Daily Current Affairs in Telugu 09-09-2020

current affairs in telugu 2019 pdf download,

Daily Current Affairs in Telugu 09-09-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

భారత్  ఫ్రాన్స్ ,ఆస్ట్రేలియా ప్రతినిధుల వ్యూహాత్మక చర్చలకు  బేటీ :

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యవహరిస్తున్న సైనిక కార్యకలాపాల కారణంగా తదుపరి అనుసరించాల్సిన వ్యూహాత్మక చర్యలపై చర్చించేందుకు భారత్, ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దేశాల ప్రతినిధులు సెప్టెంబర్ 09న భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్, ఫ్రాన్స్ విదేశాంగ ప్రతినిధి ఫ్రాంకోయిస్, ఆస్ట్రేలియా విదేశాంగ కార్యదర్శి ప్రిన్సెస్ ఆడమ్స్ పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారంతోనే ఇందులో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ‘బలమైన ‘ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని శాంతియుత, సురక్షితమైన, సంపన్నమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వాటి మధ్య సమన్వయం అనే తదితర అంశాలపై చర్చించారు. భారత్ పై చైనా కయ్యానికి కాలుదువ్వు తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరిం చుకుంది. వార్షిక ప్రాతిపదికన భేటీ కావాలని ఈ సంర్భంగా మూడు దేశాలు నిర్ణయించాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి :భారత్  ఫ్రాన్స్ ,ఆస్ట్రేలియా ప్రతినిధుల వ్యూహాత్మక చర్చలకు  బేటీ

ఎవరు: భారత్  ఫ్రాన్స్ ,ఆస్ట్రేలియా

ఎప్పుడు: సెప్టెంబర్ 09

100అంతర్జాతీయ గోల్స్ చేసిన రెండో ప్లేయర్ గా రోనాల్డో గుర్తింపు:

దిగ్గజ ఫుట్బాల్ క్రిస్టియానో రానాల్లో అంతర్జాతీయ స్థాయిలో (దేశం తరఫున ఆడే మ్యాచ్) 100 గోల్డ్ పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి యూరప్ ప్లేయర్ గా ఓవరాల్ గా రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందారు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసి యేషన్స్ (యూఎస్ఏ) నేషన్స్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా గ్రూప్ ‘9’ లీగ్ మ్యాచ్ లో పోర్చుగల్ లో 2-0 గోల్ఫ్ తేడాతో స్వీట్ ఓడించింది. 35 ఏళ్ల రొనాల్డో ఆట 45వ నిమిషంలో గోల్ చేయడంతో తన అంతర్జాతీయ కెరీర్లో 100వ గోల్ మైలు రాయి చేరుకున్నాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో రొనాల్డో రెండో గోల్ కూడా చేసి తమ జట్టు విజయాన్ని ఖాయం చేసాడు.ఈ గోల్స్ తో రోనాల్డో అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 101కు చేరింది. అంత జాతీయస్థాయిలో, అత్యధిక గోల్స్ చేసిన రికార్డు అలీ దాయి (ఇరాన్) పేరిట ఉంది. 2006 లో రిటైర్ అయిన 51ఏళ్ల అలీ దాయి ఇరాన్ తరపున మొత్తం 109 గోల్స్ సాధించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : 100అంతర్జాతీయ గోల్స్ చేసిన రెండో ప్లేయర్ గా రోనాల్డో గుర్తింపు

ఎవరు: క్రిస్టియానో రానాల్లో

ఎక్కడ:సోల్నా( స్వీడన్ )

ఎప్పుడు:సెప్టెంబర్ 09

నోబెల్ శాంతి బహుమతి కి ట్రంప్ పేరును ప్రతిపాదించిన నార్వే చట్టసభ సభ్యుడు ;

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును 2021 నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించినట్లు నార్వే చట్టసభ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడి సెప్టెంబర్ 09న ప్రకటించారు. ఇజ్రాయెల్-యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేలా ట్రంప్ విశేష కృషి చేశారు దీనివల్ల మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొనే అవ కాశం ఏర్పడింది. స్వదేశంలో ట్రంప్ ఏ విధంగా వ్యవహరించినప్పటికీ, విలేకరుల సమావేశంలో ఎలా మాట్లాడినప్పటికీ, తప్పకుండా ఆయన నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది” అని జెడ్డే పేర్కొన్నారు. నార్వేకు చెందిన మరో చట్టసభ సభ్యు డితో కలిసి జడ్జి 2018లో ట్రంప్ నోబెల్ పుర స్కారానికి ప్రతిపాదించారు. ఆ సమయంలో ట్రంప్ ఉభయ కొరియాల మధ్య సయోధ్యకు ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు

క్విక్ రివ్యు :

ఏమిటి : నోబెల్ శాంతి బహుమతి కి ట్రంప్ పేరును ప్రతిపాదించిన నార్వే చట్టసభ సభ్యుడు

ఎవరు: ట్రంప్

ఎక్కడ:అమెరికా

ఎప్పుడు: సెప్టెంబర్ 09

భారత్ లో తగ్గినశిశుమరణాల రేటు అని ప్రకటించిన ఐరాస :

భారత్ లో శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టింది అని ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 1990 నుంచి 2019 మధ్య శిశు మరణాలు గణనీయంగా తగ్గినట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) తెలి పింది. అయితే ఇప్పటికీ ఈ విషయంలో భారత్ పరి స్థితి ఇంకా మెరుగవ్వాల్సి ఉందని పేర్కొంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో.. నైజీరియాతో పాటు, మన దేశంలో సుమారు మూడింట ఒక వంతు నమోదయ్యాయని వెల్లడించింది. కానీ కరోనా మహమ్మారి వల్ల శిశు మర ణాల తగ్గింపు విషయంలో భారత్ ఇన్నేళ్లుగా చేసిన కృషి నిర్వీర్యమయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. శిశు మరణాల్లో దశలు, సరళులు-2020′ పేరిట విడు దల చేసిన నివేదికలో ఐరాస ఈ వివరాలు వెల్లడిం చింది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం -భారత్ లో 1990 నాటికి ఐదేళ్లలోపు శిశువుల మర ణాల రేటు 128 (ప్రతి వెయ్యి జననాలకు) కాగా, అది 2019 నాటికి 34కు తగ్గింది. ఈ ‘కాలావధి ఐదే ళ్లలోపు శిశు మరణాల రేటు ఏటా 4.5 శాతం మేరకు తగ్గుతూ వచ్చింది. 1990లో మన దేశానికి చెందిన ఐదేళ్లలోపు పిల్లలు 34 లక్షల మంది మర గుణించగా, 2019లో ఆ సంఖ్య 824 లక్షలకు తగ్గింది. ఆడ శిశువుల మరణాల రేటు 1990-2019 మధ్య భారత్ 131 నుంచి 35కు పడిపోయింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్ లో తగ్గినశిశుమరణాల రేటు అని ప్రకటించిన ఐరాస :

ఎవరు: ఐక్యరాజ్య సమితి

ఎక్కడ:న్యూయార్క్

ఎప్పుడు: సెప్టెంబర్ 09

ప్రపంచంలోనే తొలిసారి జరిగిన  తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు :

ప్రపంచ తొలి సోలార్ సదస్సు టెక్నాలజీ సదస్సు  సెప్టెంబర్  08వ తేదిన  వర్చువల్ గా జరిగింది.అంతర్జాతీయ  సోలార్ కూటమి   (ఐఎస్ ఎ)  నిర్వహించిన  ఈ సదస్సులో  దాదాపు  149 దేశాల యొక్క ప్రతినిధులు  పాల్గొన్నారు.చవకైన సుస్థిరమైన  శుద్దమైన ఇందనాలను వాటి ఉత్పధాకతను  వేగవంతం చేయడానికి  సోలార్ విద్యుత్  లో తదుపరి తరం టెక్నాలజీని  ఆవిష్కరించడం పైన  ఈ సదస్సు  జరిగింది. ఐఎస్ఎ అసెంబ్లీ  ప్రెసిడెంట్ గా ఉన్న  కేంద్ర్ర పునరుత్పాదక  ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్దేనికి అద్యక్షత గా వ్యవహరించారు.ఆయనతో పాటు  ప్రెసిడెంట్ గా ఉన్న ఫ్రాన్స్ మంత్రి  బార్బరా పోమ్పిలి ఆఫ్రికా  ,ఆసియా,  ఆసియా  ఫసిఫిక్ లేటిన్  అమెరికా కరేబియన్  ప్రాంతాల తరపున ఐఎస్ఏ  ఉపాధ్యక్షులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ సదస్సులో  భారత్ ప్రదాని యొక్క సందేశాన్ని  పునరుత్పాదక  ఇందన  శాఖా మంత్రి ఆర్కే సింగ్ గారు చదివి వినిపించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచంలోనే తొలిసారి జరిగిన  తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు

ఎవరు: అంతర్జాతీయ  సోలార్ కూటమి  

ఎప్పుడు: సెప్టెంబర్ 09

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *