Daily Current Affairs in Telugu 22-03-2020
ఎపి గ్రామాలకు 14వ ఆర్ధిక సంఘం నిధులు :

పంచాయితి ఎన్నికలు నిర్వహించని కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిలిపి వేసిన 14ఆర్ధిక సంఘం నిధుల్లో కొంత మొత్తం కేంద్ర ప్రబుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయితిలకు 2018 -19,2019-20 ఆర్ధిక సంవత్సరాలకు కలిపి దాదాపు రూ.3710 కొట్లు విడుదల కావల్సి ఉండగా అందులో 2018-19 ఏడాదికి సంబంధించి బేసిక్ గ్రాంట్ రూపం లో రూ.870.23 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ డైరెక్టర్ బి. కుమార్ సింగ్ మార్చి 20న ఉత్తర్వులు జారీ చేశారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎపి గ్రామాలకు 14వ ఆర్ధిక సంఘం నిధులు
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: మార్చి 22
100 బిలియన్ డాలర్ల కరోన వైరస్ రిలీఫ్ ఫండ్ ప్యాకేజి పై ట్రాంప్ సంతకం :

కొత్తగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్ అయిన కరోన వైరస్ వలన అనారోగ్యానికి గురైన అమెరికన్ లకు కార్మికులకు అనారోగ్య సెలవు ఉండేలా చేయనున్న్నారు.యునైటెడ్ స్టేట్స్ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సందర్బంగా 100బిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజి పై సంతకం చేశారు మహమ్మారి వైరస్ అయిన .COVID-19 వల్ల కలిగె దుష్పరినమాలకు వ్యతిరేఖంగా రక్షణ చర్యలను బలోపేతం చేయడం కోసం 100బిలయన్ డాలర్ల కరోనా వైరస్ రిలీఫ్ ప్యాకేజి లక్ష్యం పెట్టారు. ఈ ఉపశమన ప్యాకేజి కీ అవసరమైన వారికి ఉచిత కరోనా వైరస్ పరీక్ష అనారోగ్య వేతనం మరియు చెల్లించిన కుటుంబ సెలవులను సులబతరం చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 100 బిలియన్ డాలర్ల కరోన వైరస్ రిలీఫ్ ఫండ్ ప్య్కేజి పై ట్రాంప్ సంతకం
ఎవరు:డోనాల్డ్ ట్రంప్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: మార్చి 20
భారతదేశం యొక్క తదుపరి ఉగాండా హైకమిషనర్‌గా అజయ్ కుమార్ :

ఎ .అజయ్ కుమార్ ఉగాండా రిపబ్లిక్ భారత దేశం యొక్క తదుపరి హై కమిషనర్ గా నియమితులయ్యారు. ఎ .అజయ్ కుమార్ ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.అజయ్ కుమార్ 2001 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశం యొక్క తదుపరి ఉగాండా హైకమిషనర్‌గా అజయ్ కుమార్
ఎవరు: అజయ్ కుమార్
ఎక్కడ:ఉగాండా
ఎప్పుడు: మార్చి 20
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఆరోగ్య శాఖ సాంకేతిక సలహాదారుడిగా డాక్టర్ గంగాధర్ నియామకం:

రాష్ట్రం లో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల్లో వేర్వేరు రంగాల నిపుణుల భాగస్వాములను చేయడంలో భాగంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాంకేతిక సలహాదారుడిగా నిమ్స్ నేఫ్రాలజి విభాగం ఆచార్యులు డాక్టర్ టి .గంగాధర్ ను తెలంగాణ ప్రబుత్వం ను నియమించిది.ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న విధులకు అదనంగా ఈ సేవలన్దిస్తారు.ఆరోగ్య శాఖలో అబ్వ్రుద్ది పనులు ప్రనలికు రూపకల్పన కార్యాచరణ అమలు పర్య వేక్షణ తదితర అంశాల్లో ఆరోగ్య మంత్రికి సలహాదారుడిగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆరోగ్య శాఖ సాంకేతిక సలహాదారుడిగా డాక్టర్ గంగాధర్ నియామకం
ఎవరు: డాక్టర్ గంగాధర్
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: మార్చి 22
IAF కోసం తేజస్ యుద్ద విమానాల సేకరణకు DAC ఆమోదం :

భారత వైమానిక దళం కోసం దేశీయ తేజస్ యుద్ద విమానాల సేకరణకు డిఫెన్స్ అక్విజేషణ్ కౌన్సిల్ (డిఎసి) ఆమోదం తెలిపింది.భారత వైమానిక దళం కోసం 83 దేశీయ తేజస్ యుద్ద విమానాలను కొనుగోలు చేయనున్నారు.1300 కోట్ల రూపాయల విలువైన స్వదేశి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి డిఫెన్స్ అక్విజిషణ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: IAF కోసం తేజస్ యుద్ద విమానాల సేకరణకు DAC ఆమోదం
ఎప్పుడు: మార్చి 20
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |