Daily Current Affairs in Telugu 02-06-2020
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శి గా వాణి మోహన్ బాద్యతలు స్వీకరణ :
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా 1996 బ్యాచ్ కు చెందిన ఐ.ఎ.ఎస్ అధికారిణి జి. వాణి మోహన్ జూన్ 02 బాధ్యతలు స్వీకరించారు. గతం లో ఆమె జమ్మూ కాశ్మీర్ తో సహా పలు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను పరిశీకులుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె సహకార శాఖ కమిషనర్ గా ,ఏపి డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండి గా పని చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శి గా వాణి మోహన్ బాద్యతలు స్వీకరణ
ఎవరు: వాణి మోహన్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జూన్ 02
పౌష్టికాహార రంగంలో ఐ.ఎన్.ఎస్ శాస్త్రవేత్త కు దక్కిన అంతర్జాతీయ అవార్డు :
పౌస్తికహర రంగంలో జరిపిన విశేష కృషికి గాను హైదరాబాద్ లోని జాతీయ పౌష్టికాహార సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సుబ్బారావు ప్రతిస్తాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేసియర్ సైన్సెస్ విభాగం లో 2020 సంవత్సరానికి జూన్ 02 ఈ అవార్డు అందజేశారు. పౌష్టికాహారానికి సంబంధించిన అవగాహన ,ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం,పరిశోదన వ్యాసాల ప్రచురణలు ,బోధన ,ఆయా రంగాల్లో నాయకులుగా ఎదగడం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు విజేతలను ఎంపిక చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పౌష్టికాహార రంగంలో ఐ.ఎన్.ఎస్ శాస్త్రవేత్త కు దక్కిన అంతర్జాతీయ అవార్డు
ఎవరు: డాక్టర్ జి.సుబ్బారావు
ఎప్పుడు: జూన్ 02
భారత్ లో కోవిద్-19 వైరస్ చికిత్స యాంటి వైరస్ మెడిసిన్ రేమ్ డేసివిర్ కు ఆమోదం :
కోవిద్ -19 చికిత్స కోసం యాంటి వైరల్ మెడిసిన్ రెమ్ డేసివెర్ ను భారత్ లో అమ్మేందుకు ప్రముఖ అమెరికా ఫార్మా కంపెని గిలియాడ్ సైన్సెస్ కు భారత ఔషద నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన (సి.డి.ఎస్.సి.ఓ)అనుమతినిచ్చింది. అయితే అత్యవసర సందర్బాలలో మాత్రమె ఆసుపత్రుఅలో కోవిద్ -19 కే చికిత్స పొందుతున్న వారికీ వాటిని వినియోగించాలని స్పష్టం చేసింది.తీవ్ర స్థాయి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న పిల్లలు పెద్దలలు గరిష్టంగా ఐదు రోజుల కోర్సుగా ఇంజక్షన్ రూపం లో ఈ ఔషదాన్ని వాడాలని పేర్కొంది. ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణ లోనే దీన్ని వాడాలని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం నిబంధనలను పాటిస్తూ రెమ్ డేసివెర్ అమ్మకాలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయిక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లో కోవిద్-19 వైరస్ చికిత్స యాంటి వైరస్ మెడిసిన్ రేమిదేసిర్ కు ఆమోదం
ఎవరు: భారత్
ఎప్పుడు: జూన్ 02
జే.ఎన్.టి.యు విద్యార్థి కి దక్కిన గ్లోబల్ స్వీడ్ పురస్కారం :
జే.ఎన్టియు.హెచ్ విద్యార్థి రాహుల్ రెడ్డి కటి రెడ్డి స్వీడన్ లో ప్రతిష్టాత్మకంగా భావించే గ్లోబల్ స్వీడ్ పురస్కారానికి ఎంపికయ్యాడు.ఆయన కడప జిల్లా పులివెందుల వాసి. ప్రస్తుతం రాహుల్ జే,ఎన్,టి,యు బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా జరగిన ఒప్పందం ద్వారా అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుతున్నాడు. రాహుల్ రెడ్డి స్వీడన్ లోని బ్లేకింగ్ వర్శిటీ లో చివర్ సంవత్సరం సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.చదువులో ప్రతిభ ఎంటర్ ప్రేన్యుర్ షిప్ ,ఆవిష్కరణల లపై వినూత్న ఆలోచనలను తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్వీడన్ విదేశీ వ్యవహారాల శాఖ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జే.ఎన్.టి.యు విద్యార్థి కి దక్కిన గ్లోబల్ స్వీడ్ పురస్కారం
ఎవరు: రాహుల్ రెడ్డి కటి రెడ్డి
ఎప్పుడు: జూన్ 02
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |