Daily Current Affairs in Telugu 11-06-2020
దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ కి వరించిన ప్రతిష్టాత్మక ప్రిన్స్ ఆల్బర్ట్ -2 అవార్డు:
హైదరబాద్ కేంద్రంగా ఉన్న దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ని అంతర్జాతీయ పర్యావరణ పురస్కారాలలో ప్రతిస్తాత్మకమైన ప్రిన్స్ ఆల్బర్ట్ -2 అవార్డు వరించింది.2020సంవత్సరానికి జీవ వైవిధ్య అవార్డు కింద మొనాకో ఫౌండేషన్ ఈ సొసైటీ ని ఎంపిక చేసింది.ఈ అవార్డ్ కింద సొసైటీ కి రూ.35లక్షల నగదు బహుమతి లబించనుంది. జూన్ 11నిర్వహించిన గ్లోబల్ టెలికాన్ఫరెన్స్ (కోవిద్-19) నేపద్యంలో ప్రత్యక్ష వేడుకకు బదులుగా లో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ,సియివో ఒలివియర్ వెందేన్ అవార్డును ప్రకటించారు.దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ లోని మహిళలు జీవ వైవిద్యం ను కాపాడటం నీతి వనరుల సద్వినియోగం ,అడవుల పెంపకం లో చేసిన కృషికి గాను ఈ సొసైటీ కి ఈ అవార్డు లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ కి వరించిన ప్రతిష్టాత్మక ప్రిన్స్ ఆల్బర్ట్ -2 అవార్డు
ఎవరు: దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ
ఎప్పుడు: జూన్ 11
పశ్చిమ బెంగాల్ కు రూ.1950 కొట్ల రుణాలు ఇవ్వనున్న ప్రపంచ బ్యాంక్ :
ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిద్ -19) వల్ల ఏర్పడిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సరిదిద్దడానికి మరియు రాష్ట్రంలో ని అబివృద్ధి పనులను పరిష్కరించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.20000 కోట్లరుణం లబించింది. మొత్తం 1950 కోట్ల రూపాయలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివిధ సాంఘిక సంక్షేమ పథకాలపై 850 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉండగా మిగిలిన 1100 కోట్లు రూపాయలు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తం ను ఖర్చు చేయబడతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: పశ్చిమ బెంగాల్ కు రూ.1950 కొట్ల రుణాలు ఇవ్వనున్న ప్రపంచ బ్యాంక్ :
ఎవరు: ప్రపంచ బ్యాంక్
ఎప్పుడు: జూన్ 11
ఎస్.బి.ఐ విశాఖ డిజిఎం గా నియమితులయిన రంగరాజన్ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ పట్నం మాడ్యుల్ డిజిఎం గా కే.రంగరాజన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు పశ్చిమ బంగాల్ రాష్ట్రంలోని హౌరా ,బురుద్వేని మాడ్యుల్ లో డిజిఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బదిలీ పై అమరావతి సర్కిల్ లోని ప్రదానమైన విశాఖ డిజిఎం గా బాద్యతలు స్వీకరించారు .శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు 248 శాఖలు ,5రుణ ప్రాసెసింగ్ కేంద్రాలు ,1 కరెన్సీ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఈయన పరిధిలో ఉంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎస్ బిఐ విశాఖ డిజిఎం గా నియమితులయిన రంగరాజన్ :
ఎవరు: రంగరాజన్
ఎప్పుడు: జూన్ 11
బురుండి దేశ ప్రస్తుత అద్యక్షుడిగా పియరి స్కురుంజిజా కన్నుమూత :
బురుండి రిపబ్లిక్ అద్యక్షుడు అయిన పియరీ స్కురుంజిజా ఇటివల కన్నుమూసారు.15సంవత్సరాలు అధికారం లో ఉన్న తరువాత స్కురుంజిజా ఆగస్టులో పదవి విరమణ చేయవలసి ఉంది. 2015 లో మూడో సారి పోటీ చేస్తానని ప్రకటించడం దేశాన్ని గందరగోళం లో పడేసింది. 2006 మరియు 2011 మద్య అధ్యక్షుడుఅయిన ఈయన తన భోదన మరియు పుట్ బాల్ క్రీడ ప్రేమకు ఆయన ప్రసిద్ది చెందారు. శాంతిని నిర్మించే ప్రయత్నాలకు ఏడు అంతర్జాతియ అవార్డులను కూడా ఈయన అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బురుండి దేశ ప్రస్తుత అద్యక్షుడిగా పియరి స్కురుంజిజా కన్నుమూత
ఎవరు: పియరి స్కురుంజిజా
ఎక్కడ: బురుండి
ఎప్పుడు: జూన్ 11
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |