
Daily Current Affairs in Telugu 23-07-2021
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎథిక్స్ కమిషన్ చైర్మన్ గా బాన్ కి మూన్ తిరిగి ఎన్నిక :

ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎథిక్స్ కమిషన్ చైర్మన్ తిరిగి ఎన్నికయ్యారు. ఐఓసి సెషన్లో 71 ఓట్లలో 70 ఓట్లు పొంది 3 తహత దక్షిణ కొరియా అధికారి మరో నాలుగేళ్ల కాలపరిమితితో పనిచేస్తారు. 2007 నుండి 2016 వరకు యుఎస్ సెక్రటరీ జనరల్ పనిచేసిన బాన్ కి మూన్ ఈ పాత్రకు మాత్రమే అభ్యర్థి.గా అవకాశం ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎథిక్స్ కమిషన్ చైర్మన్ గా బాన్ కి మూన్ తిరిగి ఎన్నిక
ఎవరు: బాన్ కి మూన్
ఎప్పుడు :జులై 23
యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు భారత తదుపరి హైకమిషనర్ గా బినయ శ్రీకాంత్ నియామకం :

యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు భారత తదుపరి హైకమిషనర్ గా 2002 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ బినయ శ్రీకాంత ప్రధాన్ ను భారత ప్రభుత్వం నియమించింది. బినయ శ్రీకాంత ప్రధాన్ 2004 మరియు 2012 మధ్యప్ మాస్కో , తుర్క్మెనిస్తాన్ మరియు పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయాల్లో సీనియర్ పదవుల్లో పనిచేశారు. త్వరలో ఈ కొత్త నియామకంలో ప్రధాన్ చేరనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు భారత తదుపరి హైకమిషనర్ గా బినయ శ్రీకాంత్ నియామకం
ఎవరు: వినయ శ్రీకాంత్ ప్రదాన్
ఎప్పుడు :జులై 23
తెలంగాణ ఎస్సీ కులాల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ గా బండా శ్రీనివాస్ నియామకం :

తెలంగాణ ఎస్సీ కులాల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ బండా శ్రీనివాస్ మాదిగను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం జులై 23 న ఉత్తర్వులు జారీ చేసారు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన శ్రీనివాస్ విద్యార్ధి దశ నుంచే నాయకుని గా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. క్రీడాకారుడైన శ్రీనివాస్ హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా.ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ గా, జిల్లా టెలికాం బోర్డు సభ్యునిగానూ పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ ఎస్సీ కులాల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ గా బండా శ్రీనివాస్ నియామకం
ఎవరు: బండా శ్రీనివాస్
ఎక్కడ: తెలంగాణ రాష్ట్రం
ఎప్పుడు :జులై 23
2021, జూలై 23న ప్రారంబం అయిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ :

2021, జూలై 23న టోక్యో ఒలింపిక్స్ -2020 ప్రారంభం అయ్యాయి.. షెడ్యూల్ ప్రకారం 2020 ఏడాదే జరగాల్సి ఉన్నా. కరోనా కారణంగా సంవత్సరం పాటు వాయిదా పడిన ఆటలకు 2021, జూలై 23వ తేదీతో తెర లేవనుంది రెండు వారాల పాటు జరిగే క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. క్యాలెండర్ లో తేదీ మారినా. మార్కెటింగ్, ఇతర కారణాల వల్ల టోక్యో ఒలింపిక్స్-2020గానే ఈ క్రీడలను పరిగణిస్తున్నారు. 204 దేశాలకు చెందిన అథ్లెట్లు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఏసీ)లో 206 సభ్య దేశాలు ఉండగా. ఉత్తర కొరియా పోటీల నుంచి గతంలోనే తప్పుకుంది. కరోనా భయంతో ఆఫ్రికా దేశం గినియా కూడా ఆటల్లో పాల్గొనడం లేదని జూలై 22న ప్రకటించింది. దాంతో 204 దేశాలకు చెందిన అథ్లెట్లు బరిలో నిలిచారు. ఐఓసీ ఎంపిక చేసిన శరణార్ధుల జట్టు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
2020 ఒలింపిక్స్-విశేషాలు :
- మొత్తం క్రీడాంశాలు: 33 .
- పాల్గొంటున్న ఆటగాళ్ల సంఖ్య: 11,500
- పోటీల వేదికలు : 42
- అందుబాటులో ఉన్న స్వర్ణ పతకాలు: 339 .
భారత్ నుంచి 127 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. గత డోపింగ్ కేసుల కారణంగా రష్యా దేశంపై నిషేధం కొనసాగుతున్నా. డోపింగ్తో సంబంధం లేని రష్యా క్రీడాకారులకు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అవకాశమిచ్చారు. వీరందరూ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్డీసీ) పేరిట బరిలోకి దిగుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2021, జూలై 23న ప్రారంబం అయిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్
ఎవరు: జపాన్
ఎక్కడ: జపాన్ ( టోక్యో )
ఎప్పుడు :జులై 23
దేశంలోనే తొలి ప్రైవేట్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ స్టేషన్ నాగ్ పూర్ లో ప్రారంబం :

దేశంలోనే తొలి ప్రైవేట్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్ఎ) స్టేషన్ ను నాగపూర్ లో అవుటర్ రింగ్ రోడ్డు, పందుర్ణ గ్రామ సమీపంలో ఏర్పాటు అయింది. ఆయుర్వేదిక్ బ్రాండ్ గా పిలువబడే బైద్యనాథ్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఈ ఎల్ఎన్ఎ స్టేషన్ ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు జూలై 11న ప్రారంభించారు. పెట్రోల్, డిజిల్, సంబంధిత ఉత్పత్తులకు తక్కువ వ్యయం, కాలుష్య రహితమైన ఎల్ఎన్ఎ ఒక తిరుగులేని ప్రత్యమ్నాయంగా ఇది ఉంటుందని గడ్కరీ అభివర్ణించారు. ఎల్ఎన్ఎని విరివిగా వినియోగించడం ద్వారా కేంద్రంపై క్రూడ్ దిగుమతి భారం కూడా తగ్గుతుందన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే తొలి ప్రైవేట్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ స్టేషన్ నాగ పూర్ లో ప్రారంబం
ఎవరు: నితిన్ గడ్కరీ
ఎక్కడ: నాగపూర్ లో
ఎప్పుడు :జులై 23
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |