
Daily Current Affairs in Telugu 23&24 July -2022
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గా దినకర్ గుప్తా నియామకం :

సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి దినకర్ గుప్తాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ (ఏసీసీ) నియమిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గా దినకర్ గుప్తా నియామకం
ఎవరు : దినకర్ గుప్తా
ఎప్పుడు :జులై 23
అత్యున్నత చలనచిత్ర పురస్కారం జెసి డేనియల్ గెలుచుకున్న మలయాళ చిత్ర నిర్మాత కేపి కుమారన్ :

మలయాళ చిత్రనిర్మాత కెపి.కుమారన్ ను కేరళ అత్యున్నత చలనచిత్ర పురస్కారం జెసి డేనియల్ అవార్డుతో సత్కరించారు.మలయాళ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ ఈ అవార్డును గెలుచుకున్నారు.ఈ అవార్డు రూ. 5 లక్షల నగదు, ప్రశంసా పత్రం & ఫలకాన్ని కలిగి ఉంటుంది. అరుమాన్ 1975లో డితే దర్శకుడిగా అరంగేట్ర” అనా మరియు చేసాడు మరియు 1989లో రుగ్మిణి చిత్రానికి మలయాళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యున్నత చలనచిత్ర పురస్కారం జెసి డేనియల్ గెలుచుకున్న మలయాళ చిత్ర నిర్మాత కేపి కుమారన్
ఎవరు : కేపి కుమారన్
ఎప్పుడు :జులై 23
పోలీస్ విభాగాల్లో ఫంక్షనల్ వర్టికల్స్ రూల్స్ నిర్ణయించిన తెలంగాణా రాష్ట్ర పోలిస్ శాఖ :

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ విభాగాల్లో ఫంక్షనల్ వర్టికల్స్ (పని విభజన అంశాలు)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా జులై 23న ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోనే తొలిసారిగా పోలీస్ విధులను మొత్తం 17 అంశాలుగా విభజించారు ఇందులో పోలీస్ స్టేషన్ రిసెప్షన్, స్టేషన్ రైటర్, క్రైం రైటర్, బ్లూకోల్ట్ మొబైల్ పెట్రోకార్లు, క్రైం స్టాఫ్, వారంట్ డ్యూటీ, సమన్స్ డ్యూటీ టెక్ టీం, మెడికల్ సర్టిఫికెట్ డ్యూటీ, నబ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్, సెక్షన్ డ్యూటీ ఇన్చార్జి, డిటెక్టివ్ – ఇన్స్పెక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఇలా పని విభజన అంశాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని డీజీపీ కార్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమన్వయం చేస్తుందని జీఓలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పోలీస్ విభాగాల్లో ఫంక్షనల్ వర్టికల్స్ రూల్స్ నిర్ణయించిన తెలంగాణా రాష్ట్ర పోలిస్ శాఖ :
ఎవరు : తెలంగాణా రాష్ట్ర పోలిస్ శాఖ
ఎక్కడ: తెలంగాణా రాష్ట్ర౦
ఎప్పుడు :జులై 23
ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అద్యక్షుడిగా కరునేంద్ర ఎన్ జాస్తి ఎన్నిక :

ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ప్యాప్సి) అధ్యక్షుడిగా 2022-23 ఏడాదికిగాను కరుణేంద్ర ఎస్. జాస్తి ఎన్నికయ్యారు. జులై 2న జరిగిన 3వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్)ఇందుకు వేదికైంది. సైప్యాక్ వ్యవస్థాపకులైన కరుణేంద్ర విశాఖపట్నంలోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో బీఈ (మెకానికల్) చదివారు. కే లాజిస్టిక్స్ లో భాగస్వామి గానూ ఉన్నారు. మాక్రో మీడియా డిజిటల్ ఇమేజింగ్ తోనూ ఈయనకు అనుబంధం ఉంది. 2019-20లో ఫెడరే షన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి అధ్యక్షుడిగా సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అద్యక్షుడిగా కరునేంద్ర ఎన్ జాస్తి ఎన్నిక
ఎవరు : కరునేంద్ర ఎన్ జాస్తి
ఎప్పుడు :జులై 24
‘ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు 2022’ను ప్రవేశపెట్టి ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం :

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ‘ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు 2022’ను ప్రవేశపెట్టి ఆమోదించింది. అంటార్కిటికాలో ఉన్న మన దేశానికి చెందిన రెండు కేంద్రాలు మైత్రి, భారతిలలో ఉండే శాస్త్రవేత్తలకు, వారి యొక్క పరిశోధనలకు మన చట్టాలు వర్తింపజేసేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు 2022’ను ప్రవేశపెట్టి ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :జులై 24
మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన సిడ్నీ మెలిన్ :

మహిళల 400 మీటర్ల హర్డిల్స్ అమెరికా తార సిడ్నీ మెలిన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఫైనల్లో మెలిన్ 50.68 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న రికార్డు (5141 సెకన్లు)ను మెరుగు పరుచుకుంది. ఈ రేసులో ఫిమ్కే (52,27 సెకన్లు, నెద ర్లాండ్స్), దాలియా మహ్మద్ (53.13 నెరన్లు, అమెరికా) రజత, కాంస్య పతకాలు సాధించారు. 2019లో 52 23 సెకన్లలో 400 మీటర్ల హర్డిల్స్
క్విక్ రివ్యు :
ఏమిటి : మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన సిడ్నీ మెలిన్
ఎవరు : సిడ్నీ మెలిన్
ఎప్పుడు :జులై 24
ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో రజత పథకం గెలుచుకున్న నీరజ్ చోప్రా :

భారత క్రీడాచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు 2021 ఆగస్టు 7 బల్లెం వీరుడు. నీరజ్ చోప్రా ఒలింపిక్స్ స్వర్ణం: కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. ఏడాది లోపే ఆ యోధుడు ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదికపై నిలబడ్డాడు. ఒత్తిడి ఎన్నో రెట్లు పెరిగింది. తడబడినా లక్ష్యాన్ని వీడలేదు. ఈసారి పసిడి పతక గురి తప్పింది కానీ పతకం కాదు. టోక్యో పసిడి గాలివాటం కాదని రుజువు చేస్తూ ఒలింపిక్స్ ను మించి పోటీ ఉండే, అథ్లెటిక్స్ లో అత్యున్నత టోర్నీ అయిన ప్రపంచ చాంపియన్‌షిప్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత అథ్లెట్ గా నీరజ్ చోప్రా చరిత్రక్కెడు. భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సాధించాడు. దేశ ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ సత్తాచాటాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 19 ఏళ్ల “పతక కరవుకు తెరదించాడు. అద్భుత ప్రదర్శనతో దేశానికి వెండి వెలుగులు పంచాడు. పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని ముద్దాడాడు. అర్హత రౌండ్ లో ఒక్కటే త్రో విసిరి 88.39 మీటర్ల ప్రదర్శనతో ఫైనల్ చేరిన ఈ 24 ఏళ్ల అథ్లెట్. తుది పోరులో తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా రాణించాడు. ఫైనల్లో మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానం సాధించాడు. అర్హత రౌండ్ లో నీరజ్ కంటే మెరుగైన ప్రదర్శన (89.91మీ) చేసిన డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా). పతక పోరులో 90. 514మీ. దూరంతో పసిడి పట్టేశాడు. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ నాదెచ్ (88,09మీ) కాంస్యం సొంతం చేసుకున్నాడు చెక్ రిపబ్లిక్ ఆటగాడు కాంస్య పథకం గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో రజత పథకం గెలుచుకున్న నీరజ్ చోప్రా
ఎవరు : నీరజ్ చోప్రా
ఎక్కడ: అమెరికా లో
ఎప్పుడు :జులై 24
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |