Daily Current Affairs in Telugu 07-08-2021
జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెర్ఎస్ఐ) నూతన డైరెక్టర్ ధృతీ బెనర్జీ బాద్యతలు :
కొల్ కతాలోని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెర్ఎస్ఐ) నూతన డైరెక్టర్ గా ధృతీ బెనర్జీ ఆగస్టు 6న బాధ్యతలు చేపట్టారు. కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ పరిధిలో పనిచేసే జెర్ఎస్ఐకి 105 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సంస్థ డైరెక్టర్ గా ఒక మహిళ అధికారిగా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ధృతీ మాట్లాడుత. పరిశోధనల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. భారతదేశ భిన్నత్వాన్ని ప్రజలంతా తెలుసుకొనేలా కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ద్వారా వారికి చేరువ కావడమే తమ సంస్థ యోక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెర్ఎస్ఐ) నూతన డైరెక్టర్ ధృతీ బెనర్జీ బాద్యతలు
ఎవరు: ధృతీ బెనర్జీ
ఎప్పుడు: ఆగస్ట్ 07
ఎయిర్ పోర్ట్స్ చట్ట సవరణ బిల్లు కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం :
ఎయిర్ పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లుకు ఆగస్టు 4న పార్లమెంటు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖీ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించిన ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్మెంట్) బిల్లు-2021’కు ఆగస్టు 6న లోక్ సభ ఆమోదం తెలిపింది. మరోవైపు ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు-2021’ను లోక్సభ ఆమోదించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎయిర్ పోర్ట్స్ చట్ట సవరణ బిల్లు కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: న్యుదిల్లి
ఎప్పుడు: ఆగస్ట్ 07
టోక్యో ఒలిపిక్స్ లో భారత్ కు మొదటి స్వర్ణ పథకం గెలుచుకున్న నీరజ్ చోప్రా :
అథ్లెటిక్స్ తొలి ఒలింపిక్ పతకం కోసం భారత్ వందేళ్ల నిరీక్షణ ఫలించింది. జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. దేశ అథ్లెటిక్స్ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఒలింపిక్ లో పసిడి నెగ్గిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు. దేశమంతా ఆశగా తనవైపే చూస్తుండగా రెండో త్రోను 87. 58 మీటర్లు విసిరిన అతడు బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వాలిఫయింగ్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం రెట్టింపైన అతడు. ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా అదరగొట్టాడు. టోక్యో ఒలింపిక్స్ లో భారత అత్యుత్తమ ఒలింపిక్స్ గా మలిచాడు. చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకుబ్ వడ్డెచ్ (86. 67మీ) రజతం, విటెస్లావ్ వెస్లే (85. 44మీ) కాంస్యం గెలుచుకున్నారు. ఈ క్రీడల్లో భారత్ కు ఇదే (జావెలిన్ త్రో) చివరి ఈవెంట్. చోప్రా కన్నా ముందు భారత్ తరఫున ఒలింపిక్ స్వర్ణం సాధించిన భారతీయుడు షూటర్ అభినవ్ బింద్రా (2008 బీజింగ్) మాత్రమే.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలిపిక్స్ లో భారత్ కు మొదటి స్వర్ణ పథకం గెలుచుకున్న నీరజ్ చోప్రా
ఎవరు: నీరజ్ చోప్రా
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 07
పురుషుల 200 మీటర్ల పరుగు లో స్వర్ణం గెలిచిన కెనెడా క్రీడాకారుడు :
టోక్యో ఒలింపిక్స్-2020 పురుషుల 200 మీటర్ల పరుగులో కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ విజేతగా నిలిచాడు., ఆగస్టు 4న జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగులో 19.62 సెకన్లలో తన యొక్క లక్ష్యాన్ని చేరుకొని బంగారు పతకాన్ని సాధించాడు. ఒలింపిక్స్ గ్రాసీకిది ఐదో పతకం. 2016 ‘రియో’లో 100 మీటర్లు, 4100 మీటర్ల టీమ్ రిలేలో కాంస్య పతకాలను 200 మీటర్ల పరుగులో రజతాన్ని దక్కించుకున్నాడు. తాజా ఒలింపిక్స్ లో ఇప్పటికే 100 మీటర్ల పరుగులో కాంస్యాన్ని నెగ్గాడు. గ్రాసీ తర్వాత 19.68 సెకన్లలో గమ్యాన్ని చేరిన కెనెత్ బెడ్నారెక్ (అమెరికా 19.68 సెకన్లు) రజత,. నోవా లైలెస్ (అమెరికా-19.74 సెకన్లు) కాంస్యం పతకాలను గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పురుషుల 200 మీటర్ల పరుగు లో స్వర్ణం గెలిచిన కెనెడా క్రీడాకారుడు
ఎవరు: కెనెడా క్రీడాకారుడు ఆండ్రీ డి
ఎక్కడ: టోక్యో (జపాన్)
ఎప్పుడు: ఆగస్ట్ 07
జాతీయ చేనేత దినోత్సవం గా ఆగస్ట్ 07 :
జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న జరుపుకుంటారు భారతీయ చేనేత పరిశ్రమ వారసత్వాన్ని ప్రదర్శించడానికి భారతదేశం 7వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ రోజు స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకోవడం కోసం మరియు మన దేశంలోని గొప్ప బట్టలు మరియు రంగురంగుల నేతలను గుర్తింపు గా జరుపుకోవడం. భారతీయ చేనేత పరిశ్రమ వారసత్వాన్ని ప్రదర్శించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులను సత్కరించడానికి దేశం మొత్తం ఈ రోజును సూచిస్తుంది. దీనిని మొదటిసారిగా భారత ప్రభుత్వం 2015 లో గుర్తించబడింది.. జాతీయ చేనేత దినోత్సవం దేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి చేనేత సహకారంపై దృష్టి సారించాలని మరియు నేత కార్మికుల ఆదాయాన్ని పెంచాలని కోరుతోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ చేనేత దినోత్సవం గా ఆగస్ట్ 07 :
ఎప్పుడు: ఆగస్ట్ 07:
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |