన నాణ్యత, ఈక్విటబుల్ హెల్త్ కేర్ సదుపాయం మరియు మెరుగైన పునరావాస౦ కల్పించడం కోవిడ్-19 సంక్రమణను తగ్గించి దాని ద్వారా మహమ్మారి వ్యాధి భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
క్విక్ రివ్యు :
ఏమిటి: వెల్నెస్ ప్రోగ్రాం ‘ఆయుష్ ఘర్ ద్వార్’ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్
ఎవరు: హిమాచల్ ప్రదేశ్
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్
ఎప్పుడు: మే 15
‘విటీ అవార్డ్స్ 2021’ విజేతగా నాగాలాండ్ కన్జర్వేషనిస్ట్ వైనుక్లూ ఫోమ్ :
నాగాలాండ్ రాష్ట్రం యొక్క మారుమూల ప్రాంతం ఐన లాంగ్లెంగ్ జిల్లాకు చెందిన పర్యావరణవేత్త గ్రీన్ ఆస్కార్ అని కూడా పిలువబడే విట్లీ అవార్డు 2021 ను గెలుచుకున్నారు. యుకెకు చెందిన విట్లీ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యుఎఫ్ఎన్) నిర్వహించిన వర్చువల్ అవార్డు వేడుకలో నుక్లూ ఫోమ్ పేరు తో పాటు మరో ఐదుగురి పేరు ప్రకటించబడింది నాగాలాండ్లో జీవవైవిధ్య శాంతి కారిడార్ను స్థాపించడంలో చేసిన కృషికి ఇచ్చిన గ్రీన్ ఆస్కార్ అని కూడా పిలువబడే ‘విటీ అవార్డ్స్ 2021’ విజేతగా నాగాలాండ్ కన్జర్వేషనిస్ట్ పై నుక్లూ ఫోమ్ ఎంపికయ్యారు. మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ప్రతిష్టాత్మక వార్షిక అవార్డును గెలుచుకున్న ఏకైక భారతీయుడు వైనుక్లూ ఫోమ్ కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘విటీ అవార్డ్స్ 2021’ విజేతగా నాగాలాండ్ కన్జర్వేషనిస్ట్ వైనుక్లూ ఫోమ్
ఎవరు: వైనుక్లూ ఫోమ్
ఎక్కడ: నాగాలాండ్ రాష్ట్రం
ఎప్పుడు: మే 15
. వైట్ హౌస్ సీనియర్ సలహాదారుగా భారత సంతతి నీరా టాండన్ నియామకం :
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో ఇండియన్ అమెరికన్ నియమితులయ్యారు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్ ను బైడెన్ నియమించారు. గతంలో ఆమెను వైట్ హౌస్లో బడ్జెట్చీఫ్ గా నియామించాలనుకున్నప్పుడు రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి౦ది. ఈ నేపథ్యంలో ఆమెను సీనియర్ సలహదారుగా బైడెన్ నియమించారు. దీనికి సెనెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఆమె హెల్త్ కేర్ ఇంటర్నెట్ యాక్సెస్ అంశాలపై ఆమె దృష్టిసారించనున్నారు. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీఏపీ) అధ్యక్షురాలిగా పనిచేస్తున్న టాండన్ గతంలో అద్వకుడు ఐరాక్ బామాకు మాజీ విదేశాంగ మంత్రి హిలరీ క్లింటనక్కు సలహాదారుగా పనిచేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: . వైట్ హౌస్ సీనియర్ సలహాదారుగా భారత సంతతి నీరా టాండన్ నియామకం
ఎవరు: నీరా టాండన్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: మే 15
గ్లోబల్ కోవాక్స్ కూటమిలో చేరిన మొదటి భారతీయ రాష్ట్రం పంజాబ్ :
గ్లోబల్ కోవాక్స్ (కోవిడ్ -19 వ్యాక్సిన్స్ గ్లోబల్ యాక్సెస్) కూటమిలో చేరిన మొదటి భారతీయ రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. గ్లోబల్ యాక్సెస్ అనేది యాంటీ-కోవిడ్ వ్యాక్సిన్లకు సమానమైన ప్రాప్యతను అందించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్త౦గా తీసుకున్న చొరవ. కోవాక్స్ కోయిలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్ (సిపిఐ) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), కీలక డెలివరీ భాగస్వామి యునిసెఫ్‌తో కలిసి పని చేస్తుంది. ఈ కూటమిలో చేరడం ద్వారా యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్ కొరతను తీర్చడానికి మరియు సరైనటువంటి ధరల వద్ద వ్యాక్సిన్లను సేకరించడానికి పంజాబ్ సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్లోబల్ కోవాక్స్ కూటమిలో చేరిన మొదటి భారతీయ రాష్ట్రం పంజాబ్
ఎవరు: పంజాబ్
ఎక్కడ: పంజాబ్
ఎప్పుడు: మే 15
మాజీ గవర్నర్ రఘునం లాల్ భాటియా కన్నుమూత :
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ రఘునం లాల్ భాటియా కన్నుమూశారు. (100) ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినటంతో భాటియా మే 15న ఉదయం తుదిశ్వాస విడిచి నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అమృత్ సర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004 2009 మధ్య కేరళ, బిహార్ గవర్నర్ గా ఆయన సేవలు అందించారు. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగానూ పనిచేశారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: మాజీ గవర్నర్ రఘునంద లాల్ భాటియా కన్నుమూత
ఎవరు: రఘునంద లాల్ భాటియా
ఎప్పుడు: మే 15
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |