Daily Current Affairs in Telugu 10-01-2021
యుఎస్ ఉపాధ్యక్షురలైన కమలా హ్యారిస్ డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా భారతీయురాలు నబ్రీనా సింగ్ :
అమెరిక కొత్త ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ కు డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయురాలు సబ్రీనా సింగ్ ను నియమిస్తున్నట్లు అధికారిగా ప్రకటన విడుదల అయింది. బైడేన్,హ్యారిస్ ఎన్నికల ప్రచారం లోను కమల హ్యారిస్ ప్రెస్ సెక్రటరీగా సబ్రేనా సేవలు అందించారు. ఈమె తో పాటు వైట్ హౌస్ లో పని చేసే పలువురు సభ్యుల నియామకాలను కూడా ప్రకటించారు. బిన్న నేపద్యలను నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతుల ను ఆమె ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణలో తమకు అండగా నిలబడి మరింత దృడంగా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తారని కొత్త అద్యక్షుడిగా బైడేన్ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎస్ ఉపాధ్యక్షురలైన కమలా హ్యారిస్ డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా భారతీయురాలు నబ్రీనా సింగ్
ఎవరు: భారతీయురాలు నబ్రీనా సింగ్
ఎక్కడ : యుఎస్
ఎప్పుడు: జనవరి 10
అంతర్జాతీయ వరల్డ్ ఫుడ్ హీరో పురస్కారం దక్కించుకున్న అర్జుల రామంచంద్ర రావు :
బయోటెక్నాలజీ రంగం లో విశేష పరిశోదనలు చేసిన ఆచార్య అర్జుల రామచంద్ర రెడ్డికి బెల్జియం లోని అంతర్జాతీయ సంస్థ క్రాప్ లైఫ్ ఇంటర్నేషనల్ 2020 వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరో పురస్కారం ను అందజేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార రంగంలో మేటి పరిశోదనలు చేసి రైతులకు వెన్ను దన్నుగా నిలిచే వారికి ఆ సంస్థ ఈ పురస్కారంను ఇస్తుంది. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన రామచంద్రా రెడ్డి 30 ఏళ్ళు గా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో ఆచార్యునిగా విధులు నిర్వహిస్తూ ఈ మధ్యే పదవి విరమణ పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో యోగి వేమన వర్శిటీ వ్యవస్థాపక ఉపకులపతిగా శ్రీకృష్ణ దేవరాయల వర్శిటీ గా విసిగా పని చేసారు. దేశంలోనే మొదటి ఫ్లాంట్ బయో టెక్నాలజీ పరిశోదన శాల ఏర్పాటు చేసారు. జీవ సాంకేతిక శాస్త్రం లో వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలని బిటి వంకాయ వంగడం పై అర్జుల విస్తృత పరిశోదనలు చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ వరల్డ్ ఫుడ్ హీరో పురస్కారం దక్కించుకున్న అర్జుల రామంచంద్ర రావు
ఎవరు: అర్జుల రామంచంద్ర రావు
ఎప్పుడు: జనవరి 10
తైవాన్ పైన ఆంక్షలను ఎత్తివేసిన విధించిన అమెరికా దేశం :
తైవాన్ విధించిన ఆంక్షలు ఎత్తివేసినట్టు అమెరికా విదేశాంగ శాఖా మంత్రి మైక్ పామ్పియా ప్రకటించారు. చైనా ను సంతృప్తి పరచాలన్న ఉద్దేశం తో తైవాన్ దౌత్యవేత్త లు అధికారులతో పరిమితంగా సంబందాలు ఉండేలా అమెరికా గతం లో స్వీయ ఆంక్షలు విధించుకుంది. ప్రస్తుత పరిస్తితులలో వీటి అవసరం లేదని ఉభయ దేశాల దౌత్యవేత్తలు అధికారులు మద్య అన్ని రకాల సంబందాల ఉంటాయని పాంపియో తెలిపారు. దీనిని చైనా అధికార మీడియా ఖండించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: తైవాన్ పైన ఆంక్షలను ఎత్తివేసిన విధించిన అమెరికా దేశం
ఎవరు: అమెరికా దేశం
ఎప్పుడు: జనవరి 10
బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ బోర్డు కు సభ్యునిగా ఎంపిక అయిన తొలి భారతీయ ప్రొఫెసర్ ప్రమోద్ నాయర్ :
హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం (హెచ్.సి.యు) ఇంగ్లీష్ ప్రొఫెసర్ ప్రమోద్ కే.నాయర్ 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిల్ ప్రచురణ కేంద్రం (పబ్లిషింగ్ హౌస్ ) ఎడిటోరియల్ బోర్డులో సభ్యత్వానికి ఎంపిక అయ్యారు. తద్వారా ఈ ఘనత తొలి భారతీయ ప్రొఫెసర్ నిలిచారు. బ్రిల్ నుంచి రానున్న క్రిటికల్ పోస్ట్ హ్యుమినిజం అనే ఈ పుస్తక ధారావాహిక కు ఆయన ఎంపిక అయ్యారు. ప్రొఫెసర్ ప్రమోద్ రచించిన పుస్తకాలు జర్నల్ ఆదారంగా ఆయనకు ఈ అవకాశం దక్కింది. హెచ్.సి.యు లోనే ప్రొఫెసర్ ప్రమోద్ విద్యను అబ్యాసించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ బోర్డు కు సబ్యునిగా ఎంపిక అయిన తొలి భారతీయ ప్రొఫెసర్ ప్రమోద్ నాయర్
ఎవరు: ప్రొఫెసర్ ప్రమోద్ నాయర్
ఎప్పుడు: జనవరి 10
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |