
Daily Current Affairs in Telugu 28&29 November – 2022
పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అసీం మునీర్ :

పాకిస్థాన్ దేశ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధిపతిగా గతంలో పనిచేసిన జనరల్ అసీం మునీర్ మంగ ళవారం పాక్ ఆర్మీ కొత్త చీఫ్గా గా బాధ్యతలు స్వీక రించారు. వరుసగా రెండు విడతలు ఆరేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వహించిన జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పదవీ విరమణ చేయడంతో పాక్ ఆర్మీకి 17వ కొత్త చీఫ్ గా మునీర్ను ప్రధాన మంత్రి షెహబాబ్ షరీప్ నియమించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్గా గా బాధ్యతలు స్వీకరించిన అసీం మునీర్
ఎక్కడ: అసీం మునీర్
ఎప్పుడు : నవంబర్ 29
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్ రెడ్డి నియమాక౦ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. 2024 జూన్ వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు. వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండ లంలోని కసునూరు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత ఆంధ్రప్రదే క్లోనూ అనేక కీలక శాఖల్లో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఆసిస్టెంట్ కలెక్టర్ గా కెరీర్ మొదలైంది. మహబూబ్ నగర్, నర్సాపురం ఆఫ్ స్టెంట్ కలెక్టర్, భద్రాచలం ఐటీడీఏ పీవోగా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు శ్రీకాకుళం, తూర్పుగోదావరి. జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. హైదరాబాద్లో మెట్రో వాటర్ సర్వీ సెస్ ఎండీగా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసి గా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ కమిషనర్ విదులు నిర్వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్ రెడ్డి నియమాక౦
ఎక్కడ: కె.ఎస్. జవహర్ రెడ్డి
ఎప్పుడు : నవంబర్ 29
2022 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా గ్యాస్ లైటింగ్ పదాన్ని ప్రకటించిన మెరియం వెబ్ స్టర్ :

ప్రపంచ ప్రఖ్యాత ప్రచురణ కర్త మెరియం వెబ్ స్టర్ గ్యాస్ లైటింగ్ అనే పదాన్ని 2022 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. నిఘంటువు ఈ పదాన్ని ఇలా నిర్వచించింది ముఖ్యంగా ఒకరి స్వంత ప్రయోజనాల కోసం ఒకరిని స్థూలంగా తప్పు దారి పట్టించే చర్య లేదా అభ్యాసం .గ్యాస్ లైటింగ్ అనేది చాల కాలం పాటు మానసిక స్థాయిలు ఎవరి తోనైనా ఆడుకోవడాన్ని సూచిస్తుంది.గ్యాస్ లైటింగ్ సాదారణ భాషలో మానసిక౦ గా ఎవరి తోనైనా మోసం చేయడం. ఈ పదం 80సంవత్సరాల క్రితం 1938లో గ్యాస్ లైట్ ద్వారా ఉనికిలో కి వచ్చింది.గ్యాస్ లైట్ అనేది పాట్రిక్ హమిల్టన్ రచించిన నాటకం.కాగా ఈ నాటకం పైన 1940 రెండు సినిమాలు కూడా వచ్చాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా గ్యాస్ లైటింగ్ పదాన్ని ప్రకటించిన మెరియం వెబ్ స్టర్
ఎవరు : మెరియం వెబ్ స్టర్:
ఎప్పుడు : నవంబర్ 29
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా బాద్యతలు చేపట్టిన ప్రీతి సూదన్ :

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) 1983 సభ్యురాలిగా బ్యాచ్ ఏపీ కేడర్ చెందిన ప్రీతి సూదన్ గారు బాధ్యతలు చేపట్టారు. ఆమెతో చేత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సూదన్ తో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని గారు ప్రమాణం చేయించారు. కరోనా సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పని చేసిన ప్రీతి సూదన్ 2020 జులైలో పదవీ విరమణ చేశారు. అంత కుముందు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవ హారాలు, మహిళా, శిశు అభివృద్ధి శాఖల కార్య దర్శిగా సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా బాద్యతలు చేపట్టిన ప్రీతి సూదన్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : నవంబర్ 29
జాతీయ అవార్డులు అందుకున్న తోలుబొమ్మల కళాకారులు దళవాయి శివమ్మ, కుళ్లాయప్ప :

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారులు దళవాయి శివమ్మ, ఆమె కుమారుడు కుళ్లాయప్ప జాతీయ అవార్డులు అందుకున్నారు నవంబర్ 28న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చైతుల మీదుగా పురస్కారాలను స్వీకరించారు లెదర్ పప్పెట్ విభాగంలో జాతీయ స్థాయి అవార్డు 2017 సంవత్సరానికి దళవాయి కుళ్లాయప్ప.. 2019 గాను దళవాయి శివమ్మ గారు ఎంపికయ్యారు. తోలుపై మహా విష్ణువు చరితామృతం రూపొందించి కుల్లాయప్ప అవార్డు పొందారు. దళవాయి శివమ్మ తోలుపై రూపొందించిన రామరావణ యుద్ధ ఘట్టం పురస్కారానికి ఎంపికైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ అవార్డులు అందుకున్న తోలుబొమ్మల కళాకారులు దళవాయి శివమ్మ, కుళ్లాయప్ప
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : నవంబర్ 29
ఒకే ఓవర్ లో ఏడు సిక్స్ లు బాది రికార్డ్ సృష్టించిన మహారాష్ట్ర యువ బ్యాట్స్ మెన్ రుతు రాజ్ గైక్వాడ్ :

మహారాష్ట్ర యువ బ్యాట్స్ మెన్ రుతు రాజ్ గైక్వాడ్ విజయ్ హజారే వన్డే ట్రోఫి లో అధ్బుతం చేసాడు.నవంబర్ 29 ఉత్తరప్రదేశ్ లో క్వార్టర్ లో మ్యాచ్ లో ఒకే ఓవర్ లో ఏకంగా ఏడు సిక్సర్ లు బాదేశాడు.ఓవర్ కు ఆరు బంతులే అయిన నోబాల్ కలిసి రావడం తో దానిని కూడా ఉపయోగించుకుని ప్రపంచ రికార్డ్ సాధించాడు. యుపి స్పిన్నర్ శివ సింగ్ ఓవర్ లో రుతు రాజ్ ఈ అసాదారణ ఘనత ను సాధించాడు. తొలి అయిదు బంతులను సిక్సర్ లుగా మలిచాక ఆరో బంతి ని శివ నోబాల్ వేశాడు.ఫ్రీ హిట్ బంతికి సిక్సర్ బాడిన ఆటను చివరి బంతిని కూడా నేరుగా బౌండరి దాటించాడు.ఈ ఓవర్ లో మొత్తం 43 పరుగులోచ్చాయి.దీంతో లిస్టు ఎ క్రికట్ లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డ్ నమోదు అయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఒకే ఓవర్ లో ఏడు సిక్స్ లు బాది రికార్డ్ సృష్టించిన మహారాష్ట్ర యువ బ్యాట్స్ మెన్ రుతు రాజ్ గైక్వాడ్
ఎక్కడ: రుతు రాజ్ గైక్వాడ్
ఎప్పుడు : నవంబర్ 29
బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజి డైరెక్టర్ గా మరియు సియివో గా సుందర్ రామన్ రామమూర్తి నియామకం :

బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజి డైరెక్టర్ గా మరియు చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ గా సుందర్ రామన్ రామమూర్తి గారి నియామకాన్ని సేక్యురిటేస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆమోదించింది. అతని నియామకం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది.రామ మూర్తి గారు ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికా లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇండియా .ఆశిష్ కుమార్ చౌహాన్ BSE యొక్క మేనేజింగ్ డైరెక్టర్ &చీఫ్ ఎగ్సికుటివ్ ఆఫీసర్ పదవి కి రాజీనామా చేసి NSE యొక్క సియివో గా చేరినప్పటికి నుంచి BSE లో ఉన్నత స్థానం జులై నుంచి ఖాళి గా ఉంది .BSE దీనిని గతంలో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ అని పిలిచేవారు.ఇది 18 75 లో బొంబాయ్ లో ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ గా స్థాపించబడింది.ఆసియా లోనే అతిపెద్ద తొలి స్టాక్ ఎక్స్ చేంజ్ ఇదే .
క్విక్ రివ్యు :
ఏమిటి : బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజి డైరెక్టర్ గా మరియు సియివో గా సుందర్ రామన్ రామమూర్తి నియామకం
ఎక్కడ: సుందర్ రామన్ రామమూర్తి
ఎప్పుడు : నవంబర్ 29
అమలాన్ అనే ఒక ప్రోగ్రామ్ ను ప్రారంబించిన ఓడిశా రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ :

ఓడిశా రాష్ట్రంలో మహిళలు మరియు పిల్లల లో రక్త హీనత సమస్య ను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ గారు ఓడిశా రాష్ట్రంలో అమలాన్ అనే ఒక ప్రోగ్రామ్ ను అనిమియా ముక్త్ లక్ష్య అభియాన్ ని ప్రారంబించారు.లక్ష్యంగా ఉన్న సమూహలలో రక్త హీనత ను త్వరగా తగ్గించడానికి రాష్ట్రం బహుముఖ విధానాన్ని రూపొంచించి రాష్ట్ర వ్యాప్తంగా 55 వేలు ప్రభుత్వ ఎయిడెడ్ పాటశాలలు ,74 వేల అంగన్ వాడి కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమలాన్ అనే ఒక ప్రోగ్రామ్ ను ప్రారంబించిన ఓడిశా రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్
ఎక్కడ: ఓడిశా రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్
ఎప్పుడు : నవంబర్ 29
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయిన దిగ్గజ అథ్లెట్ పరుగుల రాణి పిటి ఉష :

భారత దేశపు దిగ్గజ అథ్లెట్ పరుగుల రాణి పిటి ఉష గారు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా నామినేషన్ లకు గడువు నవంబర్ 27 తో ముగిసింది.అయితే ఉష కు పోటీ గా వేరెవరు నామినేషన్ లు దాఖలు చేయకపోవడం తో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.దాంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ గా పిటి ఉష గుర్తింపు పొందారు.అంతే గాక మహారాజ యదవీంద్ర సింగ్ తర్వాత ఈ బాద్యతలు స్వీకరించిన తొలి స్పోర్ట్స్ పర్సన్ గా ఆమె ఘనత సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయిన దిగ్గజ అథ్లెట్ పరుగుల రాణి పిటి ఉష
ఎక్కడ: పిటి ఉష
ఎప్పుడు : నవంబర్ 29
table id=210 /]
Daily current affairs in Telugu Pdf September 2022 PDF |
---|
Daily current affairs in Telugu Pdf 01-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 02-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 03-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 04-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 05-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 06-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 07-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 08-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 09-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 10-09- 2022 PDF</strong> |
Daily current affairs in Telugu Pdf 11-09- 2022 PDF |
>Daily current affairs in Telugu Pdf 12-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 13-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 14-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 15-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 16-09- 2022 PDF |
Daily current affairs in Telugu Pdf 17-09- 2022 PDF</strong> |
Daily current affairs in Telugu Pdf 18-09- 2022 PDF |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |