Daily Current Affairs in Telugu -29-09-2019

current affairs in telugu

Daily Current Affairs in Telugu -29-09-2019:

rrb ntpc online exams in telugu

Daily Current Affairs -27th September 2019

Daily Current Affairs -28th September 2019

డైరెక్టర్ డా.కాకర్ల సుబ్బారావు కు ‘ప్రోఫెసేర్ ఆఫ్ ఏమినేన్స్’ అవార్డు:

వర్తమాన పరిస్తితులకు అనుగుణంగా వైద్య రంగంలో పరిశోధనలు జరగాలని వక్తలు అభిప్రాయపడ్డాడు. ప్రాథమిక ఆరోగ్య రక్షణ (ప్రైమరీ హెల్త్ కేర్ ) పై ప్రధాన ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరబాద్ లోని గ్లోబల్ మెడికల్  ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ ఫౌండేషన్ (జిఎంఈ ఆర్ఎఫ్) 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 28-09-2017 న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి) కళాశాల ఆడిటోరియం లో నిర్వహించరు. జిఎంఈ ఆర్ఎఫ్ వ్యస్థాపక అధ్యక్షుడు కేఎఫ్. రత్నాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అస్కి చైర్మన్,కేంద్ర హోం శాఖా మాజీ కార్యదర్శి కే.పద్మనాభయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమ్స్ మాజీ డైరెక్టర్ డా.కాకర్ల సుబ్బారావు కు ‘ప్రోఫెసేర్ ఆఫ్ ఏమినేన్స్’ అవార్డు అందజేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : నిమ్స్ మాజీ డైరెక్టర్ డా.కాకర్ల సుబ్బారావు కు ‘ప్రోఫెసేర్ ఆఫ్ ఏమినేన్స్’ అవార్డు

ఎప్పుడు : 28-09-2019

ఎవరు : డా.కాకర్ల సుబ్బారావు

ఎక్కడ: హైదరాబాదు, తెలంగాణ

కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రధానం :

ప్రముఖకవి కే.శివారెడ్డికి సరస్వతి సమ్మాన్- 2018 అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు.శివా రెడ్డి రచించిన “పక్కకు ఒత్తిగిలితే” పద్య సంకలనం ద్వారా సర్వస్వతి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. డిల్లిలోని ఉపరాష్ట్రపతి నిలయంలో 28-09-2019 జరిగిన కార్యక్రమంలో కవి శివారెడ్డికి అవార్డుతో పాటు రూ.15 లక్షల చెక్కును అందజేశారు.  

క్విక్ రివ్యు :

ఏమిటి : కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ అవార్డు

ఎప్పుడు : 28-09-2019

ఎవరు : ప్రముఖకవి కే.శివారెడ్డికి సరస్వతి సమ్మాన్- 2018 అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు.

ఎక్కడ : డిల్లి

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు ఆరంభం:

వారానికి 5 రోజుల పాటు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఉదయ్ విశాఖపట్నం మరియు విజయవాడ మధ్య ప్రారంభించడమైంది. రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 26 న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఈ రైలు అధికారికంగా ప్రారంభించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం

ఎప్పుడు : 26-09-2019

ఎవరు : రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి

ఎక్కడ: విశాఖపట్నం, ఆంద్రప్రదేశ్

100 మీటర్ల పరుగు పందంలో కొత్త ప్రపంచ చాంపియన్:

ఖతర్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ షిప్ 100 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్ వచ్చాడు. ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ షిప్ 100 మీటర్ల పరుగులో అమెరికా సంచలనం క్రిస్టియన్ కొల్మాన్ విజేతగా నిలిచాడు. గత చాంపియన్ షిప్ లో రజతం సాధించిన కోల్మన్ ఈసారి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 28-09-2019 న జరిగిన ఫైనల్లో కోల్మన్ 9.67 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని అగ్రస్థానం సాధించాడు. అమెరికాకు చెందిన గ్లాటిన్ (9.89 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ షిప్ 100 మీటర్ల పరుగు పందం

ఎప్పుడు : 28-09-2019

ఎవరు : క్రిస్టియన్ కొల్మాన్

ఎక్కడ : దోహా, ఖతర్

Manavidya Youtube Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *