Daily Current Affairs in Telugu 02-09-2020
లెబనాన్ దేశ నూతన ప్రధానిగా నియమితులయిన ముస్తఫా ఆదిబ్ ;
జర్మనీలో లెబనాన్ రాయబారి, ముస్తాఫా అడిబ్ సంక్షోభంలో ఉన్న లెబనాన్‌లో నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. 2013 నుండి బీరుట్ యొక్క బెర్లిన్ రాయబారిగా ఉన్న ఆదిబ్, మాజీ ప్రధాని నజీబ్ మికాటి గారి నేతృత్వంలోని ఒక చిన్న సున్నీ పార్టీతో అనుబంధంగా ఉన్నారు. పేలుడు జరిగిన కొన్ని రోజుల తరువాత, ప్రధాని హసన్ డియాబ్ అనే స్వీయ౦గా టెక్నోక్రాట్ ప్రభుత్వం పదవి నుంచి తప్పుకుంది. 128 మంది సభ్యుల పార్లమెంటులో 90 ఓట్లు సాధించిన తరువాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు మైఖేల్ ఉన్ జర్మనీలోని లెబనాన్ రాయబారి గా ఉన్న అడిబ్‌ను కోరారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: లెబనాన్ నూతన ప్రధానిగా నియమితులయిన ముస్తఫా ఆదిబ్
ఎవరు: ముస్తఫా ఆదిబ్
ఎక్కడ: లెబనాన్
ఎప్పుడు: సెప్టెంబర్ 02
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ నియమితులయిన అవీక్ సర్కార్ :
దేశంలోని ప్రధాన వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ఎడిటర్ ఎమెరిటస్ మరియు ఆనంద బజార్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ అయిన అవీక్ సర్కార్గారు ఎన్నికయ్యారు. పంజాబ్ కేసరి గ్రూప్ వార్తాపత్రికల చీఫ్ ఎడిటర్ విజయ్ కుమార్ చోప్రా తరువాత ఈయన ఎన్నికయ్యారు.సెప్టెంబర్ 02 న జరిగిన సమావేశంలో అవిక్ సర్కార్ ఎన్నికను పిటిఐ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. 75 ఏళ్ల సర్కార్ పాఠశాలలోనే విద్యార్థిగా ఉన్నప్పుడే జర్నలిస్టుగా శిక్షణ ప్రారంభించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత, అతను బ్రిటన్ వెళ్ళాడు, అక్కడ ది సండే టైమ్స్ యొక్క పురాణ సంపాదకుడు సర్ హెరాల్డ్ ఎవాన్స్ ఆధ్వర్యంలో పని చేసారు. ఎడ్విన్ టేలర్ (డిజైన్) మరియు ఇయాన్ జాక్ (సబ్ ఎడిటింగ్) వంటి దిగ్గజ వ్యక్తులు ఆయనను జర్నలిజంలో చదివారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ నియమితులయిన అవీక్ సర్కార్
ఎవరు: అవీక్ సర్కార్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 02
జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీరీ ,డోగ్రి ,హిందీ భాషలకు అధికారిక బాషలుగా ఆమోదం :
జమ్మూ కాశ్మీర్ అధికార భాషలుగా ఉర్దూ,ఇంగ్లీష్ లతో పాటు కొత్తగా కాశ్మీరీ డోగ్రి హిందిలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ సెప్టెంబర్ 02న ఆమోద ముద్ర వేసారు.ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషలు బిల్లు 2020 వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రవేశ పెడతామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సెప్టెంబర్ 02న వెల్లడించారు.మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీరీ,డోగ్రీ ,హింది మాట్లాడే వారి సంఖ్య 70శాతం వరకు ఉంటుందన్నారు.వీటిని అధికారిక బాషలుగా గుర్తించారని స్థానిక ప్రజలు దీర్గ కాలంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్న్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీరీ ,డోగ్రి ,హిందీ భాషలకు అధికారిక బాషలుగా ఆమోదం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: జమ్మూ కాశ్మీర్ లో
ఎప్పుడు: సెప్టెంబర్ 02
టైమ్స్ ర్యాంకింగ్ లో 63భారత విద్యాసంస్థలకు దక్కిన చోటు :
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యకు అత్యత్తమ యునివర్సిటీ ల జాబితాలో భారత్ నుంచి గతంలో ఎన్నడు లేని విధంగా 63 విద్య సంస్థలకు చోటు దక్కింది.ఈ మేరకు టైమ్స్ యునివర్సిటీ ర్యాంకింగ్ -2021 జాబితా ను ప్రకటించారు.విద్య బోదనలోనాణ్యత అంతర్జాతీయ దృక్పదం పరిశోధన జ్ఞాన సముపార్జన ,పరిశోదన పత్రాలు స్కాలర్ల అభిప్రాయం ఆదారంగా మొత్తం 1500యునివర్సిటీ లను పరిగనలోనికి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చారు.భారత్ నుంచి గత ఏడాది ఈ జాబితాలో ఉన్న యునివర్సిటీ ఈ ఏడాది మరో 14 కొత్తగా చేరి మొత్తం 63 అయ్యాయి.భారత్ కు సంబంధించి బెంగళూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) 301-350ర్యాంకింగ్ పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది.2015 నుంచి ఐఐఎస్సి ఇదే స్థానంలో కొనసాగుతుంది.ఇంద్ర ప్రస్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిల్లి ,కింగ్ జార్జ్ మెడికల్ యునివర్సిటీ (లక్ నవూ ) మహాత్మా గాంధీ యునివర్సిటీ ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి.ఈ విద్య సంస్థలు 601-800ర్యాంకింగ్ పాయింట్లు సాధించాయి.ఇక మొత్తం జాబితాలో ఆక్సఫర్డ్ యునివర్సిటీ అగ్ర స్థానంలో ఉంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: టైమ్స్ ర్యాంకింగ్ లో 63భారత విద్యాసంస్థలకు దక్కిన చోటు
ఎవరు: భారత విద్యాసంస్థలకు
ఎప్పుడు: సెప్టెంబర్ 02
118 చైనా కు సంబంధించిన యాప్ లపై నిషేధం విధించిన భారత్ :
ఇటివల జరుగుతున్నచైనా కవింపు నేపద్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పబ్ జి తో సహా 118 చైనా మొబైల్ యాప్ లను నిషేదిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటి శాఖా సెప్టెంబర్ 02న ఉత్తర్వులు జారీ చేసింది.పబ్ జి మొబైల్ లైట్ బీడు ,బైదు ఎక్స్ ప్రెస్ ,ఎడిషన్ అలీ పే,వాచ్ లిస్ట్ ,వి చాట్ ,రీడింగ్ ,కాం కార్డ్ తో పాటు పలు గేమింగ్ యాప్ లు నిషేదానికి గురైన వాటిలో ఉన్నాయి.దేశ భద్రతకు ముప్ప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటి పై నిషేధం విధించింది. పబ్ జి గేమ్ తో పిల్లలు,యువత మానసిక ఆరోగ్యం పై తీవ్ర్ ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయం ఉంది.భారత్ లో పబ్ జి కి క్రియాశీల వినియోగ దారులు 3.3 కోట్ల మంది ఉన్నారు.ప్రతి రోజు దేశంలో 1.3 కోట్ల మంది దీన్ని అడుతున్నారు. ఇంతకు ముందు లద్దాక్ తో చైనా తో జరిగిన ఘర్షణ నేపద్యంలో ఈ ఏడాది జూన్ 29 న కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్ టాక్ ,యుసి,బ్రౌజర్ తో సహా మొత్తం 59 చైనా యాప్ లను నిషేధం విధించింది .తర్వాతి మరో 47 యాప్ లను నిషేధిత జాబితాలో చేర్చింది.మొత్తం ఇప్పటి వరకు మొత్తం భారత్ 224 చైనా యాప్ లపై నిషేధం విధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 118 చైనా కు సంబంధించిన యాప్ లపై నిషేధం విధించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు:సెప్టెంబర్ 02
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |