Daily Current Affairs in Telugu 29-09-2020
2020-21 లతా మంగేష్కర్ అవార్డును పొందిన ఉషా మంగేష్కర్ :

ప్రముఖ మహిళా ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్న ఉషా మంగేష్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను సామ్రాగ్ని లతా మంగేష్కర్ అవార్డును ప్రకటించింది.ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఇస్తుంది. ఈ అవార్డులో ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి, ఒక సర్టిఫికేట్ మరియు మెమెంటో ఉన్నాయి. ప్రముఖ గాయకురాలు మరాఠీ, హిందీ మరియు అనేక ఇతర భారతీయ భాషా చిత్రాలలో పాటలు పాడారు.’సుబా కా తారా’, ‘జే సంతోషి మా’, ‘ఆజాద్’, ‘చిత్రలేఖ’, ‘ఖట్టా మీతా’, ‘కాలా పఠర్’, ‘నసీబ్’, ‘ఖుబ్సురత్’, ‘డిస్కో డాన్సర్’, ‘ఇంకార్’ చిత్రాల లో ఆమె పాడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2020-21 లతా మంగేష్కర్ అవార్డును పొందిన
ఎవరు: ఉషా మంగేష్కర్
ఎక్కడ:మహారాష్ట్ర
ఎప్పుడు:సెప్టెంబర్ 29
ఎఫ్టిఐఐ పాలక మండలి చైర్మన్‌గా ఎంపికయిన చిత్రనిర్మాత శేఖర్ కపూర్:

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టిఐఐ) సొసైటీ నూతన అధ్యక్షుడిగా, ఎఫ్టిఐఐ పాలక మండలి ఛైర్మన్‌గా శేఖర్ కపూర్‌ను నియమిస్తున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.అతని పదవీకాలం మార్చి 3, 2023 వరకు ఉంటుంది. మసూమ్ (1983), మిస్టర్ ఇండియా (1987), ఎలిజబెత్ (1998) మరియు బాండిట్ క్వీన్ (1994) వంటి చిత్రాలతో పేరుగాంచిన కపూర్, టెలివిజన్ నిర్మాత బిపి సింగ్ స్థానంలో నియమితులయ్యారు. బిపి సింగ్ పదవీకాలం మార్చి 2020 లో ముగిసింది, కాని కరోనావైరస్ పరిస్థితి కారణంగా అతనికి పొడిగి౦చారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎఫ్టిఐఐ పాలక మండలి చైర్మన్‌గా ఎంపికయిన చిత్రనిర్మాత శేఖర్ కపూర్
ఎవరు: చిత్రనిర్మాత శేఖర్ కపూర్
ఎప్పుడు: :సెప్టెంబర్ 29
కువైట్ దేశ రాజు అల్ సబా కన్నుమూత :

ఏళ్ల తరబడి కువైట్ పాలించిన రాజు షేక్ సబా అలీ అహ్మద్ అల్ సబా(91) సెప్టెంబర్ 29 న కన్నుమూశారు 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాన్‌తో సన్నిహిత సంబందాలు కొనసాగించడంలో, ఇతరత్రా ప్రాంతీయ సంక్షోభాలకు పరిష్కారాలు చూపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అరబ్ దేశాల మధ్య తలెత్తిన వివాదాలను తన దౌత్యం ద్వారా పరిష్కరిస్తూ వచ్చారు. కేవలం తొమ్మిది రోజులే కువైట్ రాజుగా పదవిలో అని ఉన్న ‘షేక్ సాద్ ఆల్ అబ్దుల్లా ఆల్ సబా ఆనా ఆరోగ్యం కారణంగా 2006లో వైదొలగిన తర్వాత పార్లమెంటులో ఏకగ్రీవంగా షేక్ సబా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంతర్గత రాజకీయ కలహాలతో కొన్నాళ్లు సతమతమయ్యారు. ఈ ఏడాది జులై నుంచి ఆయన అకస్మాత్తుగా న ఆనారోగ్యం పాలయ్యారు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్చి శస్త్రచికిత్స నిర్వహించారు. అనారోగ్యం ఏమిటనేది అధికార వర్గాలు వెల్లడించలేదు.ఇటీవల ఆయన్ని అమెరికాలోని మిన్నెసోటాకు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కువైట్ దేశ రాజు అల్ సబా కన్నుమూత
ఎవరు: అల్ సబా
ఎక్కడ: కువైట్
ఎప్పుడు: సెప్టెంబర్ 29
యుఎన్ డిపి నుంచి పురస్కారం దక్కించుకున్న బాలివుడ్ నటుడు సోను సూద్ :

లాక్ డౌన్ నేపద్యం లో వివిధ దేశాలలో చిక్కుపోయిన వేలాది మందికి కార్మికులను సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపించడంతో పాటు పేద విద్యార్థులకు ఉచిత విద్య ,వైద్య సదుపాయం అందిస్తూ ఉదారత చాటుకున్న నటుడు సోను సూద్ కు అరుదైన గౌరవం దక్కింది.అయన చేస్తున్న సేవలకు గాను ఐక్య రాజ్య సమితి అబివృద్ది సంస్థ (యుఎన్డి పి) ప్రతిష్టాత్మక సస్టేయనబుల్ డెవలప్ మెంట్ యాక్షన్ పురస్కారం తో ఆయనను సత్కరించింది.సెప్టెంబర్ 29న వర్చువల్ విధానం లో జరిగిన కార్యక్రమంలో సోను సూద్ ఈ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎన్ డిపి నుంచి పురస్కారం దక్కించుకున్న బాలివుడ్ నటుడు సోను సూద్
ఎవరు: సోను సూద్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 29
.
ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్ జి ఎస్ అముర్ కన్నుమూత :

ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్ జి ఎస్ అముర్ కన్నుమూశారు. కన్నడ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యోత్సవ అవార్డు, భారతీయ భాషా అవార్డుతో సహా పలు అవార్డులను గెలుచుకున్నారు .కన్నడ లో ‘అర్థలోక’, ఆర్ కన్నడ కదంబరియా బెలవానిగే‘ వ్యావసయ , కదంబరియా స్వరూప వంటి రచనలు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్ జి ఎస్ అముర్ కన్నుమూశారు
ఎవరు: జి ఎస్ అముర్
ఎప్పుడు: సెప్టెంబర్ 29
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |