Daily Current Affairs in Telugu 25&26 June -2022
తొలి సారి రంజీ ట్రోఫీని గెలుచుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్రము :

మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు కల తీరింది ఎన్నో ఏళ్ల ప్రయత్నాలను సఫలం చేసుకుంటూ దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఆ జట్టు రంజీ ఛాంపియన్ గా నిలిచింది. ఆదిత్య శ్రీవాత్సవ సారథ్యంలోని లభి మధ్యప్రదేశ్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ముంబయ్ ని ఓడించింది. 108 పరుగుల స్వల్ప ఛేదనలో తడబడినా 29.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఓపెనర్ యజ్ దూబె (1) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా మరో ఓపెనర్ హిమాంశు మంత్రి (37), శుభమ్ శర్మ (30) తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. వీళ్లిద్దరూ. ఔటైనా. రజత్ పటీదార్ (30 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 113/2తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబయి 25 పరుగులకే ఆలౌటైంది. కుమార్ కార్తికేయ (4/98), గౌరవ్ యాదవ్ (2/53), పార్ట్ సహాని (2/43) ప్రత్యర్థిని కట్టడి చేశారు. సువేద్ పార్కర్ (51), సర్ఫాజాన్ (45), ఆర్మాన్ జాఫర్ (37) రాణించారు. ఒక దశలో 192/3తో ఉన్న ముంబయి.. మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి 77 పరుగుల తేడాతో మిగిలిన 7. వికెట్లు చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ముంబయి 374 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ కు 536 పరుగులు సాధించింది. రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 116, 30 పరుగులు సాధించిన శుభమ్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా ఈ సీజన్ లో పరుగుల వరద పారించిన ముంబయి బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్” దక్కింది. కాగా చంద్రకాంత్ పండిట్ కు కోచ్ గా ఇది అయిదో టైటిల్.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి సారి రంజీ ట్రోఫీని గెలుచుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్రము
ఎవరు: మధ్యప్రదేశ్ రాష్ట్రము
ఎప్పుడు: జూన్ 25
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నీలో రజత పథకం గెలుచుకున్న దీపిక కుమారి జట్టు :

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నీలో దీపిక కుమారి, అంకిత లకత్, సిమ్రన్జత్ కౌర్లతో కూడిన భారత రికర్వ్ జట్టు రజత పతకంతో సరిపెట్టు కుంది. జూన్ 26న ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 1-5 చైనీస్ తైపే చేతిలో పరాజయం చవచిచూసింది. ఒక స్వర్ణం, 2 రజతాలు గెలిచిన భారత్ మొత్తం 3పతకాలతో టోర్నీని ముగించింది. అందులో కాంపౌండ్ విభాగం నుంచే 2 పతకాలు ఉండటం. ఆ రెండింట్లోనూ తెలుగమ్మాయి వెన్నం జ్యోతి కీలకపాత్ర పోషించడం విశేషం. అభిషేక్ వర్మతో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో స్వర్ణం సాధించిన సురేఖ వ్యక్తిగత విభాగంలో రజతంతో మెరిసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నీలో రజత పథకం గెలుచుకున్న దీపిక కుమారి జట్టు
ఎవరు: దీపిక కుమారి జట్టు
ఎప్పుడు: జూన్ 25
ఆర్చరీ ప్రపంచకప్ మిక్స్డ్ లో స్వర్ణం సాధించిన భారత జ్యోతి అభిషేక్ వర్మ :

అడ్డంకులను దాటుతూ.. సవాళ్లను అధిగమిస్తూ.. లక్ష్యానికి గురి పెట్టిన బాణంలా. తిరుగులేని వేగంతో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ దూసుకెల్తో౦ది. విలువిద్యలో పతకాలు కొల్లగొడుతోంది. తాజాగా ప్రపంచకప్ మూడో అంచె పోటీల్లో ఈ విజయవాడ ఆర్చర్ అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించింది. అభిషేక్ వర్మతో కలిసి కాంపౌండ్ మిక్స్ డ్ టీమ్ పసిడి నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత జోడీగా సురేఖ అభిషే రికార్డుల్లోకెక్కారు. వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ప్రపంచకప్ వ్యక్తిగత విభాగంలో ఆమెకు ఇదే తొలి పతకం. జూన్ 25న మిక్సిడ్ ఫైనల్లో సురేఖ జోడీ 152-140 తేడాతో సోపి జీన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. ఆరంభం నుంచి భారత ద్వయం ఆధిపత్యం చలాయించింది. తొలి రౌండ్లో బాణాలను కచ్చితమైన లక్ష్యానికి గురి పెట్టి 10.07 తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్ లో ప్రత్యర్ధి పుంజుకుని ఆ అధిక్యాన్ని ఒక్క పాయింట్ కు తగ్గించింది. మూడో రౌండ్ 33-30తో టైగా ముగిసింది. ఇక కీలకమైన నాలుగో రౌండ్ లో సురేఖ అలీషేక్ జంట తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా రాణించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్చరీ ప్రపంచకప్ మిక్స్డ్ లో స్వర్ణం సాధించిన భారత జ్యోతి అభిషేక్ వర్మ
ఎవరు: జ్యోతి అభిషేక్ వర్మ
ఎప్పుడు: జూన్ 25
‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేతగా నిలిచిన ఖుషీ పటేల్ :

బ్రిటన్ కు చెందిన బయోమెడికల్ విద్యార్థి ఖుషీ పటేల్ ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేతగా నిలిచారు. భారత్ బయట సుదీర్ఘకాలంగా (29 ఏళ్లుగా ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు విజేతల వివరాలను నిర్వహణ సంస్థ ‘ఇండియా ఫెస్టివల్ కమిటీ (ఐఎస్సీ) జూన్ 25న రాత్రి ప్రకటించింది. అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్ గాను, శ్రుతికా మనే రెండో రన్నరప్ ను ఎంపికయ్యారు. పోటీల్లో ముందువరుసలో నిలిచిన 12 మంది ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర పోటీల్లో విజేతలైనవారు కావడం విశేషం. ఖుషీ పటేల్. ఓ వైపు బయోమెడికల్ సైన్సెస్, సైకాలజీ కోర్సులు చేస్తూనే మరోవైపు మోడల్గానూ రాణిస్తున్నారు. ఆమె సొంతంగా వస్త్రాల దుకాణాన్ని సైతం’నిర్వహిస్తున్నారు. ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్- 2022 విజేతగా ఎంపిక కావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వ హిస్తూ తృతీయ ప్రపంచ దేశాలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా గయానాకు చెందిన రోషని రజాక్ ‘మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్- 2022 విజేతగా ఎంపికయ్యారు. నవ్య పైంగొల్ (అమెరికా) మొదటి రన్నరప్ గా, చికితా మలహా (సురినామ్) రెండో రన్నరప్ గా నిలిచారు.
‘క్విక్ రివ్యు :
ఏమిటి: ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేతగా నిలిచిన ఖుషీ పటేల్
ఎవరు: ఖుషీ పటేల్
ఎప్పుడు: జూన్ 25
బంగ్లాదేశ్లో నిర్మించిన అతి పొడవైన వంతె నను ప్రారంబించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా :

బంగ్లాదేశ్లో నిర్మించిన అతి పొడవైన వంతె నను ప్రధాని షేక్ హసీనా జూన్ 25న ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి. మీ.ల పొడవునా ఈ రోడ్-రైలు వంతెనను నాలుగు లేన్లతో నిర్మించారు. నైరుతి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఇతర ప్రాంతాలను కలిపే ఈ వంతెనకు ప్రభుత్వం 3.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. పూర్తిగా బంగ్లాదేశ్ సొంత నిధులతో నిర్మించిన ఈ వంతెన దేశానికి గర్వకారణమని హసీనా కొనియాడారు. వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారికి అభినందనలు తెలిపారు. “ఈ వంతెన మన శక్తి సామర్ధ్యాలకు ప్రతీక. ఇది దేశ ప్రజలందరిదీ” అని పేర్కొన్నారు. ఎన్నో అవరోధాలు ఎదురైనా దీన్ని నిర్మించగలిగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వంతెన విశిష్టతలను ఆమె వివరిం చారు. తొలుత ఈ వంతెన నిర్మాణానికి ప్రపంచబ్యాంకు కన్సార్షియం నిధులందిస్తుందని ఆశించారు. అయితే 2012లో ఈ ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు రద్దు చేసింది
క్విక్ రివ్యు :
ఏమిటి: బంగ్లాదేశ్లో నిర్మించిన అతి పొడవైన వంతె నను ప్రారంబించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎవరు: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎప్పుడు: జూన్ 25
తొలి సారిగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో కనుగొన్న ఒక అరుదైన మాంసాహార మొక్క :

పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఒక అరుదైన మాంసాహార మొక్క తొలిసారిగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆటవీశాఖకు చెందిన పరిశోధక బృందం దీన్ని గుర్తించింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న మండల్ లోయలో ఇది కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం ప్రతిష్టాత్మకమైన ‘జర్నల్ ఆఫ్ జపనీస్ బోటనీ’ అనే జర్నల్ లో ప్రచురితమైంది. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘ఉట్రికులేరియా పుర్సెలాటా ఇది తన ఆకృతుల సాయంలో కీటకాలు, దోమల లార్వాలు, చిన్నపాటి కప్పలను ఒడిసిపట్టి, స్వాహా చేస్తుంది. వాక్యూమ్ ప్రయోగించడం ద్వారా వీటిని తన లోకి లాగేసుకుంటుంది. కిరణజన్యసంయోగ క్రియ ఆధారంగా జీవించే మొక్కలతో పోలిస్తే మాంసాహార చెట్ల తీరు భిన్నంగా ఉంటుంది. ఇవి పెద్దగా పోషకాలు లేని నేలలో నీళ్లలో కనిపిస్తుంటాయి. ఈ మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయని భావిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి సారిగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో కనుగొన్న ఒక అరుదైన మాంసాహార మొక్క
ఎక్కడ: హిమాలయ ప్రాంతంలో
ఎప్పుడు: జూన్ 25
అమెరికా అధ్యక్షుని యొక్క ప్రభుత్వంలో ఉప రక్షణ సహాయ మంత్రిగా నియమించబడిన రాదా అయ్యంగార్ ప్లంబ్ :

భారత సంతతికి చెందిన రాధా అయ్యంగార్ ప్లంబు ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రక్షణ శాఖ ఉప సహాయమంత్రిగా నియమించారు. ఇతర దేశాల్లో అమెరికా రాయబారులుగా నియమితులైన వారిలో భారత సంతతికి చెందినవారు: ఉన్నారు వారిలో .రచనా సద్దేవా – మాలి, పునీత్ తల్వార్ – మొరాకో, షెఫాలి రజ్ఞాన్ దుగ్గల్ – నెదర్లాండ్స్, గౌతమ్ రాణా – స్లోవేకియా.లు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా అధ్యక్షుని యొక్క ప్రభుత్వంలో ఉప రక్షణ సహాయ మంత్రిగా నియమించబడిన రాదా అయ్యంగార్ ప్లంబ్
ఎవరు: రాదా అయ్యంగార్ ప్లంబ్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జూన్ 25
దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశ నూతన అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఎన్నిక :

దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశ నూతన అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఎన్నికయ్యారు. ఫ్రాన్సియా మెర్కెజ్ అనే నల్ల జాతీయురాలు ఉపాధ్యక్షురాలిగాఈ పదవికి ఎన్నికైన తొలి నల్ల జాతీయురాలు గా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను నడిపిన ఫ్రాన్సియా మెర్కెజ్ 2018లో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ బహుమతి ని కూడా గెలుచుకున్నారు,
క్విక్ రివ్యు :
ఏమిటి: దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశ నూతన అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఎన్నిక
ఎవరు: గుస్తావో పెట్రో
ఎక్కడ: కొలంబియా
ఎప్పుడు: జూన్ 25
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |