Daily Current Affairs in Telugu 11-05-2021
బీపీసీఎల్ సంస్థ నూతన చైర్మన్,ఎం.డి గా అరుణ్ కుమార్ సింగ్ ఎంపిక :
ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా అరుణ్ కుమార్ సింగ్ గారు ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం బీపీసీఎల్ డైరెక్టరుగా (మార్కెటింగ్ విభాగం) వ్యవహరిస్తున్నారు. మే11న ఆరుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ సింగ్ పేరు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఆగస్టులో డి రాజ్ కుమార్ రిటైర్ అయినప్పట్నుంచీ ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం మానవ వనరుల విభాగం డైరెక్టర్ కె పద్మాకర్.. సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బీపీసీఎల్ సంస్థ నూతన చైర్మన్,ఎం.డి గా అరుణ్ కుమార్ సింగ్ ఎంపిక
ఎవరు : అరుణ్ కుమార్ సింగ్
ఎప్పుడు: మే 11
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి :
మాజీ క్రికెటర్ మనోజ్ తివారికి కొత్తగా ఏర్పడిన బెంగాల్ కేబినెట్లో చోటు దక్కింది. మే 10వ తేదీన జరిగిన కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అత ని యొక్క కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. తివారి శివ్పూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడిన తివారి 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో మనోజ్ తివారి కూడా సభ్యుడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి
ఎవరు : మాజీ క్రికెటర్ మనోజ్ తివారి
ఎక్కడ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర౦
ఎప్పుడు: మే 11
‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్-2021′ అవార్డు దక్కించుకున్న భారత సంతతి శాస్త్రవేత్త :
భారత సంతతికి చెందిన ప్రపంచ పోషకాహార నిపుణురాలు, శాస్త్ర వేత్త శకుంతల హరక్ సింగ్ థిలైడ్ కు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్-2021’ వరించింది. జల జీవుల పెంపకం, ఆహార వ్యవస్థల్లో సంపూర్ణ పోషణ విధానాలను అభివృద్ధి చేసినందుకుగాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండే షన్ మే 11 న ఈ అవార్డును ప్రకటించింది. ఆహార, వ్యవసాయ రంగాల్లో దీన్ని నోబెల్ ప్రైజ్ గా పరిగణిస్తుంటారు. ఈ అవార్డు కింద విజేతకు సుమారు రూ.1.83 కోట్లు (2.5 లక్షల డాలర్లు) అందజేస్తారు. “బంగ్లాదేశ్లోని స్థానిక జాతుల చేపలపై శకుంతల చేసిన పరిశోధన ఆసియా, ఆఫ్రికా లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది పోషకాహార లోపాలను అధిగమించేందుకు దోహదపడింది” అని అవార్డు ప్రకటన సందర్భంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అధ్యక్షుడు బార్బరా స్టిన్సన్ పేర్కొన్నారు. “ఒక శాస్త్రవేత్తగా ఈ అరుదైన గౌరవం దక్కడం నాకెంతో ఆనందంగా ఉంది. లక్షల మంది బలహీన మహిళలు, చిన్నారులు, పురుషులు పోషకాహార లోపాలను జలాహార వ్యవస్థల ద్వారా సరిదిద్దే అవకాశముంది. అంతగా గుర్తింపునకు నోచుకోని ఈ రంగంలో నా పాత్రకు ప్రాధాన్యం దక్కిందని భావిస్తున్నాను” అని 71 ఏళ్ల శకుంతల చెప్పారు. కాగా ఆమె ‘న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, వరల్డ్ ఫిష్ ‘కు నాయకత్వం వహిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్-2021’ అవార్డు దక్కించుకున్న భారత సంతతి శాస్త్రవేత్త
ఎవరు : హరక్ సింగ్ థిలైడ్
ఎప్పుడు: మే 11
న్యూయార్క్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అనుపం ఖేర్ :
న్యూయార్క్ నగర అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలివుడు నటుడు అనుపమ్ ఖేర్ కు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆయన హ్యాపీ బర్త్ డే అనే లఘు చిత్రంలో నటించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి ప్రసాద్ కదమ్ దర్శకత్వం వహించారు మరియు ఎఫ్ఎన్పి మీడియా నిర్మించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: న్యూయార్క్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అనుపం ఖేర్
ఎవరు : అనుపం ఖేర్
ఎక్కడ:న్యూయార్క్
ఎప్పుడు: మే 10
జాతీయ సాంకేతికత దినోత్సవం గా మే 11 :
టెక్నాలజీ మరియు సైన్స్ రంగంలో ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం మే 11 న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొట్టమొదట మే 11, 1999 న పరిశీలించబడింది మరియు భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల శాస్త్రీయ మరియు సాంకేతిక విజయాలను జ్ఞాపకం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ సాంకేతిక దినోత్సవం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే 1998 లో ఈ ప్రత్యేక రోజున, భారతదేశం అనేక ముఖ్యమైన సాంకేతిక పురోగతులను సాధించింది. 1999 నుండి ప్రతి సంవత్సరం, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి) జాతీయ వృద్ధికి తోడ్పడిన సాంకేతిక ఆవిష్కరణలను గౌరవించడం ద్వారాఈ రోజును స్మరిస్తుంది నేషనల్ టెక్నాలజీ డే 2021 యొక్క థీమ్ “సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్
క్విక్ రివ్యు ;
ఏమిటి: జాతీయ సాంకేతికత దినోత్సవం గా మే 11
ఎప్పుడు: మే 11
కేరళ రాష్ట్ర కమ్యునిస్ట్ నేత ,రాష్ట్ర తొలి మహిళా మంత్రి కే.ఆర్ గౌరీ కన్నుమూత :
కేరళలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరు లూ దిన తొలితరం నేతల్లో ఒకరైన కేఆర్ గౌరి (102) ఇక లేరు. కేరళ ప్రజలు గౌరీ అమ్మ అని ప్రేమగా పిలుచుకునే ఆమె వయో సంబంధ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మే 11న ఉదయం తుది శ్వాస విడిచారు. రాష్ట్ర తొలి కేబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా, రాజకీయాల్లో శక్తిమంత మైన మహిళగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భూస్వామ్య వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేసి, స్త్రీల హక్కుల కోసం బలమైన గళం వినిపించి ఆమె కేరళ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. కేరళ తొలి సీఎం నంబూద్రిపాద్ నేతృత్వంలోని కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1919 జులై 14న గౌరి జన్మించారు. 1948లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అదే ఏడాది జైలుకు వెళ్లారు. 1952లో ట్రావెన్కోర్-కోచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1957లో చెర్తలయిన్ అశప్పుజ నియోజకవర్గం నుంచి కేరళ అసెం ఢిల్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. 2006 వరకూ ఎమ్మెల్యేగా కొనసాగారు. పలు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు
క్విక్ రివ్యు :
ఏమిటి: కేరళ రాష్ట్ర కమ్యునిస్ట్ నేత ,రాష్ట్ర తొలి మహిళా మంత్రి కే.ఆర్ గౌరీ కన్నుమూత
ఎవరు : కే.ఆర్ గౌరీ
ఎక్కడ:కేరళ
ఎప్పుడు: మే 11
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |