Daily Current Affairs in Telugu 26-04-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 26-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

నాసా నుండి పంపబడి 30ఏళ్లు పూర్తి చేసుకున్న హబుల్ టెలిస్కోప్ :

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2020 నాటికి ఏప్రిల్ 25 నాటికి ఈ టెలిస్కోప్ పంపి ఇప్పటికి 30వ సంవత్సరాలు అవుతుంది. ఈ టెలిస్కోప్ ను యురోపియన్ స్పేస్ ఏజన్సీ (ఇసా) సహకారంతో యునైటెడ్ స్టేట్స్ అంతరిక్ష సంస్థ  అయిన (NASA )నాసా నిర్మించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : నాసా నుండి పంపబడి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హాబుల్ టెలిస్కోప్

ఎవరు : నాసా

ఎప్పుడు : ఏప్రిల్ 26

ప్రపంచ రోగ నిరోధక వారోత్సవంగా  2020 ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు :

వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2020 ను ఏప్రిల్ 24,2020 నుండి 30 వరకు గుర్తించబడింది. అన్ని వయసుల ప్రజలను వ్యాధుల నుండి రక్షించడానికి వ్యాక్సిన్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో ప్రపంచ రోగ నిరోదాక వారోత్సవం జరుగుతుంది. రోగ నిరోధకం అనేది ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో ఒకటి గా గుర్థించబడింది. కాని ఇప్పటికి ప్రపంచంలో 20 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. వారి అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్లు అందడం లేదు. అందరికి వ్యాక్సిన్ వర్క్ అనేది వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2020 యొక్క థీమ్.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ రోగ నిరోధక వారోత్సవంగా  2020 ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

ఎవరు :డబ్ల్యుహెచ్వో

ఎప్పుడు : ఏప్రిల్ 26

కరోనా వైరస్ కట్టడికి ఏపీ ఫార్మసి అనే యాప్ విడుదల :

రాష్ట్రంలో కరోనా(కోవిడ్-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య శాఖ ‘కోవిడ్-19 ఏపీ ఫార్మసి’ అనే పేరు తో ఒక నూతన  మొబైల్ యాప్ ను రూపొందించి ఏప్రిల్ 25న విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం,దగ్గు,శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ శాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్ లో పొందుపర్చాలని మెడికల్ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫిసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : కోవిడ్-19 ఏపీ ఫార్మసి యాప్ విడుదల

ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు :ఏప్రిల్ 26

అథ్లెట్ జూమాఖాతూన్ పై నాలుగేళ్ళ నిషేధం విధింపు  :

డోపింగ్ లో పట్టుబడటంతో భారత మహిళ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతూన్ పై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నాలుగేళ్ళ పాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘డి హైద్రోక్లోరోమిథైల్ టేస్తోస్టిరాన్’ను వాడినట్లు తేలింది. 2018 జూన్ లో గువాహటి వేదికగా జరిగిన అంతర్ రాష్ట్ర చాంపియన్ షిప్ లో జూమా 1500,5000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. ఈ పోటిల సందర్బంగా ఆమె నుంచి జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబోరేటరి(ఎన్ డిటిఎల్) శాంపిల్స్ సేకరించి పరిక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. అయితే అదే శాంపిల్ ను ‘వాడా’ పరిక్షించగా పాజిటివ్ గా తేలడం గమనార్హం. జూమాపై విధించిన ఈ నిషేధం 2018 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా 2018 జూన్ నుంచి నవంబర్ వరకు ఆమె పాల్గొన్న ఈవెంట్స్ లో సాధించిన అన్ని ఫలితాలను రద్దు చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అథ్లెట్ జూమా ఖాతూన్ పై నాలుగేళ్ళ నిషేధం విధింపు

ఎవరు : జూమా ఖాతూన్

 ఎప్పుడు : ఏప్రిల్ 26

అంతర్జాతీయ క్రికెట్ కు పాక్ మహిళ స్టార్ క్రికెటర్ సనా మీర్ రిటైర్మెంట్  :

పాకిస్తాన్ మహిళ క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. తన 15 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల సనా మీర్ పాకిస్తాన్ తరపున 120 వన్డేలు,106 టి20 మ్యాచ్ లు ఆడింది. 2009 నుంచి 2017 మధ్య 137 మ్యాచ్ ల్లో ఆమె పాక్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది. ‘రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయంగా నేనే భావిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో అండగానిలిచిన జట్టు సభ్యులకు,ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’ అని సనా ఏప్రిల్ 25న తెలిపింది. వన్డేల్లో 1,630 పరుగులు చేసిన ఆమె 151 వికెట్లు కూడా తీసింది. తద్వారా పాక్ తరపున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్ కు పాక్ మహిళ స్టార్ క్రికెటర్ సనా మీర్ రిటైర్మెంట్ 

ఎవరు : సనా మీర్

ఎక్కడ :పాకిస్తాన్

ఎప్పుడు : ఏప్రిల్ 26

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *