Daily Current Affairs in Telugu 27 September -2022
గూగుల్ ఇండియాలో , పబ్లిక్ పాలసీ హెడ్ గా ఉన్న అర్చన గులేటి రాజీనామా :

గూగుల్ ఇండియాలో ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్ గా ఉన్న అర్చన గులేటి గారు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐదు నెలల క్రితమే గూగుల్ ఇండియాలో చేరాడు. అంతకుముందు నీతి ఆయోగ్ సంయుక్త కార్యదర్శిగా (డిజిటల్ కమ్యూనికేషన్) పనిచేశారు. గూగుల్ పదవికి ఆమె ఎందుకు రాజీనామా చేశారనే విషయం వెల్లడి రాలేదు. భారత్ లో పలు యాంటీ ట్రస్ట్ రేసులను గూగుల్ ఎదుర్కొంటున్న ఇలాంటి తరుణంలో గులేటి రాజీనామా చేయడ౦ గమనార్హం.
క్విక్ రివ్యు :
ఏమిటి : గూగుల్ ఇండియాలో , పబ్లిక్ పాలసీ హెడ్ గా ఉన్న అర్చన గులేటి రాజీనామా
ఎవరు : అర్చన గులేటి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఫిడె ప్రపంచ క్యాడెట్స్ చెస్ ఛాంపియన్షిప్స్ లో టైటిల్ సాధించిన శుభి గుప్తా, చార్వా :

ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత ప్లేయర్లు సత్తా చాటారు. ఫిడె ప్రపంచ క్యాడెట్స్ చెస్ ఛాంపియన్షిప్స్ సెప్టెంబర్ 27న శుభి గుప్తా, చార్వి టైటిళ్లు దక్కించుకున్నారు. బాలికల అండర్-12 విభాగంలో 11 రౌండ్ల నుంచి 5 పాయింట్లు సాధించిన శుబి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అండర్-8 విభాగంలో 9.5 పాయింట్లతో చార్వి ఛాంపియన్ నిలిచింది. 11 రౌండ్లు ముగిసేసరికి బోధన శివానందన్ (ఇంగ్లాండ్) తో కలిసి సమంగా నిలిచిన ఆమె మెరుగైన టైబ్రేకర్ స్కోరుతో టైటిల్ ఖాతాలో వేసుకుంది. అండర్-8 బాలుర విభాగంలో సఫీన్ సఫరుల్లాఖాన్ 9 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన మార్క్ (ఫ్రాన్స్), రోమన్ (రష్యా) కంటే అతను కేవలం 0.5 పాయింట్ లతో వెనకబడ్డాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫిడె ప్రపంచ క్యాడెట్స్ చెస్ ఛాంపియన్షిప్స్ లో టైటిల్ సాధించిన శుభి గుప్తా, చార్వా
ఎవరు : శుభి గుప్తా, చార్వా
ఎప్పుడు : సెప్టెంబర్ 27
2020 ఏడాదికిగాను దాదాసాహెబ్ పురస్కారం అవార్డును గెలుచుకున్న ఆశా పరేఖ్ :

1960-70 దశకాల్లో హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక ఆశా పరేఖ్. అలనాటి ఈ సౌందర్యరాశి సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే ఆవార్డును 2020 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1942లో జన్మించిన ఆశా పరేఖ్. 1952లో అస్మాన్ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కథానాయికగా నటించిన తొలిచిత్రం ‘దిల్ జేకే చేలో’ (1950) మనవిజయం సాధింనదిగా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘జబ్ ప్యార్ డిసీసే హోతా హై షేర్ వహీ దిల్ లాయాహూ, కడి పతంగ్ లాంటి చిత్రాలతో స్టార్ కథానాయికగా ఎదిగారు. ఆమె నటించిన దాదాపు వంద సినిమాల్లో ఆద్యంతం విజయవంతమైనవే ఇరవైకి పైగా చిత్రాలు సిల్వర్ గోల్డెస్ జుబ్లీలు ఆడటంతో ఆమెను `జూబ్లీ గర్ల్ అని పిలిచేవారు. హిందీ చిత్రాలే కాదు. మాతృభాష అయిన గుజరాతీతోపాటు కన్నడ, పంజాబీ భాష ల్లోనూ నటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2020 ఏడాదికిగాను దాదాసాహెబ్ పురస్కారం అవార్డును గెలుచుకున్న ఆశా పరేఖ్
ఎవరు : ఆశా పరేఖ్
ఎప్పుడు : సెప్టెంబర్ 27
VSHORADS క్షిపణి ని విజయవంత౦గా ప్రయోగించిన డి.ఆర్.డి.వో :

డి.ఆర్.డి.వో VSHORADS అనే క్షిపణి యొక్క విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించింది. డి.ఆర్.డి.వో 27న సెప్టెంబర్ 2022న ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో చాలా షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. VSHORADS అనేది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (MANPAD) డి.ఆర్.డి.వో యొక్క హైదరాబాద్ ఆధారిత రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) ద్వారా స్వదేశీంగా రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది.
- ‘ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఛైర్మన్: డాక్టర్ సమీర్ వి కామత్
క్విక్ రివ్యు :
ఏమిటి : VSHORADS క్షిపణి యొక్క విజయవంత౦గా ప్రయోగించిన డి.ఆర్.డి.వో
ఎవరు : డి.ఆర్.డి.వో
ఎప్పుడు : సెప్టెంబర్ 27
‘దివ్యాంగజన్’ ల కోసం 497 రైల్వే స్టేషన్ లను ఏర్పాటు చేయనున్న భారత రైల్వే :

భారతీయ రైల్వే 497 స్టేషన్లను ‘దివ్యాంగజన్’ స్నేహపూర్వకంగా చేసింది. భారతీయ రైల్వేలు ‘సుగమ్య భారత్ అభియాన్’ అనే పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో లిఫ్ట్‌లు మరియు ఎస్కలేటర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా 497 రైల్వే స్టేషన్‌లను దివ్యాంగులు,వృద్ధులు మరియు పిల్లలకు స్నేహపూర్వకంగా మార్చారు. ఇప్పటివరకు, 339 స్టేషన్లలో 1,090 ఎస్కలేటర్లు ఆగస్టు 2022 వరకు అందించబడ్డాయి. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ (సుగమ్య భారత్ అభియాన్)ని డిసెంబర్ 3, 2015 (ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భం గా ప్రధాని మోదీ ప్రారంభించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘దివ్యాంగజన్’ ల కోసం 497 రైల్వే స్టేషన్ లను ఏర్పాటు చేయనున్న భారత రైల్వే
ఎవరు : భారత రైల్వే
ఎప్పుడు : సెప్టెంబర్ 27
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |