Daily Current Affairs in Telugu 28-04-2021

Daily Current Affairs in Telugu 28-04-2021

RRB Group d Mock test

టైమ్ మేగజైన్-100లో  అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో తొలిసారి రెండు భారతీయ సంస్థలకు చోటు :

ప్రతిష్టాత్మక టైమ్ మేగజైన్ ప్రకటించిన 100 అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో  తొలిసారి రెండు భారతీయ సంస్థలకు చోటు దక్కింది. అందులో ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం సాంకేతిక కంపెని జియో ప్లాట్ ఫాం  కాగా మరొకటి ఈ లెర్నింగ్ యాప్  బైజూస్ ఈ లిస్ట్ లో  స్థానం సంపాదించుకున్నాయి. ఆరోగ్యం, వినోదం, రవాణా, సాంకేతికత విద్య తో  సహా పలు రంగాల నుంచి నామినేషన్లు ఆహ్వానించిన టైమ్  ఈ సంస్థలను ఎంపిక. చేసింది.  ఇందులో జూమ్, టిక్టాక్, ఐకియా, నెట్లెక్స్ వంటి విదేశీ కంపెనీలు ఉన్నాయి.

క్విక్ రివ్యు :      

ఏమిటి: టైమ్ మేగజైన్-100లో  అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో తొలిసారి రెండు భారతీయ సంస్థలకు చోటు

ఎవరు: జియో ప్లాట్ఫామ్స్, బైజూస్

ఎప్పుడు: ఏప్రిల్  28

స్లోన్ మెమోరియల్ కేట్టేరింగ్ కేన్సర్ సెంటర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా  కిరణ్ మజుందార్ షా నియామకం :

కేన్సర్ చికిత్సలో పరిశోదన లో ప్రపంచం లోనే అగ్రగామి సంస్థ అయిన యు.ఎస్  లోని స్లోన్ మెమోరియల్ కేట్టేరింగ్ కేన్సర్ సెంటర్ బోర్డులో ట్రస్టీ గా బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా నియమితులయ్యారు. ఈ బోర్డులో ని 52మంది ట్రస్టీ లో ఆమె ఒకరు. మూడేళ్ళ పాటు ఈ పదవిలో ఉంటారు. మనదేశం నుంచి ఈ ప్రతిష్టాత్మకమైన హోదాకు ఎంపిక అయిన తొలి మహిళా గా ఈమె కావడం విశేషం. స్లోన్ మెమోరియల్ కేట్టేరింగ్ కేన్సర్ సెంటర్ దాదాపు 120 పైగా పరిశోధన సంస్థ లతో కలిసి పని చేస్తుంది.

 క్విక్ రివ్యు :

ఏమిటి: స్లోన్ మెమోరియల్ కేట్టేరింగ్ కేన్సర్ సెంటర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా  కిరణ్ మజుందార్ షా నియామకం

ఎవరు: కిరణ్ మజుందార్ షా

ఎప్పుడు: ఏప్రిల్  28

సిప్రి మిలిటరీ ఎక్సెండిచర్ డేటాబేస్’ 2020 డేటా ప్రకారం ప్రపంచంలో అత్యంత సైనిక వ్యయం కలిగిన దేశంగా అమెరికా దేశం :

సిప్రి మిలిటరీ ఎకస్పెండిచర్ డేటాబేస్’ అనే కొత్త డేటా ప్రకారం 2020 లో  ప్రపంచంలో అత్యంత సైనిక వ్యయం కలిగిన దేశంగా అమెరికా దేశం నిలిచింది. రెండవ స్థానంలో చైనా దేశం నిలిచింది.  కాగా భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సైనిక ఖర్చుచేసే దేశంగా నిలిచింది. దీనిని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) ప్రచురించింది . కాగా ఇందులో టాప్ 5 దేశాల జాబితా:

 1.యునైటెడ్ స్టేట్స్ ($778 బిలియన్)

2.చైనా ($252 బిలియన్)

3.భారత్ ($72.9బిలియన్ )

4.రష్యా ($61.7 బిలియన్)

5. యునైటెడ్ కింగ్డమ్ ($59.2 బిలియన్)

క్విక్ రివ్యు :

ఏమిటి: ‘సిప్రి మిలిటరీ ఎక్సెండిచర్ డేటాబేస్’ 2020 డేటా ప్రకారం ప్రపంచంలో అత్యంత సైనిక వ్యయం కలిగిన దేశంగా అమెరికా దేశం

ఎవరు: అమెరికా దేశం

ఎప్పుడు: ఏప్రిల్  28

‘తేజస్’ అమ్ముల పొదిలో విజయవంతంగా చేరిన  పైథాన్-5 క్షిపణి :

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ అమ్ములపొదిలో మరో అత్యాధునిక అస్త్రం చేరింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే (ఏఏఎం) ఐదో తరం క్షిపణి ‘పైథాన్-5’ని తేజస్ నుంచి ఏప్రిల్ 28 న గోవాలో విజయవంతంగా పరీక్షించారు. అత్యంత కఠిన సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో  వేగంగా దూసుకెళ్తున్న  లక్ష్యాన్ని ఈ క్షిపణి వంద శాతం కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)  ఏప్రిల్ 28 న ఒక ప్రకటనలో వెల్లడించింది. తేజస్ నుంచి పైథాన్-5 క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి.

క్విక్ రివ్యు :

ఏమిటి: ‘తేజస్’ అమ్ముల పొదిలో విజయవంతంగా చేరిన  పైథాన్-5 క్షిపణి

ఎవరు: డీఆర్డీవో

ఎక్కడ:గోవా  

ఎప్పుడు: ఏప్రిల్  28

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ కోచ్ నువాన్ జొయ్స పై నిషేధం విధింపు  :

మ్యాచ్ ఫిక్సి౦గ్స్ కు   ప్రయత్నించాడనే కారణంతో శ్రీలంక మాజీ పేసర్, కోచ్ నువాన్ జొయ్సపై  ఐసీసీ ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ ఆరోపణలతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించిన 2018, అక్టోబర్ 31 నుంచే  ఈ శిక్ష అమల్లోకి వస్తుందని ఐసీసీ ఏప్రిల్ 28 న ప్రకటించింది. 2017లో శ్రీలంక బౌలింగ్ కోచ్ గా ఉన్న సమయంలో అతను భారత బుకీగా అనుమానిస్తున్న వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ఒక శ్రీలంక ఆటగాడిని అడిగాడు. కానీ అందుకు ఆ ఆటగాడు ఒప్పుకో లేదు. అదే ఏడాది యూఏఈలో జరిగిన టీ10 లీగ్ లో పాల్గొన్న శ్రీలంక జట్టుకు బౌలింగ్ కోచ్ గా  ఉన్న సమయంలోనూ అవినీతి వ్యతిరేక నిబంధనలను ఉల్లంఘించాడు. ‘జాతీయ కోచ్ గా  పనిచేసిన నువాన్ ఓ ఆదర్శప్రాయుడిగా నిలవాల్సింది పోయి ఆటకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. మ్యాచ్ ఫిక్సింగ్స్ కు  ప్రయత్నించడమంటే క్రీడా విలువలకు ద్రోహం చేయడమే అని అలాంటి తప్పును ఉపేక్షించేది లేదు”అని ఐసీసీ తెలిపింది. 42 ఏళ్ల ఈ క్రికెటర్ శ్రీలంక జట్టు  తరపున 30 టెస్టులు, 95 వన్డేలాడాడు

క్విక్ రివ్యు :

ఏమిటి: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ కోచ్ నువాన్ జొయ్స పై నిషేధం విధింపు  

ఎవరు: నువాన్ జొయ్య

ఎక్కడ: శ్రీలంక

ఎప్పుడు: ఏప్రిల్  28

చందమామ పై తొలి సారి పాదం మోపడం లో పాల్గొన్న ఆస్ట్రోనాట్ మైకేల్ కోలిన్స్  కన్నుమూత

చందమామపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన అపూర్వ ఘట్టంలో కీలక పాత్రధారుల్లో ఒకరైన అపోలో 11 వ్యోమనౌక సారథి మైఖేల్ కొలిన్స్ ఏప్రిల్ 28 న కన్నుమూసారు. ఈయన  అపోలో -11 వ్యోమనౌక  పైలట్ గా  వ్యవహరించారు. అందులో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆన్లింద్ర ,లూనార్ ల్యాండర్. తొలి సారి చందమామ పై పాదం మోపారు. ఆ సమయంలో కొలిన్స్  చందమామ ఉపరితలానికి 69 కి.మీ. దూరంలో అపోలో11 కమాండ్ మాడ్యుల్ లో ఉండిపోయారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్డ్రిన్ తిరిగి చందమామ కక్ష్యలోకి చేరుకున్న తర్వాత వారి స్పేస్ క్రాఫ్త్ ను  తానున్న స్పేస్ క్రా ఫ్ట్ లో  అనుసంధానించి, క్షేమంగా భూమికి తీసు కురావడంలో కొలిన్స్ అమోఘమైన పాత్రను నిర్వహించారు. జాబిల్లిపై పాదం మోపే అవకాశం తనకు రానందుకు ఎన్నడూ తాను బాధ పడలేదని, చంద్రగ్రహంపైకి మానవుని యాత్రను   విజయవంతం చేయడంలో తాను నిర్వహించిన పాత్ర తనకు సంపూర్ణమైన సంతృప్తినిచ్చిందని 1974లో ప్రచురితమైన తన ఆత్మకథ ‘క్యారి యింగ్ ద ఫైర్ లో కొలిన్స్ పేర్కొన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: చందమామ పై తొలి సారి పాదం మోపడం లో పాల్గొన్న ఆస్ట్రోనాట్ మైకేల్ కోలిన్స్  కన్నుమూత

ఎవరు: మైకేల్ కోలిన్స్ 

ఎప్పుడు: ఏప్రిల్  28

ప్రముఖ భాషా రచయిత మనోజ్ దాస్ కన్నుమూత :

ప్రముఖ ఓడియా  భాషా రచయిత మనోజ్ దాస్ ఏప్రిల్ 27న  పుదుచ్చేరిలో కన్నుమూశారు. ఆయన వయసు 87సంవత్సరాలు . 1934 లో ఒడిశాలో జన్మించిన ఆయన ఒడియా మరియు ఆంగ్ల సాహిత్యంలో  రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారు. అతను భారతదేశపు ఉత్తమ కథకులలో ఒకరిగా గుర్తించబడ్డాడు. అతను శ్రీ అరబిందో పురస్కార్ ను, సాహిత్య అకాడమీ అవార్డు (1972), ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డు, సరలా అవార్డు, సాహిత్య భారతి అవార్డు ను , మరియు బాపాసి (పుస్తక – అమ్మకందారుల మరియు ప్రచురణకర్తల సంఘం ఆఫ్ సౌత్ ఇండియా) అవార్డ్ తో పాటు   2000 లో సరస్వతి సమ్మాన్  పురస్క్రారం ను కూడా అందుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ భాషా రచయిత మనోజ్ దాస్ కన్నుమూత

ఎవరు: మనోజ్ దాస్

ఎక్కడ:ఓడిశా

ఎప్పుడు: ఏప్రిల్  28

AP Economy Survey  2019-2020

Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-03- 2021
Daily current affairs in Telugu 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03-2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021
Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 02-02- 2021
Daily current affairs in Telugu 03-02- 2021
Daily current affairs in Telugu 04-02- 2021
Daily current affairs in Telugu 05-02- 2021
Daily current affairs in Telugu 06-02- 2021
Daily current affairs in Telugu 07-02- 2021
Daily current affairs in Telugu 08-02- 2021
Daily current affairs in Telugu 09-02- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 11-02- 2021
Daily current affairs in Telugu 12-02- 2021
Daily current affairs in Telugu 13-02- 2021
Daily current affairs in Telugu 14-02- 2021
Daily current affairs in Telugu 15-02- 2021
>Daily current affairs in Telugu 16-02- 2021
Daily current affairs in Telugu 17-02- 2021
Daily current affairs in Telugu 18-02- 2021
Daily current affairs in Telugu 19-02- 2021
Daily current affairs in Telugu 20-02- 2021
Daily current affairs in Telugu 21-02- 2021
Daily current affairs in Telugu 22-02- 2021
Daily current affairs in Telugu 23-02- 2021
Daily current affairs in Telugu 24-02- 2021
Daily current affairs in Telugu 25-02- 2021
Daily current affairs in Telugu 26-02- 2021
Daily current affairs in Telugu 27-02- 2021
Daily current affairs in Telugu 28-02- 2021
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *