Daily Current Affairs in Telugu 23-01-2020
అత్యంతచిన్న పసిడి నాణెం తయారుచేసియన స్విట్జర్లాండ్:

ప్రపంచంలోనే అత్యంత బుల్లి బంగారు నాణేన్ని స్విట్జర్ ల్యాండ్ టంకశాల తయారుచేసింది.దీని వ్యాసం2.96 మిల్లి మీటర్లు బరువు 0.063 గ్రాములు ముద్రిత విలువ 1/4 స్విస్ ఫ్రాంక్ (రూ.18.58)ఇలాంటి పసిడి నాణేలను కేవలం 999మాత్రమే తయారు చేశామని ఒక్కో దాన్ని199 ఫ్రాంక్ లకు తయారు చేశామని ఒక్కో దాన్ని 199 ఫ్రాంక్లకు విక్రయిస్తామని టంకశాల పేర్కొంది.ప్రఖ్యాత బౌతికశాస్త్రవేత్త ఐన్ స్టీన్ నాలుకను బయట పెట్టి చూస్తున్న చిత్రాన్ని దీనిపై ముద్రించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంతచిన్న పసిడి నాణెం తయారుచేసియన స్విట్జర్లాండ్
ఎవరు; స్విట్జర్లాండ్
ఎక్కడ:బెర్లిన్
ఎప్పుడు:జనవరి 23
అవినీతి సూచిలో భారత్ కు80వ స్థానం:

అవినీతి సూచీ లో 180దేశాలలో భారత్ 80వ స్తానంలో నిలిచింది.కరప్షన్ పెర్సాప్షన్ ఇండెక్స్ (సిపిఐ)పేరుతో ట్రాన్స్పరన్సి ఇంటర్నేషనల్ సంస్థ దేనిని రూపొందించారు.ప్రబుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి వ్యాపార వర్గాలు నిపుణుల నుంచి వివరాలు సేకరించి దీనిని రూపొందించింది.అవినీతిని కట్టడి చేయడంలో డెన్మార్క్ న్యూజిలాండ్ తొలి ష్తానంలో ఫిన్లాండ్ ,సింగపూర్ ,స్వీడన్ ,స్విట్జర్లాండ్ వంటివి మొదటి స్థానంలో ఉన్నాయి.భారత్ తో పాటు చైనా ,బెనిన్,ఘనా ,మొరాకో లు 80వ స్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అవినీతి సూచిలో భారత్ కు80వ స్థానం
ఎవరు; అవినీతి సూచిలో భారత్ కు80వ స్థానం
ఎక్కడ:దావోస్
ఎప్పుడు:జనవరి 23
దావోస్ లో ప్రపంచ ఆర్టిక నాయకుల బేటిలో కేటి ఆర్ కు అరుదైన గౌరవం :

దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో తెలంగాణా పరిశ్రమల,ఐటి శాఖల మంత్రి కే. తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది.ప్రపంచ ఆర్ధిక నాయకుల బేటికి ఆయన హాజరయ్యారు.వివిధ దేశాల్లోని ప్రబుత్వ అధినేతలు ,ప్రదానమంత్రులు ఇందులో పాల్గొన్నారు.సమావేశంలో రాష్ట్రమంత్రి హోదా గల వారు కేటిఆర్ ఒక్కరే .సాంకేతిక ప్రాదాన్యం ,పాలన అంశంపై ఈ సమావేశం జరిగింది.సెర్బియా, పోలెండ్, ఈస్తోనియా ప్రదానమంత్రులు,బ్రెజిల్,సిన్గపోఒర్,కొరియా ,ఇండోనేషియా,బోట్స్వానా,ఒమాన్,ఇత్యో పియ దేశాలకు చెందిన పలువురు సీనియర్ కేంద్ర మంత్రులతో పాటు కేటిఆర్ ఈ చర్చలో పాలు పంచుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దావోస్ లో ప్రపంచ ఆర్టిక నాయకుల బేటిలో కేటి ఆర్ కు అరుదైన గౌరవం
ఎవరు;కేటిఆర్
ఎక్కడ:దావోస్
ఎప్పుడు:జనవరి 23
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ తో ట్రాంప్ సమావేశం:

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్లుఈఎఫ్)50వార్షిక సమావేశాల్లో పాల్గొన్న అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ పాకిస్తాన్ ప్రదాని అయిన ఇమ్రాన్ ఖాన్ తో జనవరి 22న సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించెందుకు అవసరం అయితే బాసటగా ఉంటానంటూ ఇమ్రాన్ ఖాన్ తో సమావేశంలో అమెరికా అద్యక్షుడు ట్రంప్ తెలిపారు.కాశ్మీర్ వివాదంపై భారత్ ప్రదాని నరేంద్ర మోడితో మాట్లాడతానని ఇమ్రాన్ ఖాన్ కు హామీ ఇచ్చారు.కాగా కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించమని భారత ప్రబుత్వం స్పష్టం చేసింది.కాశ్మీర్ అంశం భారత్ –పాక్ కు సంబంధించి దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు అని భారత ప్రబుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ తో ట్రాంప్ సమావేశం:
ఎవరు; పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్,అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
ఎప్పుడు:జనవరి 22
అంతరిక్షంలోకి పమపనున్న ఇస్రో మహిళా రోబో వ్యోమ మిత్రా :

అంతరిక్షంలోకి మానవులకంటే ముందుగా ఒక మహిళా రోబో వ్యోమ మిత్ర ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు సిద్దం చేయనుంది.మానవ రహిత అంతరిక్ష ప్రయోగాలు ,పరిశోదనలు ,సవాళ్లు అన్న అంశంపై జనవరి 22న బెంగళూర్ లో జరిగిన సదస్స్సులో వ్యోమమిత్ర స్వ్వయంగా ఈ విషయాన్నీ వెల్లడించింది.హలోనా పేరు వ్యోమా మిత్ర నేను గగన్ యాన్ ప్రయోగం కోసం తయారైన నమూనా హ్యుమనాయిడ్ రోబోను అంటూ అందరిని పలకరించింది.గగన్ యాన్ లో తన పాత్ర గురించి వ్యోమ మిత్రా మాట్లాడుతూ వ్యోమగాములని స్నేహితురాలిగా ఉంటూ వారితో మాట్లాడ గలనని తెలిపింది .వ్యోమగాముల ముఖ చిత్రాలను గుర్తించడం ,వారి ప్రశ్నలకు సమాదానం ఇవ్వడం చేస్తుందని తెలిపింది.ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ వ్యోమ మిత్ర అంతరిక్షంలో మనుషులు చేసే పనులను అనుకరించగలనని లైఫ్ కంట్రోల్ సపోర్ట్ సిస్టంను నియంత్రించగలదని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతరిక్షంలోకి పమపనున్న ఇస్రో మహిళా రోబో వ్యోమ మిత్రా
ఎవరు; ఇస్రో
ఎక్కడ:బెంగళూర్
ఎప్పుడు:జనవరి 22