
Daily Current Affairs in Telugu 28-06-2020
స్విస్ బ్యాంకు డబ్బు నిల్వల్లో 77స్థానం లోకి పడిపోయిన భారత్ :

స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బి) వార్షిక బ్యాంకింగ్ గణాంకాలు 2019 వివరాఉ ఇటివల విడుదల చేసింది. తాజా ఎస్ఎన్బీ డేటా ప్రకారం భారత దేశం తన పౌరులు నిల్వ ఉంచిన డబ్బు విషయంలో మూడు స్థానాలను తగ్గించుకుని 77 స్థానానికి చేరుకుంది. అయితే ఈ జాబితాలో చాలా పొరుగు దేశాలు భారత దేశం కంటే తక్కువగా ఉన్నాయి. వాటి లో పాకిస్తాన్ 99 వ స్థానం,బంగ్లాదేశ్ 85వ స్థానం ,నేపాల్ 118 ,శ్రీలంక 148 ,మయన్మార్ 186 భూటాన్ 196 వ స్థానంలో ఉన్నాయి. భారత దేశానికి చెందిన శాఖలు స్విట్జర్ ల్యాండ్ ఆధారిత బ్యాంకులు విదేశీ ఖాతా దారులు అందరు పార్క్ చేసిన మొత్తం నిదులలో కేవలం 0.06 శాతం మాత్రమే . మొత్తం డిపాజిట్లలో 27 వాటాతో బ్రిటన్ ఈ జాబితాలో మొదటి స్థానం లో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్విస్ బ్యాంకు డబ్బు నిల్వల్లో 77స్థానం లోకి పడిపోయిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: జూన్ 28
నాసా ప్రదాన కార్యాయం కుమేరి డబ్ల్యు జాక్సన్ పేరుగా మార్పు :

నాసా అడినిస్త్రేటార్ జిమ్ బ్రిదేన్ స్టీన్ జూన్ 25 ఏర్పాటు చేసిన వాషింగ్టన్ డి.సి లో ని ఏజన్సీ ఓ ప్రధాన కార్యాలయ భవనానికి నాసాలో మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా ఇంజనీర్ మేరి డబ్ల్యు జాక్సన్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. జాక్సన్ తన నాసా లో తన వ్రుత్త్హిని వర్జేనియా లో ని హంప్తౌన్ లోని ఏజన్సీ యొక్క లంగ్లీ రీసర్చ్ సెంటర్ యొక్క వేరు చేయబడిన వెస్ట్ ఏరియ కంప్యూటింగ్ యూనిట్ లో ప్రారంబించబడింది. గణిత శాస్త్రవేత్త మరియు ఏరో స్పేస్ ఇంజేనీర్ అయిన జాక్సన్ నాసా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గణిత వృత్తిలోమహిళల నియామకం మరియు ప్రమోషన్‌ను ప్రభావితం చేసే కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. 2019 లో ఆమెకు మరణాంతరం కాంగ్రెస్ బంగారు పథకం లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాసా ప్రదాన కార్యాయం కు మేరి డబ్ల్యు జాక్సన్ పేరుగా మార్పు
ఎవరు: మేరి డబ్ల్యు జాక్సన్
ఎప్పుడు: జూన్ 28
వీర్ చక్ర అవార్డు గ్రహీత LDR పర్వేజ్ జమస్తి కన్నుమూత :

వీర చక్ర అవార్డు గ్రహీత స్క్వివ్ ఎల్డి ఆర్ రిటైర్డ్ పర్వేజ్ జమస్తి ఇటివల కన్నుమూశారు. అతను 1965 లో నియమించబడ్డాడు. మరియు 1985 లో పదవి విరమణ పొందాడు .1971 ఇండో పాకిస్తాన్ యుద్దంలో అయన ప్రదర్శించిన దైర్యసహసలకు వీర్ చక్రం పొందాడు. 1971 డిసెంబర్ లో పాకిస్తాన్ పై జరిగిన కార్యకలాపాలపై సమయంలో ప్లైట్ లెఫ్టి నెంట్ పర్వేజ్ రుస్తోం జమస్తి హెలికాఫ్టర్ యూనిట్ తో పని చేస్తున్నాడు. అతను ఎగిరిన అతని హెలికాఫ్టర్ రెండు సార్లు మెషిన్ గన్ మరియు రెండు సార్లు మోర్టార్ లచే దాడి చేయబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: వీర్ చక్ర అవార్డు గ్రహీత LDR పర్వేజ్ జమస్తి కన్నుమూత
ఎవరు: పర్వేజ్ జమస్తి
ఎప్పుడు: జూన్ 28
డేవిడ్ కప్ టెన్నిస్ టోర్నీని 2021 సంవత్సరానికి వాయిదా :

2020 సంవత్సరం నవంబర్ లో స్పెయిన్ లలో ని రాజదాని అయిన మాడ్రిడ్ లో జరగాల్సిన ప్రపంచ పురుషుల టీం టెన్నిస్ చాంపియన్ షిప్ డేవిస్ కప్ 2021 ఏడాదికి వాయిదా పడింది. కరోన వ్యాప్తి నేపద్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 నవంబర్ 22 నుంచి మాడ్రిడ్ వేదికగా డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్ జరగనుందని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) జూన్ 26 తెలిపింది. 2020 ఏడాది ఫైనల్స్ టోర్నీలో తలపడాల్సిన 18 టీం లు 2021 సంవత్సరం ఫైనల్స్ లో ఆడతాయి. 2020 సెప్టెంబర్ లో జరగాల్సిన వరల్డ్ గ్రూప్-1 ,వరల్డ్ గ్రూప్-2 మ్యాచ్ లు వచ్చే ఏడాది మార్చి లేదా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డేవిడ్ కప్ టెన్నిస్ టోర్నీని 2021 సంవత్సరానికి వాయిదా
ఎప్పుడు: జూన్ 28
వైఎస్సార్ కాపు నేస్తం అనే పథకం ప్రారంబించిన అందరప్రదేశ్ ప్రభుత్వం :

ఆంధ్రప్రదేశ్ లో ని కాపు ,బలిజ ,తెలగ,ఒంటరి ఉప కులాలకు మహిళల జీవన ప్రమాణాలు పెంపు ఆర్ధిక స్వావలంబన ఉపాధి మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రారంబమైంది. జూన్ 24న సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంబించారు,కాపు నేస్తం పథకం కింద ఒక్కొకోరికి దాదాపు 2.36 లక్షల మంది కాపు మహిళలకు ఒక్కొకోరికి ఖాతాలో రూ.15 వేల చొప్పున సుమారు రూ.354 కోట్లు అయన చేతుల మీదుగా జమ చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వైఎస్సార్ కాపు నేస్తం అనే పథకం ప్రారంబించిన అందరప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఎక్కడ: అందరప్రదేశ్
ఎప్పుడు: జూన్ 28
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |