
Daily Current Affairs in Telugu 28-02-2022
ఏటిపి ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన రష్యా ఆటగాడు మెద్వెదేవ్ :

రష్యా టెన్నిస్ అతగాడు డానియల్ మెద్వెదేవ్ ప్రపంచ నంబర్ వన్ గా ఎదిగాడు. ఫిబ్రవరి 28 న విడుదల చేసిన ఏటిపి ర్యాంకింగ్ లో అతడికి అగ్రస్థా నం లబించింది. పురుషుల టెన్నిస్ లో నంబర్ వన్ అయిన 27 వ ఆటగాడు ఇతడు. 20 గ్రాండ్ స్లాం లో టైటిల్ ల విజేతగా నిల్చిన జకోవిచ్ ను మెద్వెదేవ్ వెనక్కి నెట్టాడు.ఫెదరర్ ,నాదల్ ,జకోవిచ్ ముర్రే కాకుండా గత 18 ఏళ్ల నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న తొలి ఆటగాడిగా మెద్వెదేవ్ నిలిచారు. కఫెల్నికో ,సఫిన్ తర్వాత ప్రపంచ నంబర్ వన్ అయిన మూడో రష్యా టెన్నిస్ ఆటగాడిగా మెద్వెదేవ్నిలిచారు .
- రష్యా దేశ రాజధాని :మాస్కో
- రష్యా దేశ కరెన్సీ : క్రెమ్లిన్
- రష్యా దేశ అద్యక్షుడు : వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏటిపి ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన రష్యా ఆటగాడు మెద్వెదేవ్
ఎవరు: రష్యా ఆటగాడు మెద్వెదేవ్
ఎప్పుడు: ఫిబ్రవరి 28
పంజాబ్ కింగ్స్ సారదిగా మయాంక్ అగర్వాల్ ఎంపిక :

ఈ 2022 ఐపిఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ సారధిగా మయాంక్ అగర్వాల్ వ్యవహరించనున్నాడు .జట్టును మయాంక్ నడిపించబోతున్నట్లు ఫిబ్రవరి 28 న పంజాబ్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. 2018 నుంచి పంజాబ్ తో ఉన్న జట్టుకు కు ఆడటాన్ని చాలా ఆస్వాదించా ఇపుడు సారద్యం వహించబోతుండడం మంచి అవకాశంగా భావిస్తున్న ఈ సీజన్ లో జట్టులో ఉన్న ప్రతిభావంతులు నా పనిని మరింత సులభతరం చేస్తారని భావిస్తున్న అని తెలిపాడు. కాగా ప్రస్తుతం ఈ జట్టుకు కోచ్ గా అనిల్ కుంబ్లే గారు ఉన్నారు. గతంలో వైస్ కెప్టెన్ గా పని చేసిన మయాంక్ రెగ్యులర్ కెప్టెన్ కెఎల్ రాహుల్ గైర్హాజరీ లో అయిన సమయంలో కొన్ని మ్యాచ్ లో పంజాబ్ ను నడిపించాడు.ఇప్పటి వరకు కెప్టెన్ గా రాహుల్ 2022 సీజన్ కు లఖ్ నవు సూపర్ జెయింట్స్ కు సారద్యం వహించనున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పంజాబ్ కింగ్స్ సరదిగా మయాంక్ అగర్వాల్ ఎంపిక
ఎవరు: మయాంక్ అగర్వాల్
ఎప్పుడు: ఫిబ్రవరి 28
1,600 కోట్లతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం :

దేశవ్యాప్తంగా రూ.1,600 కోట్లతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రరంగ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) అమలు చేస్తుంది. ఈ పథకం ఐదేండ్ల పాటు అమలు అవుతుంది. ఏబీడీఎం కింద పౌరులు ఆయుష్మాన్ భారత్ అకౌంట్లు తెరచి తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను లింక్ చేయవచ్చు. నాన్-లింకేజీ బొగ్గు వేలాన్ని ఆయా రంగాలవారీగా వేలం వేయకు౦డా కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీన్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసే ఈ -ఆక్షన్ విండో ద్వారా వేలం వేస్తాయి. బొగ్గు కంపెనీలు వివిధ రంగాలకు విచక్షణ మేరకు బొగ్గును కేటాయించే విధానాన్ని రద్దుచేశారు. దీంతో అన్నిరంగాలకు ఒకేధరకు బొగ్గు లభిస్తుందని, దీనిద్వారా బొగ్గుకు డిమాండ్ పెరుగుతుందని కేంద్రం అంటున్నది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 1,600 కోట్లతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎప్పుడు: ఫిబ్రవరి 28
సెబి చైర్మన్ గా మాధవి పూరి బచ్ నియామకం :

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొత్త చైర్పర్సన్ గా మాధవి పురి బచ్ (57) నియమితులయ్యారు. మార్కెట్ నియంత్రణాధికార సంస్థ పగ్గాలు చేపట్టబోతున్న తొలి మహిళ ఈమె. సెబీలో తొలి పూర్తికాల సభ్యురాలిగా చేరిన బచ్. ప్రైవేటు రంగం నుంచి సెబీలో పనిచేస్తున్న తొలి వ్యక్తి కూడా. చైర్పర్సన్ మూడేళ్ల కాలానికి మాదవి నియమితులైనట్లు ఆర్థికశాఖ వర్గాలు ‘తెలిపాయి. ఈ నియామకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది. సెబీ ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం (ఫిబ్రవరి 28)తో ముగిసింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి త్యాగి(63) 2017 మార్చి 1న మూడేళ్ల కాలానికి సెబీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. తొలుత 6 నెలలు, ఆ తర్వాత 18 నెలల ఆయన పదవిల్ కాలం పొడగించారు.
- సెబి స్థాపన :1992
- సెబి పూర్తి రూపం : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- సెబి ప్రదాన కార్యాలయం : ముంబాయ్
- సెబి ప్రస్తుత చైర్మన్ : మాధవి పూరి బచ్ (మాజీ ) అజయ్ త్యాగి
క్విక్ రివ్యు :
ఏమిటి: సెబి చైర్మన్ గా మాధవి పూరి బచ్ నియామకం
ఎవరు: మాధవి పూరి బచ్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 28
జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28 :

దేశాబివ్రుద్దికి శాస్త్రవేత్తలు చేసిన కృషికి గాను వాటిని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినం గా జరుపుకుంటున్నారు. ఈ రోజున 1928 లో భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఐన చంద్రశేఖర్ వెంకటరామన్ స్పెక్త్రో స్కోపి రంగం లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణను ఆయన చేసారు. దానికి గాను ఆయన రామన్ గారి పేరు మీదుగానే రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు.ఆటను చేసిన కృషికి సివి రామన్ గారికి భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక అవార్డు ఐన నోబెల్ బహుమతి లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28
ఎవరు: సివి రామన్
ఎప్పుడు: ఫిబ్రవరి 28
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |