Daily Current Affairs in Telugu 08-08-2021
టోక్యో ఒలింపిక్స్ లో పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అగ్రరాజ్యం అమెరికా దేశం:
ఒలింపిక్స్ ఎప్పుడైనా ఎక్కడైనా పతకాల పట్టికలో దాదాపు అగ్ర రాజ్యం అమెరికాదే ఆధిపత్యం. కాని ఈసారీ లెక్క తప్పలేదు. టోక్యోలోనూ అమెరికానే అగ్రపీఠాన్ని అలంకరించింది. మరో రోజులో ఒలింపిక్స్ ముగుస్తుందనగా స్వర్ణాల్లో చైనా (38) కంటే వెనుకంజలో నిలిచిన అమెరికా (36) ఈసారి అగ్రస్థానాన్ని కోల్పోతుందేమో అన్న అనుమానాలు కలిగించింది. కానీ ఆఖరి రోజు, ఆగస్ట్ 08న మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న అమెరికా (39) చైనా (38)ను ఒకే ఒక్క పసిడి తేడాతో వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. చివరి రోజు చైనా ఒక్క స్వర్ణమూ గెలవకపోవడం అమెరికాకు కలిసొచ్చింది. ఒక దశలో ఈ రెండు దేశాలు చెరో 38 స్వర్ణాలతో సమానంగా ఉండగా వాలీబాల్ మహిళల జట్టు అనూహ్యంగా పసిడి గెలవడంతో అమెరికా (39) చైనా (38)ను ఒకే ఒక్క పసిడి తేడాతో వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. చివరి రోజు చైనా ఒక్క స్వర్ణమూ గెలవకపోవడం అమెరికాకు కలిసొచ్చింది ఒక దశలో ఈ రెండు దేశాలు చెరో 38 స్వర్ణాలతో సమానంగా ఉండగా వాలీబాల్ మహిళల జట్టు అనూహ్యంగా పసిడి గెలవడంతో అమెరికా పైచేయి సాధించింది మొత్తం మీద అమెరికా 113 (39 స్వర్ణ, 41 రజత, 33 కాంస్యాలు) పతకాలతో అగ్రస్థానంలో నిలవగా, చైనా 88 (38 స్వర్ణ, 32 రజత, 18 కాంస్యాలు), ఆతిథ్య జపాన్ 58 (27 స్వర్ణ, 14 రజత, 17 కాంస్యాలు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ లో పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అగ్రరాజ్యం అమెరికా దేశం
ఎవరు: అమెరికా దేశం
ఎక్కడ: జపాన్ (టోక్యో )
ఎప్పుడు: ఆగస్ట్ 08
ఐటీబీపీ తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారుల నియామకం :
ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) దళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. స్థానిక ఐటీబీపీ అధికారుల శిక్షణ కేంద్రంలో మొత్తం 53 మంది శిక్షణ పూర్తి చేసుకోగా ఆగస్ట్ 08 న జరిగిన పాసింగ్ అవుట్ కవాతుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా అధికారులుగా నియమితులైన ప్రకృతి, దీక్షలకు అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంకులను కేటాయించారు. దీక్ష తండ్రి కమలేశ్ కుమార్ ఐటీబీపీలోనే ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. కవాతు అనంతరం కమలేశ్ కుమార్ యూనిఫాంతో తన కుమార్తె దీక్షకు శాల్యూట్ చేశారు.. యూపీఎస్సీ పరీక్షల ద్వారా ఐటీ బీపీ 2016 నుంచీ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అధికారుల స్థాయిలో ఇద్దరు మహిళలు నియామకం పొందం మాత్రం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐటీబీపీ తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారుల నియామకం
ఎవరు: ప్రకృతి, దీక్షలకు
ఎక్కడ: ఉత్తరాఖండ్
ఎప్పుడు: ఆగస్ట్ 08
కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా పదవి కాలం మరో ఏడాది కనసగింపు :
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్గాబాను మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1982వ బ్యాచ్ ఝార్ఖండ్ కేడర్కు చెందిన ఆయన పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అయితే, నియా మకాల మంత్రివర్గ సంఘం ఆయన పదవీకా లాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణ యించినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ శనివారం రాత్రి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా పదవి కాలం మరో ఏడాది కనసగింపు :
ఎవరు: రాజీవ్ గాబా
ఎప్పుడు: ఆగస్ట్ 08
జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్పర్సన్ రేఖ శర్మ కు మరో మూడేళ్ళు పొడగింపు
అధికారిక ఉత్తర్వు ప్రకారం రేఖ గారికి జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్పర్సన్ గా మూడేళ్ల పొడిగింపు ఇవ్వబడింది. ఆమె ఆగష్టు, 2015 నుండి కమిషన్ సభ్యురాలిగా ఉంది మరియు రెగ్యులర్ చీఫ్ కావడానికి ముందు 2017 సెప్టెంబర్ 29 నుండి చైర్ పర్సన్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. . ఒంటరిగా ఇళ్ల వద్ద చిక్కుకున్న వృద్ధులకు సహాయం చేయడానికి కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రత్యేక “హ్యాపీ టు హెల్ప్”అనే ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడంలో ఆమె ముందుంది. మహమ్మారి సమయంలో మహిళలు ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ను ప్రారంభించినందుకు గాను ఆమె ఘనత పొందింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్పర్సన్ రేఖ శర్మ కు మరో మూడేళ్ళు పొడగింపు
ఎవరు: రేఖ శర్మ
ఎప్పుడు: ఆగస్ట్ 08
టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో కాంస్య పథకం సాధించిన బజరంగ్ పునియా :
బజ్ంగ్ పునియాకు ఊరట పసిడి ఫేవరెట్ గా టోర్నీలో అడుగుపెట్టి అతడు. ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేక పోయినా పతకాన్ని సగర్వంగా ముద్దాడాడు. 65 కిలోల ప్లేఆఫ్ లో దౌలత్ నియజ్బెకోవ్ (కజకిస్థాన్)ను 8-0తో అలవోకగా మట్టికరిపిస్తూ కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నాడు. హాజీ అలీవ్తో సెమీస్ లో పేలవ డిఫెన్స్ దెబ్బతిన్న 27 ఏళ్ల బజరంగ్ నియజెకోవ్తో పోరులో ఎదురుదాడిలో పైచేయి సాధించాడు. ఈ ప్రత్యర్థి చేతిలో 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ సెమీస్ లో బజరంగ్ ఓడిపోవడం గమనార్హం. భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టి న మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత బజ్ రంగ కు ఇది గొప్ప ఊరటే. టోక్యో క్రీడల్లో భారత్ కు ఇది రెజ్లింగ్ పతకం. రవి దహియా రజతం గెలిచిన సంగతి తెలిసిందే
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో కాంస్య పథకం సాధించిన బజరంగ్ పునియా
ఎవరు: బజరంగ్ పునియా
ఎప్పుడు: ఆగస్ట్ 08
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |