Daily Current Affairs in Telugu 12-08-2020
క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ సంస్థ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయిన హర్ష్ కుమార్ భన్వాలా :
క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మాజీ నాబార్డ్ చీఫ్ హర్ష్ కుమార్ భన్వాలా గారు నియమితులయ్యారు. హర్ష్ కుమార్ భన్వాలా ఆరు సంవత్సరాలుగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) చైర్మన్‌గా కూడా పనిచేశారు. అతను డిసెంబర్ 2013 లో నాబార్డ్ చైర్మన్ గా నియమించబడ్డాడు మరియు 2020 మే 26 న పదవి విరమణ చేసారు. కాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ (సిఐఎఫ్ఎల్) అనేది ఒక సమగ్ర ఆర్థిక సేవల వేదిక మరియు భారతీయ కార్పొరేట్‌లకు వారి వృద్ధి మరియు పని మూలధన అవసరాలకు అనుకూలీకరించిన ఆర్థిక పరిష్కారాలను గురించి ఇది తెలియజేస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయిన హర్ష్ కుమార్ భన్వాలా
ఎవరు: హర్ష్ కుమార్ భన్వాలా
ఎప్పుడు: ఆగష్ట్ 12
ముఖ్య మంత్రి కిసాన్ సహయ్ యోజనను ప్రకటించింన గుజరాత్ ప్రభుత్వం :
ముఖ్య మంత్రి కిసాన్ సహాయ్ యోజనను గుజరాత్ ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపానీ గారు ప్రకటించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ముఖ్య మంత్రి కిసాన్ సహాయ్ యోజన అనే కార్యక్రమం ప్రకటించబడింది మరియు రాష్ట్రంలోని రైతులందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు. ఈ పథకం కోసం రైతులు ఎటువంటి ప్రీమియం లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పంటల బీమా పథకాన్ని ముఖ్య మంత్రి కిసాన్ సహాయ్ యోజన భర్తీ చేయనుంది. అందువల్ల, ఇప్పటికే ఉన్న పథకానికి ప్రీమియం చెల్లించిన రైతులకు వాపసు లభిస్తుంది. మునుపటి ప్రణాళికతో పోలిస్తే గిరిజన రైతులు కూడా ఈ పథకంలో భాగంగా ఉంటారు
క్విక్ రివ్యు:
ఏమిటి: ముఖ్య మంత్రి కిసాన్ సహయ్ యోజనను ప్రకటించింన గుజరాత్ ప్రభుత్వం
ఎవరు: గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు: ఆగష్ట్ 12
నిస్సా డైరెక్టర్ గా నియమితులయిన సివి ఆనంద్ :
తెలంగాణా రాష్ట్ర కేడర్ కు చెందిన ప్రస్తుతం కేంద్ర డిప్యుటేషన్ లో ఉన్న 1991 ఐపిఎస్ అధికారి అయిన సివి ఆనంద్ గారు హైదరాబాద్ లోని హకీమ్ పేట లో ఉన్న నేషనల్ ఇండస్త్రియాల్ సెక్యురిటి అకాడమి( నిస్సా ) డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సెంట్రల్ ఇండస్త్రియాల్ సెక్యురిటి ఫోర్స్బ (సిఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్ ఆగస్ట్ 10న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసారు. గత కొద్ది కాలంగా సిఐఎస్ఎఫ్ లో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఆనంద్ ఆ విభాగానికి అంతర్బగంగా ఉన్న ఎయిర్ పోర్ట్ సెక్టార్ సౌత్ వెస్ట్ విభాగానికి ఐజి గా విధులు నిర్వర్తిస్తున్నారు .ప్రస్తుత ఉత్తర్వుల ద్వారా సిఐఎస్ఎఫ్ ఎయిర్ ఫోర్ట్ సెక్టార్ ఐజి బాద్యతలను కూడా అయన అదనంగా నిర్వర్తించనున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: నిస్సా డైరెక్టర్ గా నియమితులయిన సివి ఆనంద్
ఎవరు: సివి ఆనంద్
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: ఆగష్ట్ 12
దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచిన ఉత్తరప్రదేశ్ సిఎం యోగినాథ్ ఆదిత్యా నాథ్ :
దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ సిఎం యోగినాత్ ఆదిత్యనాథ్ గారు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తరువాత దేశ రాజదాని అయిన డిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గారు రెండో స్థానంలోను ,ఆంధ్రప్రదేశ్ సిఎం అయిన వైఎస్ జగన్ గారు మూడో స్థానంలో నిలిచారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే లో ఈ విషయాలను వెల్లడించింది. 2020 జులై లో చేసిన ఈ సర్వేలో ఈ విషయాలను వెల్లడించింది. ఈ సర్వే లో యోగినాత్ అధిత్యానాథ్ గారికి 24 శాతం ,కేజ్రివాల్ కు 15 శాతం ,వైఎస్ జగన్ 11 శాతం ఓట్లు లబించాయి. 4,5 స్థానాలలో పశ్చిమ బెంగాల్ సిఎం .బిహార్ సిఎం లు మమత బెనర్జీ ,నితీష్ కుమార్ ఉండగా తెలంగాణా సిఎం కే.చంద్ర శేఖర్ రావు గారు తొమ్మిదో స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచిన ఉత్తరప్రదేశ్ సిఎం యోగినాథ్ ఆదిత్యా నాథ్
ఎవరు: సిఎం యోగినాథ్ ఆదిత్యా నాథ్
ఎక్కడ: ఉత్తరప్రదేశ్
ఎప్పుడు: ఆగష్ట్ 12
అమెరికాలో ఉపాద్యక్ష పదవికి ఎంపిక అయిన డెమోక్రటిక్ అబ్యర్థి, ప్రవాస భారతీయురాలు కమల హ్యారిస్ :
అమెరికాలో భారత సంతతికి చెందిన కమల దేవి హ్యారిస్ అనే మహిళ కు అరుదైన గౌరవం దక్కింది. ఉపాద్యక్ష పదవికి డెమోక్రటిక్ అబ్యర్థిగా కాలిపోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపిక అయ్యారు. నవంబర్ లో జరగనున్న అమెరికా అద్యక్ష ఎన్నికల్లో మహిళలు ,నల్లజాతియులు ప్రవాస భారతీయులు ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగంగానే కమలా దేవి హ్యారిస్ ఎంపిక జరిగింది. అద్యక్ష అబ్యర్థిగా బరిలో ఉన్న జో బైడేన్ ఆగస్ట్ 12 న కమల హ్యారిస్ ను ఎన్నికలో ఉపాద్యక్ష అబ్యర్థిగా ప్రకటిస్తూ డెమోక్రటిక్ సహచరులందరికీ మెసేజ్ లు పంపించారు. ఒక నల్లజాతియురాలీని ఉపాద్యక్ష పదవికి అబ్యర్థిగా తొలి సారి ఎంపిక చేసి బైడేన్ చరిత్ర సృష్టించారు.55 ఏళ్ల కమల హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాద్యక్ష పదవికి ఎన్నికయిన మొట్టమొదటి మహిళా ,తోలి నల్లజాతియురలిగా తొలి ప్రవాస భారతీయురాలిగా మొదటి ఆసియా అమెరికన్గా రికార్డులకెక్కుతారు.భారతీయ జమైక మూలలున్న కమల హ్యారిస్ ప్రస్తుతం బైడేన్ ఎన్నికల వ్యుహకర్తగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమెరికాలో ఉపాద్యక్ష పదవికి ఎంపిక అయిన డెమోక్రటిక్ అబ్యర్థిగా ప్రవాస భారతీయురాలు కమల హ్యారిస్
ఎవరు: కమల హ్యారిస్
ఎక్కడ: అమెరికాలో
ఎప్పుడు: ఆగష్ట్ 12
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |