
Daily Current Affairs in Telugu 27-04-2021
హెలికాప్టర్ ఇంజన్లలో ఉపయోగించే సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను అభివృద్ధి చేసిన డి.ఆర్.డి.వో :

డి.ఆర్.డి.వో సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీని ఇటీవల అభివృద్ధి చేసింది మరియు హెలికాప్టర్ ఇంజిన్ అప్లికేషన్ కోసం వారి స్వదేశీ హెలికాప్టర్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ 60 బ్లేడ్లను HAL కి సరఫరా చేసింది.అని పేర్కొంది. డి.ఆర్.డి.వో మొత్తం ఐదు సెట్లు (300 బ్లేడ్లు) సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను అభివృద్ధి చేస్తుంది. ఒక సెట్ కు (60 బ్లేడ్లు) హెచ్ఏఎల్కు పంపిణీ చేయగా, మిగిలిన నాలుగు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి అని డి.ఆర్.డి.వో ప్రకటనలో తెలిపింది. ఈ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీని డి.ఆర్.డి.వో యొక్క ప్రయోగశాలలలో ఒకటైన డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL) అభివృద్ధి చేసింది. యుఎస్, యుకె, ఫ్రాన్స్ మరియు రష్యా వంటి కొన్ని దేశాలు సింగిల్ క్రిస్టల్ భాగాలను రూపొందించి మరియు తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రకటన తెలిపింది
క్విక్ రివ్యు :
ఏమిటి: హెలికాప్టర్ ఇంజన్లలో ఉపయోగించే సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను అభివృద్ధి చేసిన డి.ఆర్.డి.వో
ఎవరు: డి.ఆర్.డి.వో
ఎప్పుడు: ఏప్రిల్ 27
గ్లోబల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా డేవిడ్ బెక్హం :

డేవిడ్ రాబర్ట్ జోసెఫ్ బెక్హాం OBE ఒక ఆంగ్ల మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు.ఈయన యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హాం గ్లోబల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా గ్లోబల్ టీకాల డ్రైవ్‌కు నాయకత్వం వహించడానికి యునిసెఫ్ అనే ఛారిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను తమ పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుండి టీకాలు వేయిoకోవడాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న కొవిడ్-19లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తు తల్లిదండ్రులు తమకు తాము టీకాలు వేయించుకోవాలని ప్రోత్సహిస్తారు. తద్వారా వారు సురక్షితంగా ఉంటారు. డిఫ్తీరియా, మీజిల్స్, పోలియో వంటి వ్యాధుల నుండి రక్షించడానికి తమ పిల్లలకు టీకాలు వేయించాలని నిర్ధారించుకోవాలని ఆయన కుటుంబాలను కోరారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్లోబల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా డేవిడ్ బెక్హం
ఎవరు: డేవిడ్ బెక్హం
ఎప్పుడు: ఏప్రిల్ 27
బహిరంగ బురఖాలు ధరించడాన్ని నిషేధించిన శ్రీలంక :

బహిరంగ ప్రదేశాల్లో ముఖాలకు ముసుగులు ధరించడా నిషేధిస్తూ శ్రీలంక మంత్రి మండలి ఏప్రిల్ 27న తీర్మానించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 2019లో ఈస్టర్ రోజున, నేషనల్ తావీద్ జమాత్ ఆత్మా హుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు.. చర్చిలు, హోటళ్లపై వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. వీటి ధాటికి దేశంలో మొత్తం 270 మంది చనిపోగా, సుమారు 500 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు ముసుగులు ధరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో ముఖాన్ని పూర్తిగా కప్పే ముసుగులు ధరించరాదన్న నోట్ పైన ప్రజాభద్రత శాఖ మంత్రి శరత్ వీరశేఖర గత నెలలో సంతకం చేశారు. దీనిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాన్ని పార్ల మెంటు ఆమోదిస్త. ఇది చట్టంగా కూడా మారుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బహిరంగ బురఖాలు ధరించడాన్ని నిషేధించిన శ్రీలంక
ఎవరు: శ్రీలంక ప్రభుత్వం
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు: ఏప్రిల్ 27
బార్సిలోనా ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన రాఫెల్ నాదల్ :

బార్సిలోనా ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్లో స్పెయిన్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 25న జరిగిన ఫైనల్లో నాదల్ 6-4, 6-7 (6/8), 7– 5తో ప్రపంచ ఐదో ర్యాంకర్ స్టెఫనో సిట్సిపాస్ (గ్రీస్) పై నెగ్గాడు. దాంతో బార్సిలోనా టైటిల్ ను నాదల్ 12వసారి గెలుచుకున్నట్లయింది. నాదల్ తొలిసారి 2005లో ఈ టైటిల్ ను గెలుచుకున్నాడు. కాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ (13) తర్వాత అతను ఎక్కువ సార్లు గెలిచిన టోర్నీ ఇదే.
క్విక్ రివ్యు :
ఏమిటి: బార్సిలోనా ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన రాఫెల్ నాదల్
ఎవరు: రాఫెల్ నాదల్
ఎప్పుడు: ఏప్రిల్ 27
ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూత :

ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం ఇటీవల కన్నుమూసారు. ఈయన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన కృషి విశేషమైనది. అతను DRDO, DAE మరియు IDSA వంటి సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాడు. విజయవంతమైన 1998 అణు పరీక్షలలో అతని పాత్ర కూడా ఉంది. డాక్టర్ సంతానం అణు శాస్త్రవేత్త గా మరియు పోఖ్రాన్ -2 పరీక్షల సమయంలో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) యొక్క ఫీల్డ్ డైరెక్టర్ గా పని చేసారు. ఆయనకు 1999 లో పద్మ భూషణ్ అవార్డు కూడా లభించింది. డాక్టర్ కృష్ణమూర్తి సంతానంగురించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ దేశంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది అని విజయవంతమైన 1998 అణు పరీక్షలలో శాస్త్రవేత్త పాత్ర గమనార్హం అని రక్షణ మంత్రి చెప్పారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూత
ఎవరు: కృష్ణమూర్తి సంతానం
ఎప్పుడు: ఏప్రిల్ 27
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |