Daily Current Affairs in Telugu 04-08-2021
పురుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో చరిత్ర సృస్టించిన మిజైన్ లోపెజ్ నునేజ్ :
వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన పురుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును క్యూబా దేశానికి చెందిన మల్లయోధుడు మిజైన్ లోపెజ్ నునెజ్ సాధించాడు. క్యూబా లో వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల లో స్వర్ణ పతకాలు గెలిచిన తొలి రెజ్లర్ గా అతను గుర్తింపు పొందాడు. టోక్యో ఒలింపిక్స్-2020లో గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 38 ఏళ్ల లోపెజ్ నునేజ్ ఆగస్టు 2న జరిగిన ఫైనల్లో గెలిచి స్వర్ణ పథకం ను సొంతం చేసుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో చరిత్ర సృస్టించిన మిజైన్ లోపెజ్ నునేజ్
ఎవరు: మిజైన్ లోపెజ్ నునేజ్
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 04
టోక్యో ఒలింపిక్స్ లో మరో కాంస్య పథకం గెలుచుకున్న భారత్ :
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ లో పతకం సాధిలనే కలను నిజం చేసుకున్న లవ్లీనా. కాంస్య పథకం తో దేశానికి తిరిగి రానుంది. మహిళల 69 కేజీల క్వార్టర్స్ లో సంచలన ప్రదర్శనతో సెమీస్ చేరిన ఈ అస్సాం బాక్సర్. పసిడి పోరుకు అర్హత సాధించలేకపోయింది. ఆగస్ట్ 04న సెమీస్ లో కి అడుగుపెట్టిన ఆమె 0-5 తేడాతో ప్రపంచ చాంపియన్ బుసెనాజ్ సర్మెనెలి (టర్కీ) చేతిలో ఓటమి పాలైంది. సెమీస్ వరకూ స్ఫూర్తిదా యక ప్రదర్శన కనబరిచిన లవ్లీన కాని. కీలక పోరులో బుసె నాజ్ ధాటికి నిలబడలేకపోయింది. బుసెనాజ్ ఈ బౌట్ లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. కఠిన సవాలుకు సిద్ధమైన భారత బాక్సర్.. ఆరంభంలో ఆత్మవిశ్వాసంతో కనిపించింది. కౌంటర్ అటాకింగ్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఒక్క సారిగా పూర్తిగా రక్షణాత్మక ధోరణి అవలంబించిన లవ్లీనా అటాకింగ్ లో వెనకబడింది. ఆమెకు బుసానెజ్ ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒలింపిక్స్ చరిత్రలో దేశానికి పతకం అందించిన మూడో బాక్సర్ గా లవ్లీనా నిలిచింది. అంతకు ముందు 2008 బీజింగ్ లో విజేందర్ సింగ్, 2012 లండన్ లో మేరీకోమ్ కూడా కాంస్యాలే గెలిచారు
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ లో మరో కాంస్య పథకం గెలుచుకున్న భారత్
ఎవరు: లవ్లీనా.
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 04
పురుషుల 400 మీటర్ల హర్డిల్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కరెం వారోమ్ :
పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ లో నార్వే అథ్లెట్ కరెన్ వారోమ్ నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా ఆగస్టు 3న జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ పోటీల ఫైనల్లో అతను 45.94 సెకన్లలో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతడు 46.70 సెకన్లతో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు తో పాటు 1992 బార్సిలోనా ఒలింపిక్స్ కెవిన్ యంగ్ (అమెరికా; 46.78 సెకన్లు) సాధించిన ఒలింపిక్ రికార్డును అధిగమించాడు. 46.17 సెకన్లలో రేసును పూర్తి చేసిన రాయ్ బెంజమిన్ (అమెరికా) రజతాన్ని, అలిసన్ డాస్సాంటోస్ (బ్రెజిల్) కాంస్య పథకం ను గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పురుషుల 400 మీటర్ల హర్డిల్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కరెం వారోమ్
ఎవరు: కరెం వారోమ్
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 04
టోక్యో ఒలింపిక్స్ మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచిన ఎలైన్ థాంప్సన్ :
ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్ లో జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా ఆగస్టు 3న జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసులో ఆమె విజేతగా నిలిచింది. 21.53 సెకన్లలో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి స్వర్ణ [పథకం ను కైవసం చేసుకుంది. క్రిస్టినే ఎమోబోమా (నమీబియా; 21.81 సెకన్లు) రజత పథకం ను మరియు గాబ్రియేలా థామస్ (అమెరికా, 21.87 సెకన్ల తో ) కాంస్యపథకం ను సొంతం చేసుకున్నారు. తాజా విజయంతో స్ప్రింట్ (100, 200 మీటర్లు) ఈవెంట్లను ఎలైన్ క్లీన్ స్వీప్ చేసింది. టోక్యో ఒలింపిక్స్ – 2020 మహిళల 100 మీటర్ల పరుగులోనూ ఎలైన్ విజేతగా నిలిచిన విషయం విదితమే. 2016 రియో ఒలింపిక్స్ లోనూ ఎలైన్ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకుంది. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పథకం ను నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్ గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం ఉసేన్ బోల్ట్ (జమైకా) వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచిన ఎలైన్ థాంప్సన్
ఎవరు: ఎలైన్ థాంప్సన్
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 04
ప్రపంచంలోనే అతిపెద్ద రహదారిని నిర్మించిన బి.ఆర్ .వో సంస్థ :
సరిహాద్దు రహదారి సంస్థ (బి.ఆర్.వో) ప్రపంచం లోనే అత్యంత ఎత్తున రహదారిని నిర్మిచింది.తూర్పు లద్దాక్ లోని ఉమ్లింగ్లా పాస్ వద్ద 19,300 అడుగుల ఎత్తులో 52 కిలో మీటర్ల మేర బ్లాక్ టాప్ నిర్మాణం చేపట్టినట్లు ఆ సంస్థ ఆగస్ట్ 04 వెల్లడించింది. ఇప్పటి వరకు బొలివియా లోని యుటురుంచు అగ్ని పర్వతం పై 18,953 అడుగుల ఎత్తును లో ఉన్న రహదారుల నిర్మాణ రికార్డును ఇది అధిగమించింది.ఉమ్లింగ్లా లో నిర్మించిన రహదారి చుమార్ సెక్టార్ లోని ముఖ్యమైన పట్టణాలను కలుపుతుంది .లెహ్ నుంచి చిసుమ్లె డిమ్ చొక్ లను నేరుగా చేరుకునేందుకు ఈ ప్రత్యామ్నాయ మార్గం ఉపయోగపడుతుందని ఇది స్థానికులకు ఒక వరమని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. చలికాలం లో 19,300 అడుగుల ఎత్తు వద్ద ఉష్ణోగ్రత లు -40 డిగ్రీల మేర ఉంటాయని ఆక్సిజన్ 50 శాతం తక్కువగా ఉంటుందని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అతిపెద్ద రహదారిని నిర్మించిన బి.ఆర్ .వో సంస్థ ఎవరు: ఎలైన్ థాంప్సన్
ఎక్కడ: లద్దాక్ లో ఉమ్లింగ్లా
ఎప్పుడు: ఆగస్ట్ 04
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |