Daily Current Affairs in Telugu 10-06-2020
జమ్మూ హైకోర్ట్ న్యాయ మూర్తి గా జావేద్ ఇక్బాల్ వాని నియకమకం:
భారత రాష్ట్రపతి ఆయన రాం నాథ్ కోవిద్ సీనియర్ కాశ్మీర్ న్యాయ వాది అయిన జావేద్ ఇక్బాల్ వానిని జమ్మూ కాశ్మీర్ హైకోర్ట్ న్యాయమూర్తి గా నియమించారు .ఆయన నియామకాన్ని జనవరి 22న భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బొబ్డే నేతృత్వం లోని సుప్రీం కోర్టు కొలిజియం సిపార్సు చేసింది. 2013 తర్వాత కాశ్మీర్ బార్ కోటా నుండి హైకోర్ట్ న్యాయ మూర్తి గా నియమించడం ఇదే తొలిసారి .
క్విక్ రివ్యు :
ఏమిటి: జమ్మూ హైకోర్ట్ న్యాయ మూర్తి గా జావేద్ ఇక్బాల్ వాని నియకమకం
ఎవరు: జావేద్ ఇక్బాల్
ఎక్కడ: జమ్మూ
ఎప్పుడు: జూన్ 10
ఫ్లైజి అనే మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసిన ఐఐటి గౌహతి విద్యార్థులు :
కోవిద్ -19 మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయం లో స్థిరమైన మరియు సంపర్క రహిత విమాన ప్రయాణం కోసం గుహవతి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ” ఫ్లైజీ” అనే ఒక అప్లికేషన్ ను అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం నిభందనల ప్రకారం దానికి ఉపయోగ అనుసారంగా ఈ అనువర్తనం సృష్టించబడింది. ఇది కాంటాక్ట్ లెస్ లోడింగ్ ను ఇస్తుంది. సరళమైన స్టఫ్ డ్రాప్ ను ,సహేతుకమైన ఆపే సమయాన్నితెలపడం ,మొత్తం విహార యాత్ర లో ముఖ్యమైన అంశాల గురించి ,వార్తలను తెలియజేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫ్లైజి అనే మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసిన ఐఐటి గౌహతి విద్యార్థులు
ఎవరు: చేసిన ఐఐటి గౌహతి విద్యార్థులు
ఎప్పుడు: జూన్ 10
భారత ఆర్ధిక వ్యవస్థను ఎఫ్వై 21 లో 5% తగ్గింపు గా అంచనా వేసిన ఎస్ అండ్ పి రేటింగ్స్ :
ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ ఫైనాన్షియల్ కండిషన్స్ రిఫ్లెక్ట్ ఆప్టిమిజం లాక్ డౌన్ ఫెటిగ్ ఏమర్జేస్ పేరుతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల పై తన నివేదికను విడుదల చేసింది. మరియు 2020-21 ఆర్ధిక వ్యవస్థ 5% కు తగ్గిపోనుందని అంచనా వేసింది. ఇది 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారత దేశం యొక్క వృద్ది రేటు 8.5% కి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఇది 2022-23ఆర్థిక సంవత్సరం లో భారత దేశం యొక్క వృద్ది 6.5 %గా ఉంటుందని అంచనా వేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఆర్ధిక వ్యవస్థను ఎఫ్వై 21 లో 5% తగ్గింపు గా అంచనా వేసిన ఎస్ అండ్ పి రేటింగ్స్
ఎవరు: ఎస్ అండ్ పి రేటింగ్స్
ఎప్పుడు: జూన్ 10
ఆన్ లైన్ వ్యర్థ మార్పిడి వెబ్ సైట్ ఎపిఇఎంసి ని ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :
ఆంద్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్ (ఎపి ఇఎంసి) యొక్క వ్యర్థ మార్పిడి వెబ్ సైట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంబించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఈ వెబ్ సైట్ ను ప్రారంబించారు. వ్యర్థ మార్పిడి వెబ్ సైట్ ను ప్రారంబించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఈ వేదిక ద్వారా విషపూరిత వ్యర్థాలను 100% సురక్షితం కొరకు పారవేయడం సరైన ట్రాకింగ్ ,పరిశీలన తో పాటు వ్యర్థాల ఆడిట్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రయత్నం .
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆన్ లైన్ వ్యర్థ మార్పిడి వెబ్ సైట్ ఎపిఇఎంసి ని ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జూన్ 10
ఆసియాలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి గా నిలిచిన ముంబై :
ఆసియాలో ని 20 అత్యధిక ఖరీదైన నగరాల్లో ముంబై ఒకటి గా నిలిచింది అని గ్లోబల్ కన్సటింగ్ సంస్థ మెర్సర్ తన తాజా అద్యయన నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై నగరం 60వ స్థానం లో ఉండగా ఆసియా లో 19 వ స్థానం లో ఉందని నివేదికలో పేర్కొంది. 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వ్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో జీవనం వ్యయం పై అద్యయనం నిర్వహించి తాజా ర్యాంకులను మెర్సర్ ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియాలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి గా నిలిచిన ముంబై
ఎవరు: ముంబై
ఎక్కడ: మహారాష్ట్ర
ఎప్పుడు: జూన్ 10
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |