Daily Current Affairs in Telugu 11-09-2020
అమెరికా అంతరిక్ష నౌకకు భారత వ్యోమగామి కల్పన చావ్లా పేరు :
అమెరికాలో ఒక వాణిజ్య కంపెని ప్రయిగించే అంతరిక్ష నౌకకు భారతీయ అమెరికన్ వ్యోమగామి అయిన కల్పనా చావ్లా గారి పేరును పెట్టారు.నార్తోఫ్ గ్రుమన్ అనే ఒక అమెరికన్ గ్లోబల్ ఏరో స్పేస్ డిఫెన్స్ టెక్నాలజీ అనే కంపెని తన తదుపరి సిగ్నస్ క్యాప్యుల్స్ కు ఎస్.ఎస్. కల్పనా చావ్లా పేరు పెడుతున్నట్లు ప్రకటించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమెరికా అంతరిక్ష నౌకకు వ్యోమగామికి కల్పన చావ్లా పేరు
ఎవరు: అమెరికాలో ఒక వాణిజ్య కంపెని
ఎక్కడ: అమెరికాలో
ఎప్పుడు: సెప్టెంబర్ 11
ప్రముఖ సంఘ సేవకుడు స్వామి అగ్నివేష్ కన్నుమూత :
సంఘ సేవకుడు స్వామి అగ్నివేష్ (80) సెప్టెంబర్ 11 న కన్నుమూసారు. గత కొంత కాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో డిల్లిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు .తీవ్ర అస్వస్థత కు గురైన ఆయన సెప్టెంబర్ 11 వెంటి లెటర్ పై ఉన్నారని డిల్లిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరి సైన్సెస్ తెలిపింది. అగ్ని వేశ్ మన తెలుగు వ్యక్తే. అయన అసలు పేరు వేప శ్యాం రావు.ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో ఒక కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21 జన్మించారు. అయన కోల్ కతా లో సెయింట్ గ్జేవియర్ కాలేజి నుంచి డిగ్రీ పూర్తి చేశారు.సామజిక కార్యకర్తగా ఆధ్యాత్మిక వేత్తగా పేరు పొందారు.బాలల వెట్టి చాకిరి నిర్మూలన కోసం బంధ విముక్తి మోర్చా పేరుతొ సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు.ఆర్య సమాజ్ సిద్దాంతాలను ఆకర్షితులైన అగ్నివేష్ 1970 లో ఆర్య సభ రాజకీయ పార్టీని స్థాపించారు.1977 లో హరియానా అసెంబ్లీ కి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ సంఘ సేవకుడు స్వామి అగ్నివేష్ కన్నుమూత
ఎవరు: స్వామి అగ్నివేష్
ఎక్కడ:కోల్ కతా
ఎప్పుడు: సెప్టెంబర్ 11
స్వచ్చ భారత్ మిషన్ లో పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు :
స్వచ్చ భారత్ మిషన్ (గ్రామిన) కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో పురోగతి కనబరిచిన పది జిల్లాల యొక్క కలెక్టర్ లతో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 11న వీడియో కాలింగ్ ద్వారా సమావేశం నిర్వహించింది.ఇందులో రాష్ట్రము నుంచి పెద్దపల్లి జిల్లాకు అవకాశం దక్కింది.2018-19 లో స్వచ్చ భారత్ లో ప్రగతి ఎక్కువ మంది ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలలో పురోగతి పై కేంద్ర అధికారులు సమీక్షించారు.ఈ సందర్బంగా ఆయ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్లు వెల్లడించారు.పెద్దపల్లి జిల్లలో చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా ఇంచార్జి కలెక్టర్ భారతి హోలికేలి పవర్ పాయంట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.వీడియో సమీక్షలో తెలంగాణా నుంచి పెద్దపల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉభయగోదావరి జిల్లాలు, గుజరాత్ నుంచి దోహద,మహిసేన ,మహిసాగర్ ,హరియానా నుంచి రెవారి ,మహారాష్ట్ర నుంచి నాసిక్ మిజోరాం నుంచి సిరోచిప్ ,పంజాబ్ నుంచి ఎస్ఎ ఎస్ నగర్ జిల్లాల కలెక్టర్ లు పాల్గొన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: స్వచ్చ భారత్ మిషన్ లో పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు
ఎవరు: పెద్దపల్లి జిల్లాకు
ఎప్పుడు: సెప్టెంబర్ 11
ఏబీసి చైర్మన్ గా ఎన్నిక అయిన దేవేంద్ర దార్దా ;
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఎబిసి) చైర్మన్ గా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి లోక్ మత్ మీడియా గ్రోప్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన దేవేంద్ర వి.దర్దా గారుఎన్నిక అయ్యారు.మీడియా రంగానికి ప్రతినిత్యం వహిస్తున్న సంస్థలైన ఐఎన్ ఎస్ ఐఎఫ్ ఆఫ్ ఏ లో గతంలో వివిధ హోదాల్లో దేవేంద్ర దర్దా గారు పనిచేసారు.ఎబిసి కార్యదర్శిగా మలయాళ మనోరమ కంపెనీకి చెందిన రియాద్ మ్యత్యు ఎన్నికయ్యారు.అడ్వర్టైజ్ ప్రతినిదులలో ఒకరైన ఐటిసి లిమిటెడ్ కు చెందిన కరునేష్ బజాజ్ ఎబిసి డిప్యుటీ చైర్మన్గా ఎన్నుకున్నారు.అడ్వర్టైజ్ ఎజన్సిస్ ప్రతినిధి విక్రం శుక్లా కోశాధికారిగా వ్యవహరిస్తారు.సెక్రటరీ జనరల్ భాద్యత లను హోర్ముజ్ద్ మాసాని నిర్వహిస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఏబీసి చైర్మన్ గా ఎన్నిక అయిన దేవేంద్ర దార్దా
ఎవరు: దేవేంద్ర దార్దా
ఎప్పుడు: సెప్టెంబర్ 11
హుబ్బల్లి రైల్వే స్టేషన్ పేరును శ్రీ సిద్ధరూధ స్వామీజీ పేరు మార్పుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం :
కర్ణాటకలోని హుబ్బల్లి రైల్వే స్టేషన్‌ను ఇప్పుడు శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్’ అని పిలుస్తారు. హుబ్బల్లి రైల్వే స్టేషన్ పేరు మార్చాలని హుబ్బాలియన్ల యొక్క దీర్ఘకాల డిమాండ్ ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రధాన కార్యాలయంగా ఉన్న హుబ్బల్లి రైల్వే స్టేషన్ పేరును గత ఐదేళ్లలో రెండవసారి మార్చబడుతోంది. దీనిని 2015 లో ‘హుబ్లి’ నుండి ‘హుబ్బల్లి’ గా మార్చారు.ప్రస్తుతం దీనిని సిద్ధరూధ స్వామీజీ పేరు గా మార్చనున్నారు. సిద్ధరూధ స్వామీజీ భారతీయ హిందూ గురువుగా మరియు ప్రముఖ తత్వవేత్త గా అయన గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: హుబ్బల్లి రైల్వే స్టేషన్ పేరును శ్రీ సిద్ధరూధ స్వామీజీ పేరు మార్పు కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ఎవరు: కు కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: హుబ్బల్లి రైల్వే స్టేషన్
ఎప్పుడు: సెప్టెంబర్ 11
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |