Daily Current Affairs in Telugu 30-06-2021
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ :

భారత మహిళా స్టార్ గోల్ఫర్ అదితి అశోక్ టోక్యో ఒలింపిక్స్ కు అర్హతను సాధించింది. టోక్యో’ గేమ్స్ కు అర్హత పొందిన 60 మంది మహిళా క్రీడాకారిణుల జాబితాను జూన్ 29న అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య (ఐజీఎఫ్) ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో అదితి 45వ స్థానంలో ఉంది. కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల అదితికిది వరుసగా రెండో ఒలింపిక్స్. 2016 రియో ఒలింపిక్స్ లో ఆమె 41వ స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో భారత్ నుంచి అనిర్బన్ లాహిరి, ఉదయన్ మానె టోక్యో ఒలింపిక్స్ బరిలో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్
ఎవరు: అదితి అశోక్
ఎపుడు: జూన్ 30
అమె రికాలో ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డ్ ను అందుకున్న హేమ :

ప్రవాసాంధ్రురాలు, జగ్గయ్యపేట మహిళ కంటమనేని హేమ అమెరికాలో ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డ్ ను అందుకున్నారు. అమెరికాలోని’ సెయింట్ జోన్స్ ఫ్లోరిడాలోని పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) సంస్థకు చీఫ్ ప్రోగ్రాం అధికారిగా వ్యవహర్తిస్తున్న హేమ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను ఈ పురస్కారం అందుకున్నారు. జగ్గయ్యపేటలో పుట్టిన హేమ స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, జేఆర్సీ కళాశాలలో ఇంటర్, ఎసీఎస్ కళాశా లలో డిగ్రీ చదువుకున్నారు. ఆమె గతంలో రెండుసార్లు ప్రెసిడెంట్స్ వాలంటిరు. సర్వీస్. అవార్డు కుడా అందుకుంది. జిల్లాలో పలు పాఠశాలకు రక్షిత, నీటి ప్లాంట్లను అందించిన ప్యూర్ సంస్థ తాజాగా కోవిడ్ కేర్ కేంద్రం ద్వారా రూ.10 లక్షలకు పైగా విలువైన సామగ్రిని అందించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమె రికాలో ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డ్ ను అందుకున్న హేమ
ఎవరు : కంటమనేని హేమ
ఎక్కడ: అమెరికా
ఎపుడు: జూన్ 30
ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడిగా గ్రాండ్ మాస్టర్ గా రికార్డ్లేకేక్కిన అభిమన్యు మిశ్రా :

‘ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ (జీఎం) హోదా పొందిన అతి చిన్న వయస్సు కలిగిన భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జూన్ 30న జరిగిన వెజెరెప్కో జీఎం టోర్నీలో భాగంగా తొమ్మిదో రౌండ్లో అభిమన్యు మిశ్రా 55 ఎత్తుల్లో భారత గ్రాండ్ మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకాపై గెలుపొందాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన మూడో జీఎం గా స్థానం దక్కించుకున్నాడు. అభిమన్యు జీఎం హోదా 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సులో అందుకొని రష్యాకు చెందిన సెర్గీ కర్ణాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) పేరిట 2002 నుంచి ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడిగా గ్రాండ్ మాస్టర్ గా రికార్డ్లేకేక్కిన అభిమన్యు మిశ్రా
ఎవరు: అభిమన్యు మిశ్రా
ఎపుడు: జూలై 30
IFUNA యొక్క చైర్మన్ గా ఎస్.ఎన్ శ్రీవాస్తవ నియామకం :

అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఐక్యరాజ్యసమితి మరియు దాని ప్రత్యేక సంస్థల లక్ష్యాలను ప్రోత్సహించడానికి లాభాపేక్షలేని సంస్థ అయిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఐక్యరాజ్యసమితి సంఘాల ఛైర్మన్గా ఎస్.ఎన్ శ్రీవాస్తవ గారు నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐన చత్తీస్ గడ్ రాష్ట్ర మాజీ చీఫ్ లోకాయుక్త జస్టిస్ (రిటైర్డ్) శంభునాథ్ శ్రీవాస్తవను IFUNA చైర్మన్గా నియమించారు. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా తరువాత ఆయన విజయం సాధించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: IFUNA యొక్క చైర్మన్ గా ఎస్.ఎన్ శ్రీవాస్తవ నియామకం
ఎవరు: ఎస్.ఎన్ శ్రీవాస్తవ
ఎపుడు: జూన్ 30
కోవాగ్జిన్ ఉత్పత్తులపై నిషేధం విధించిన బ్రెజిల్ దేశం :

దేశీయ కోవిడ్-19 టీకా “కోవాగ్జిన్” ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్ తో 2 కోట్ల టీకా డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని బ్రెజిల్ ప్రభుత్వంతాత్కాలికంగా నిలిపేసింది. దేశ కంపోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. దేశ కంస్ట్రోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ బయోటెక్ తో కోవాగ్జిన్ టీకా కొనుగోలు ఒప్పందాన్ని జూన్ 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ దేశ వైద్య శాఖ ప్రకటించింది.ఈ ఒప్పందంలో అవినీతి సహా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్ నిర్ణయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. బ్రెజిల్ నుంచి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులను తాము స్వీకరించలేదని, అలాగే బ్రెజిల్ కు ఇప్పటివరకు టీకాలను కూడా సరఫరా చేయలేదని తెలిపింది. ‘ప్రెసికా మెడికామెంటోస్’సంస్థ ‘భారత్ బయోటెక్’కు బ్రెజిల్ లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్ కు 15 డాలర్లకు ఒక డోసు చొప్పున అమ్మేందుకు భారత్ బయోటెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవాగ్జిన్ ఉత్పత్తులపై నిషేధం విధించిన బ్రెజిల్ దేశం :
ఎవరు: బ్రెజిల్ దేశం
ఎపుడు: జూన్ 30
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |