Daily Current Affairs in Telugu 27-07-2021
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారతీయ ప్రాచీన ప్రాంతానికి చోటు :

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో మరో భారతీయ ప్రాచీన ప్రాంతానికి చోటు దక్కింది. 5 వేల సంవత్స రాలకు పూర్వం హరప్పా నాగరికత కాలంలో ఆధునిక నగరంగా విరాజిల్లిన.. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న ధోలా వీరాకు ఈ గుర్తింపు ఇస్తున్నట్టు యునెస్కో మంగళవారం ప్రకటించింది. తెలంగాణలోని 13 శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ రామప్ప ఆలయా నికి ఇటీవలే ఈ జాబితాలో చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ధోలా వీరాతో కలిపి భారత్ నుంచి యునెస్కో జాబి తాలో చేరిన చారిత్రక ప్రాంతాలు 40కి చేరాయని కేంద్ర సాంస్కృ తిక మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. ధోలావీరాకు యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతమంటూ ఆ ఫొటోలను ట్విటర్లో పోస్టు చేశారు. ధోలావీరాకు తాజా గుర్తింపు దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారతీయ ప్రాచీన ప్రాంతానికి చోటు
ఎవరు: ధోలా వీరాకు
ఎక్కడ: గుజరాత్ లోని
ఎప్పుడు: జలై 27
ఒలింపిక్స్ లో స్వర్ణంతో సరికొత్త రికార్డు సృష్టించిన బెర్ముడా దేశం :

అట్లాంటిక్ సముద్రంలోని ద్వీపమైన బెర్ముడా దేశ జనాభా కేవలం 65 వేలు మాత్రమే. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో ప్రధాన స్టేడియాన్ని వాళ్లతో నింపేసినా ఇంకా ఖాళీ స్టాండ్స్ కనిపిస్తాయి. అంత చిన్న దేశమైన బెర్ముడా ఈ ఒలింపిక్స్లో స్వర్ణంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విశ్వ క్రీడలచరిత్రలోనే పసిడి సాధించిన అతి చిన్న (జనాభా పరంగా) దేశంగా నిలిచింది. మహిళల ట్రయథాన్లో చాంపియన్ నిలిచిన ఫ్లోరా డఫ్పీ ఆ దేశానికి తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించింది. టోక్యోకు ముందు 1976 క్రీడల్లో ఆ దేశ బాక్సర్ క్లారెన్స్ కాంస్యం గెలిచాడు. 13 లక్షల జనాభా మాత్రమే ఉండే ఐరోపా లోని దేశం ఇస్తోనియా కూడా టోక్యోలో స్వర్ణాన్ని ముద్దాడింది
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒలింపిక్స్ లో స్వర్ణంతో సరికొత్త రికార్డు సృష్టించిన బెర్ముడా దేశం
ఎవరు: బెర్ముడా దేశం
ఎక్కడ: టోక్యో ఒలింపిక్స్
ఎప్పుడు: జలై 27
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా నాసిర్ కమల్ నియామకం :

ఉత్తరప్రదేశ్ కేడర్ యొక్క 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి నాసిర్ కమల్, 2022 జూలై 31 న తన పర్యవేక్షణ వరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. బిసిఎఎస్ ఒక విభాగం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పౌర విమానయాన భద్రతను చూసుకుంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా నాసిర్ కమల్ నియామకం
ఎవరు: నాసిర్ కమల్
ఎప్పుడు: జలై 27
సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనున్న భారత్ రష్యా దేశాలు :

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా భారత్ రష్యాలు 13 రోజుల పాటు సంయుక్తంగా భారీ సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. ఆగస్టు 1 నుంచి 13 వరకు రష్యాలోని వోల్గానది పశ్చిమతీరాన ఉన్న వోల్టాగ్రాడ్ నగరంలో వీటిని చేపట్టనున్నట్టు భారత సైన్య జులై27న వెల్లడించింది. ‘ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఈ 12వ ఎడిషన్ ఇంద్ర విన్యాసాల మైలురాయిగా నిలుస్తాయి. ఉభయ దేశాల చారిత్రాత్మక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడతాయి. ఒక్కో దేశం తరఫున 250 మంది సైనిక సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. భారత్, రష్యా సైన్యాలు పరస్పర విస్వాసం, సామర్ధ్యా లను పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదప డుతుంది” అని భారత్ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది
క్విక్ రివ్యు :
ఏమిటి: సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనున్న భారత్ రష్యా దేశాలు
ఎవరు: భారత్ రష్యా దేశాలు
ఎప్పుడు: జలై 27
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |