Daily Current Affairs in Telugu 24-02-2022
ఎప్.పి.పి.ఎస్సి నూతన చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన మాజీ డిజిపి గౌతం సవాంగ్ :

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నూతన ఛైర్మన్ గా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఫిబ్రవరి 24న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీకి ఇన్ చార్జ్ చైర్మన్ గా ఉన్న రమణా రెడ్డి గారు ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గా కెవి రాజేంద్ర రెడ్డి గారు బాద్యతలను నిర్వర్తిస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని :అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం: వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వ భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎప్.పి.పి.ఎస్సి నూతన చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన మాజీ డిజిపి గౌతం సవాంగ్
ఎవరు: మాజీ డిజిపి గౌతం సవాంగ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు :ఫిబ్రవరి 24
హిందుస్తాన్ యూనిలివర్ నాన్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా నితిన్ పరాంజపే నియామకం :

ఎఫ్.ఎం.సి.జి దిగ్గజ సంస్థ హిందుస్తాన్ యునిలివర్ (హెచ్.యు.ఎల్) నాన్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా నితిన్ పరాంజపే ను నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 24 న ప్రకటించారు. 2022 మార్చి 31 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బోర్డు చైర్మన్ ,సియివో ఎండి పదవుల్ని విడదీసే క్రమంలో సంజీవ్ మెహతా ఎండి ,సియివో గా కొనసాగుతారని సంస్థ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హిందుస్తాన్ యూనిలివర్ నాన్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా నితిన్ పరాంజపే నియామకం
ఎవరు: నితిన్ పరాంజపే
ఎప్పుడు :ఫిబ్రవరి 24
టెన్నిస్ లో ప్రపంచంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న రష్యా ఆటగాడు మెద్వెదేవ్ :

రష్యా దేశ ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ టెన్నిస్ ప్రపంచంలో శిఖర స్థానాన్ని ఖాయం ‘చేసుకున్నాడు. ఫిబ్రవరి 24న ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్ లో మెద్వెదేవ్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ దక్కతుంది. కెరీర్ లో ఒకే ఒక గ్రాండ్ స్లామ్ నెగ్గిన మెద్వెదేవ్ కఫెల్నికోవ్, మారత్ సఫిన్ తర్వాత అగ్ర స్థానానికి చేరిన మూడో రష్యా ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్ లో కనీసం సెమీ ఫైనల్ చేరితే నంబర్వన్ ర్యాంక్ నిలబెట్టుకోగలిగే స్థితిలో బరిలోకి దిగిన (సెర్బియా) జరిగిన క్వార్టర్ ఫైనల్ లో అనూహ్యంగా 4-6, 6-7 (4/7) తేడాతో వరల్డ్ నంబర్ 123 జిరి వెస్లీ (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలై అగ్రస్థానాన్ని కోల్పోయాడు. 2020నుంచి జొకోవిచ్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఫెడరర్, నాదల్, జాకోవిచ్, ముర్రేని మినహాయించి గత 18 ఏళ్లలో (2004నుంచి) వరల్డ్ నంబర్ స్థానానికి చేరిన తొలి ఆటగాడు కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: టెన్నిస్ లో ప్రపంచంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న రష్యా ఆటగాడు మెద్వెదేవ్
ఎవరు: రష్యా ఆటగాడు మెద్వెదేవ్
ఎప్పుడు :ఫిబ్రవరి 24
సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా ఫిబ్రవరి 24 :

భారతదేశం అంతటా సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని మెరుగైన మార్గంలో నిర్వహించేందుకు మరియు వస్తువుల తయారీ వ్యాపారంలో అవినీతిని నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24 న సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 24 ఫిబ్రవరి 1944న అమలులోకి వచ్చిన సెంట్రల్ ఎక్సైజ్ మరియు సాల్ట్ యాక్ట్ జ్ఞాపకార్థం. భారతదేశంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ (CBIC) కస్టమ్స్, వస్తువులు మరియు సేవా పన్ను (GST) నిర్వహణకు బాధ్యత వహిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా ఫిబ్రవరి 24
ఎవరు: దేశవ్యాప్తంగా
ఎప్పుడు :ఫిబ్రవరి 24
ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడి గ్రూప్ చైర్మన్ గా కే.ఎన్ రాఘవన్ నియామకం :

ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడి గ్రూప్ యొక్క నూతన చైర్మన్ గా కే.ఎన్ రాఘవన్ గారు నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో రెండేళ్ళ కాలానికి గాను నియమితులయ్యారు. కే.ఎస్ రాఘవన్ గారు ప్రస్తుతం భారత రబ్బర్ బోర్డ్ యొక్క ఎగ్సిక్యుటివ్ గా మరియు IRSGకి భారత ప్రతినిధి బృందంలూ సభ్యునిగా ఉన్నారు. కోట్ డి ఐవోయిర్ నుండి భారతదేశం IRSG ఛైర్‌ను కైవసం చేసుకుంది. IRSG అనేది సహజ రబ్బర్ మరియు సింథటిక్ రబ్బర్ ఉత్పత్తి మరియు వినియోగించే దేశాల యొక్క అంతర్ ప్రభుత్వ సంస్థ
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడి గ్రూప్ చైర్మన్ గా కే.ఎన్ రాఘవన్ నియామకం
ఎవరు: కే.ఎన్ రాఘవన్
ఎప్పుడు :ఫిబ్రవరి 24
.
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |