Daily Current Affairs in Telugu 22 July -2022
శ్రీలంక కొత్త ప్రధానిగా నియమితులయిన దినేష్ గునవర్దేన :

రాజపక్స కుటుంబానికి సన్నిహితుడైన సీనియర్ రాజకీయవేత్త, మహాజన ఏక్ సాథ్ పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్ గుణవర్దేన (73) శ్రీలంక కొత్త ప్రధానిగా నియ మితులయ్యారు. దరిమిలా అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె మొత్తం 18 మంది కేబినెట్ సహ్ చరులతో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని గుణవరైనతోపాటు మరో 17 మంది, మంత్రులు ఇందులో ఉన్నారు. దేశంలో నెల కొన్న రాజకీయ అస్థిరత, ఆర్ధిక సంక్షోభం సమ సిపోతాయన్న ఆశాబావం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. కీలకమైన ఆర్థికశాఖ అధ్యక్షుడు రణిల్ విక్రమసింమె వద్దనే కొనసాగుతుండగా. మిగతా మంత్రులకు కౌబలు కేటాయించారు.
- శ్రీలంక దేశ రాజధాని :కోలోంబో
- శ్రీలంక దేశ కరెన్సీ :శ్రీలంకన్ రూపి
- శ్రీలంక దేశ అద్యక్షుడు : రనిల్ విక్రమ సింఘే
క్విక్ రివ్యు :
ఏమిటి : శ్రీలంక కొత్త ప్రధానిగా నియమితులయిన దినేష్ గునవర్దేన
ఎవరు : దినేష్ గునవర్దేన
ఎక్కడ: : శ్రీలంక
ఎప్పుడు :జులై 22
2020కి గాను ఉత్తమ జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘కలర్’ ‘ఫొటో’ చిత్రం :

- జీవిత కధా చిత్రాలు, చారిత్రక గాధలు జాతీయ వేదికపై మెరిశాయి. సామాజిక అంశాలను కళ్లకు కట్టేలా. తెరకెక్కిన చిన్న చిత్రా లకూ జాతీయ పురస్కార గౌరవం దక్కింది.
- 2020కి. గానూ కథాకథనాలు, నటనా ప్రతిభతో అత్యుత్తమంగ నిలిచిన చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం జులై 22న 68వ జాతీయ పురస్కారాల నుప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్ గోపినాథ్ జీవితకథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన సూరం ‘పోట్రు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన -సూర్య ఉత్తమ నటుడిగా, అపర్జా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇదే తొలి జాతీయ అవార్డు,
- మరాఠా యోధుడు చత్రపతి శివాజీ సైన్యాధిపతి. తానాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన ‘రాజ్ ది అన్ తానాసంగ్ వారియర్ ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా నిలిచింది. “అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.
- సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన ‘కలర్’ ‘ఫొటో’ తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ రూపొందించిన తెలుగు చిత్రం ‘నాట్యం ఉత్తమ స్వరాలు, మేకస్ విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది.
- బెస్ట్ మూవీ: సూరరై పాట్రు – ‘తెలుగులో ఆకాశం నీ హద్దురా
- బెస్ట్ యాక్టర్: సూర్య, అజయ్ దేవగణ్
- బెస్ట్ యాక్ట్రెస్: అపర్ణ బాలమురళి
- బెస్ట్ డైరెక్టర్: కె సచ్చిదానందన్ (మళయాళ అయ్యప్పమ్ కోషియమ్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: బిజుమీనన్ ( మళయాళ అయ్యప్పమ్ కోషియమ్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి
క్విక్ రివ్యు :
ఏమిటి : : 2020కి గాను ఉత్తమ జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘కలర్’ ‘ఫొటో’ చిత్రం
ఎప్పుడు :జులై 22
తెలంగాణ ఉర్దూ అకాడమీ నూతన చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన ఖాజా ముజీబుద్దీన్ :

తెలంగాణ ఉర్దూ అకాడమీ నూతన చైర్మన్ గా ఖాజా ముజీబుద్దీన్ జులై 22న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అనేది ఉర్దూ భాష & సాహిత్యం యొక్క ప్రమోషన్, రక్షణ & అభివృద్ధి కోసం మైనారిటీల సంక్షేమ మంత్రిత్వ శాఖ సంస్థ. ఉర్దూ అకాడమీ కార్యకలాపాలు పరిధిలోని స్వయంప్రతిపత్త సెమినార్లు, ముషాయిరాలు మొదలైన వాటికి ఆర్థిక సహాయం అందించడం వంటి సాహిత్య కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి, ఉర్దూ అకాడమీ యొక్క పథకాలు & ప్రాజెక్టు ప్రాథమికంగా ఉర్దూ భాష & సాహిత్యం యొక్క ప్రచారం & రక్షణ, ఉర్దూ మాసపత్రిక ప్రచురణ. ఉర్దూ సాహిత్యం యొక్క ప్రచారం & రక్షణ, ఉర్దూ మాసపత్రిక ప్రచురణ, ఉర్దూ పుస్తకాలు, ఉర్దూ లైబ్రరీలు, ఉర్దూ పీరియాడికల్స్ & న్యూస్ ఏజెన్సీలు, ఉర్దూ రచయితలు & జర్మసిస్టులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఉద్దేశించబడ్డాయి.
- తెలంగాణ రాష్ట్ర రాజధాని :హైదరాబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం :కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ :తమిలసై సౌందరరాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : తెలంగాణ ఉర్దూ అకాడమీ నూతన చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన ఖాజా ముజీబుద్దీన్
ఎవరు : ఖాజా ముజీబుద్దీన్
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు :జులై 22
.ఇ-అమృత్ అనే ఒక అప్లికేషన్ ప్రారంబించిన నీతి అయోగ్ :

COP 26 ప్రెసిడెంట్ అలోక్ శర్మ మరియు NITI ఆయోగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచడానికి మరియు భారతదేశంలో బ్యాటరీ పునర్వినియోగం మరియు రీ సైక్లింగ్ మార్కెట్ ను ప్రోత్సహించడానికి రెండు కొత్త కార్యక్రమాలు ప్రారంభించారు.ఇ-అమృత్ (భారత రవాణా కోసం వేగవంతమైన ఇ-మొబిలిటీ విప్లవం)E-AMRIT (Accelerated e-Mobility Revolution for India’sTransportation)- ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీపై అవగాహన పెంచడానికి తయారు చేసిన ఒక అప్లికేషన్.e-AMRIT యాప్ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలను అంచనా వేయడానికి, పొదుపులను నిర్ణయించడానికి మరియు వారి కలిసలకు భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరియు అంచనా ఔయడానికి, పొదుపులను నిర్ణయించడానికి మరియు వారి వేలికొనలతో భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరియు పరిశ్రమలో అభివృద్ధిపై మొత్తం సమాచారాన్ని పొందేందుకు వీలు కల్పించే ఎంగేజ్మెంట్ టూల్స్ వంటి కీలక సమాచారాన్ని అందిస్తుంది.
- నీతి అయోగ్ స్థాపన : 2015 జనవరి 01
- నీతి అయోగ్ చైర్మన్ :ప్రధాన మంత్రి
- నీతి అయోగ్ సియివో :సుమన్ కే బేరి
- నీతి అయోగ్ ప్రధాన కార్యాలయం :డిల్లి
క్విక్ రివ్యు :
ఏమిటి : .ఇ-అమృత్ అనే ఒక అప్లికేషన్ ప్రారంబించిన నీతి అయోగ్
ఎవరు : నీతి అయోగ్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :జులై 22
ఇంగ్లండ్లోని లీస్టరైషైర్ క్రికెట్ గ్రౌండ్ కు ‘గవాస్కర్ గ్రౌండ్’గా నామకరణం :

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్లోని లీస్టరైషైర్ క్రికెట్ గ్రౌండ్కు ‘గవాస్కర్ గ్రౌండ్’గా నామకరణం చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఇంగ్లండ్ లేదా యూరప్ గడ్డపై ఉన్న క్రికెట్ గ్రౌండ్కు ఒక ఇండియన్ క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. సునీల్ గావస్కర్ తొలి ఆటగాడిగా ఈ అరుదైన ఘనత సాధించి చరిత్రలో నిలిచాడు క్రికెట్లో గావస్కర్ చేసిన సేవలకు గానూ లీస్టర్పైర్ క్రికెట్ అసోసియేషన్ తమ గ్రౌండ్ కు ‘గావస్కర్ గ్రౌండ్’ అని పేరు పెట్టినట్లు తెలిపింది.టెస్టుల్లో టీమిండియా తరపున 10వేల పరుగుల మార్క్ ను అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో 34 సెంచరీలు సాధించి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంగ్లండ్లోని లీస్టరైషైర్ క్రికెట్ గ్రౌండ్ కు ‘గవాస్కర్ గ్రౌండ్’గా నామకరణం
ఎవరు : గవాస్కర్
ఎక్కడ: ఇంగ్లండ్ లో
ఎప్పుడు :జులై 22
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |